Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జీతాలకూ దిక్కులేదు… ఎంబసీ బిల్డింగులను అమ్మేసుకుంటున్న పాకిస్థాన్…

December 30, 2022 by M S R

పార్ధసారధి పోట్లూరి ……… పాకిస్థాన్ కి చెందిన భూమిని యూదులు కొనబోతున్నారు ! అమెరికాలోని వాషింగ్టన్ DC లో గల తన కాన్సులేట్ కార్యాలయాన్ని వేలానికి పెట్టింది పాకిస్థాన్ ! ఈ వేలంలో అత్యధిక ధరకి బిడ్డింగ్ వేసింది ముగ్గురు. 1. అమెరికాలోని యూదు సమాజం 2. అమెరికాలోని భారతీయ రియల్ ఎస్టేట్ వ్యాపారి . 3. అమెరికాలో ఉంటున్న పాకిస్థాన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి.

యూదు సమాజం వాళ్ళు 6.8 మిలియన్ డాలర్లకి కొంటామని బిడ్ వేశారు. ఆ స్థలంలో తమ ప్రార్ధనా మందిరం [synagogue] కట్టుకుంటారుట ! వేలానికి పిలిచిన టెండర్లలో యూదు సమాజం వాళ్ళు వేసిన బిడ్ పెద్దది. భారతీయ రియల్టర్ 5 మిలియన్ డాలర్లకి బిడ్ వేశాడు. ఇది సెకండ్ లోయస్ట్ బిడ్ ! పాకిస్థాన్ రియల్టర్ 4 మిలియన్ డాలర్లకి బిడ్ వేశాడు!

పాకిస్థాన్ తన కాన్సులేట్ కార్యాలయాన్ని ఎందుకు వేలం వేస్తున్నది ? పాకిస్థాన్ కి చెందిన పత్రిక ‘డాన్ ‘ కధనం ప్రకారం :…..  వాషింగ్టన్ DC లోని R Street NW అనే ప్రదేశంలో 1950 నుండి 2000 సంవత్సరం వరకు పాకిస్థాన్ ఎంబసీకి సంబంధించి డిఫెన్స్ సెక్షన్ కార్యాలయం ఉంది. ఎర్లీ 2000 లో R Street NW నుండి తమ కార్యాలయాన్ని వేరే చోటకి మార్చింది పాకిస్థాన్. అప్పటి నుండి పాత కార్యాలయం ఉపయోగించడం లేదు. R Street NW లో ఉన్న స్థానిక ప్రజలు పాకిస్థాన్ కార్యాలయం పాడు పడ్డది అని, తమకి అసౌకర్యంగా ఉందని ఫిర్యాదు చేశారు సంబంధిత అధికారులకి . దాంతో అమెరికన్ అధికారులు పాకిస్థాన్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు.

Ads

వాడకంలో లేని రాయబార కార్యాలయానికి పన్నులు కట్టాల్సి ఉంటుంది. అదే వాడకంలో ఉన్న ఏ దేశ రాయబార కార్యాలయానికి అయినా ఎలాంటి పన్నులు కట్టాల్సిన అవసరం ఉండదు అవి ఏ దేశంలో అయినా సరే. ఇది అంతర్జాతీయంగా అమలులో ఉన్న విధానం. కానీ వాడకంలో లేని పాత రాయబార కార్యాలయానికి 17 ఏళ్ల నుండి పాకిస్థాన్ పన్నులు కట్టడం లేదు, కానీ తన ఆధీనంలోనే ఉంచుకుంది. ఇప్పుడు దానిని మళ్ళీ పునరుద్దరించాలి అంటే 7 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఇప్పుడున్న పరిస్థితులలో పాకిస్థాన్ వెచ్చించలేదు కాబట్టి పాకిస్థాన్ కాబినెట్ సమావేశం పెట్టి దానిని వేలం వేయడానికి తీర్మానించింది.

***************************************************************

అమెరికాలో రియల్ వ్యాపారంలో ఉన్న పాకిస్థానీలు మాత్రం… యూదు సమాజం వేసిన బిడ్ తక్కువగా ఉందనీ, ఆ బిల్డింగ్ అసలు విలువ ఇంకా ఎక్కువగా ఉంటుందనీ అంటున్నారు. అమెరికాలోని పాకిస్థాన్ రాయబార అధికారులు మాత్రం యూదు సమాజం మరియు భారతీయ రియల్టర్లు సిండికేట్ గా ఏర్పడి, ఎక్కువ ధర రాకుండా చేస్తున్నారనీ, కాబట్టి యూదు సమాజం వేసిన బిడ్ కానీ అలాగే భారతీయ రియల్టర్ వేసిన బిడ్ కానీ మాకు సమ్మతం కాదు అంటున్నారు. మరి పాకిస్థాన్ ప్రభుత్వం వేలం వేయడానికి ఆదేశాలు ఇచ్చింది కదా ?

ఎన్నాళ్ళు అలా వదిలేస్తారు ఆ బిల్డింగ్ ? ఒకవేళ స్థానిక మునిసిపల్ అధికార్లు గత 17 ఏళ్లుగా ఉపయోగించడం లేదు కాబట్టి ఆ బిల్డింగ్ కి పన్నులు కట్టాల్సిందే అని గట్టిగా అడిగితే మాత్రం వచ్చిన కాడికి అమ్మేయాల్సి ఉంటుంది… ఎందుకంటే 17 ఏళ్ల నుండి పన్నులు లెక్కిస్తే దాని మీద పడే వడ్డీని కూడా కలిపితే ఇప్పుడు యూదు సమాజం వేసిన బిడ్ కంటే ఎక్కువే అవుతుంది.

