Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అడుగుకో పాక్ గూఢచారి… వీళ్ల ఏరివేతే యుద్ధంకన్నా ప్రధానం..,

May 20, 2025 by M S R

.

ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశం యావత్తూ కోరుకున్నది ఒక్కటే
దేశం లోపల ఉన్న ద్రోహుల పనిబట్టాలని
ఇప్పుడు NIA ఆ పనిలోనే ఉంది
ఇప్పటికీ 11 మంది అయ్యారు
ఈ 11 మందీ మన దేశ రహస్యాలను పాకిస్తాన్ కు చేరవేస్తున్న నేరం కింద అరెస్ట్ అయ్యారు

ఒక రకంగా వీళ్ళు ఇండియాలో ఉంటున్న పాకిస్తాన్ ఏజెంట్లు
దేశవ్యాప్తంగా ఇలాంటి పాకిస్తాన్ గూఢచారులను పట్టుకునేందుకు ప్రస్తుతం NIA అనేక రాష్ట్రాల్లో జల్లెడ పడుతుంది
రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు జరుగుతాయి

Ads

***
జ్యోతీ మల్హోత్రా… మొన్నటిదాకా ఆమె ఒక యూ ట్యూబర్గా మాత్రమే చాలామందికి తెలుసు
జో ట్రావెలర్ పేరిట టూరిస్ట్ స్పాట్లు తిరుగుతూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది
యూ ట్యూబ్ లోనూ.. ఫేస్ బుక్ లోనూ.. ఇన్స్టాగ్రామ్ లోనూ ఈవిడకు మూడు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు
అందం అటువంటిది

6 నెలల క్రితం ఓ భారతీయుడు ఈవిడ మీద తనకు అనుమానంగా ఉందని NIA ని అలర్ట్ చేస్తూ ఓ ట్వీట్ పెట్టాడు
ఆ ట్వీట్ లో అతడు ఓ వీడియో కూడా జత చేశాడు
ఆ వీడియోలో జ్యోతి వాఘా చెక్ పోస్ట్ వద్ద పాక్ సైనికులకు షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించింది
జ్యోతి ముగ్గురు సైనికులకు షేక్ హ్యాండ్ ఇచ్చింది
కానీ ఎవరూ చూడకుండా ( చూడట్లేదు అనుకుని)
ఒకడికి మాత్రం షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టుగా నటిస్తూ చేతిలో పెన్ డ్రైవ్ పెట్టింది

అప్పటినుంచి ఆవిడ మీద NIA నిఘా పెట్టింది
తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ,
ఇండియాలో పాక్ హై కమిషన్ ఉద్యోగి డానిష్ తో ఆవిడ సంబంధాలు బయటపడ్డాయి
తర్వాత కథ అందరికీ తెలిసిందే

***
దేవేంద్ర సింగ్ పంజాబ్ లోని పాటియాలా కాలేజీలో MA మొదటి సంవత్సరం చదువుతున్న స్టూడెంట్
రోజూ కాలేజీకి పోతాడు వస్తాడు
ఇంట్లో వాళ్లకు అంతే తెలుసు
కానీ అతడు ఇండియాకు వ్యతిరేకంగా పాక్ ISI తరపున పనిచేస్తున్నాడని మూడో కంటికి కూడా తెలీదు
నేరస్తుడు ఎంత తెలివైన వాడు అయినా ఎక్కడో ఓ చోట పొరపాటు చేసి దొరికిపోతాడు

దేవేంద్ర సింగ్ ఈ కాలం కుర్రాడు కదా
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు
ఓసారి సరదాగా హీరోయిజం కొద్దీ ఫేస్ బుక్ లో పిస్టల్ ఫోటో షేర్ చేశాడు
కానీ తొందరలో ఆ పిస్టల్ పాకిస్తాన్ ది అని మర్చిపోయాడు