అమెరికాలోని పాకిస్థాన్ రాయబార అధికారులకి జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంది ప్రస్తుతం పాక్ ప్రభుత్వం… కానీ వీళ్ళ పౌరుషానికి మాత్రం తక్కువ లేదు… ఎందుకంటే అమ్మాలి అంటే అది యూదు సమాజం ఎక్కువ ధరకి బిడ్ వేసింది కాబట్టి వాళ్ళకే అమ్మాలి. మరోవైపు యూదు సమాజం వాళ్ళు మేము మా ప్రార్ధనా మందిరం [synagogue] కడతాము అని ముందే బహిరంగంగా చెప్పేశారు.

1947 లో ఇజ్రాయెల్ ఒక దేశంగా ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు… పాకిస్థాన్ ఇజ్రాయెల్ ని ఒక దేశంగా గుర్తించలేదు. అటు ఇజ్రాయెల్ లో కానీ ఇటు పాకిస్థాన్ లో కానీ రాయబార కార్యాలయాలు లేవు. పాకిస్థాన్ పాస్పోర్ట్ లో ఒక్క ఇజ్రాయెల్ దేశానికి తప్ప [Not for Isreal] అని ప్రింట్ చేసి ఉంటుంది… అంటే పాకిస్థాన్ పాస్పోర్ట్ మీద ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళడానికి వీలు లేదు. మరో పక్క సౌదీ అరేబియాతో పాటు UAE దేశాలు ఇజ్రాయెల్ తో ఒప్పందం చేసుకొని రాయబార కార్యాలయాలు తెరిచి దౌత్య సంబంధాలని పునరుద్దరించాయి రెండేళ్ల కిందట. కానీ పాకిస్థాన్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు.

ప్రస్తుతం పాకిస్థాన్ విదేశీ అప్పులు PNR 60 ట్రిలియన్లుగా ఉంది! మూడు రోజుల క్రితమే పాకిస్థాన్ ప్రభుత్వం తమ దేశంలో కానీ విదేశాలలో కానీ ఉన్న స్థలాలు, బిల్డింగ్స్ లు ఏవేవి ఉన్నాయో చూసి, వాటిని అమ్మేసి కాష్ చేసుకోవడానికి గాను Cabinet Committee on Privatisation (CCoP) ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మంచి ప్రైమ్ లొకేషన్ లలో ఉన్న అన్ని ప్రాపర్టీస్ అమ్మకానికి పెడుతుంది. తద్వారా కొన్ని మిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం సమకూర్చుకోవచ్చు!

ప్రస్తుతం అమెరికాలో ఉన్న పాత రాయబార కార్యాలయంతో పాటు న్యూయార్క్ నగరంలో ఉన్న రూజ్వెల్ట్ హోటల్ స్థలం కూడా… భాగస్వామ్య ఒప్పందంతో ఎవరన్నా కలిసి వస్తే డెవలప్ చేయడానికి గాను పాకిస్థాన్ ఆర్ధిక మంత్రి ఇషాన్ దార్ ఛైర్మన్ గా ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ హోటల్ విషయంలో కూడా యూదు సమాజం పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావొచ్చు ఎందుకంటే పాకిస్థాన్ విషయంలో అమెరికన్ యూదు లాబీ చాలా ఆసక్తిగా ఉంది పరోక్షంగా రెచ్చగొట్టే ధోరణిలో!

పేదవాడి కోపం పెదవికి చేటు అన్న సామెత వీళ్ళకి తెలిసి వస్తుందా ? ఎందుకంటే ఒకవైపు పాకిస్థాన్ ప్రభుత్వమేమో తమ పాత రాయబార కార్యాలయాన్ని త్వరగా వేలం వేయమని ఆదేశాలు ఇస్తే… మరోవైపు వాషింగ్టన్ లోని రాయబార అధికారులు మాత్రం యూదు సమాజం వేసిన బిడ్డింగ్ మీద కోపంతో ఇప్పటికిప్పుడు వచ్చిన తొందరేమీ లేదు అని అంటున్నారు… కథ ఇంకా వేచి చూడాల్సిందే…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టీపీసీసీ..! బండి సంజయ్ మీద అసందర్భ వ్యాఖ్యలతో పార్టీకే నష్టం..!!
  • ‘‘ఒక్క పోలీసు లేకుండా ఆర్ట్స్ కాలేజీకి వస్తా… నాకు ధైర్యం ఉంది…’’
  • సీన్ ఛేంజ్..! నాడు ఎంట్రీపై నిరసన… నేడు సీఎం హోదాలో ఘన స్వాగతం…
  • నో తుర్కియే, నో అజర్‌బైజాన్… ఇప్పుడిదే ట్రెండ్… ఎందుకంటే..?!
  • కంగాళీ వెన్నెల..! బాపు చేతులెత్తేశాడు… కెమెరా వీఎస్ఆర్ స్వామి ఫ్లాప్…!!
  • తెలంగాణ ప్రజల చెవుల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం క్యాబేజీ పూలు..!!
  • జీవనపోరాటం… మానవ సంబంధాలన్నీ జస్ట్, మనీబంధాలే…
  • పాపం బమ్మెర పోతన ప్రాజెక్టు… ఎక్కడికక్కడ ఆగి ఏడుస్తోంది…
  • ప్రకృతి సౌందర్యానికి ప్రతీక… సముద్రపు ఒడిలో తేలియాడే గ్రామం..!
  • ఓ చిక్కు ప్రశ్న… పీటముడి… మీరేమైనా విప్పగలరా..? చెప్పగలరా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions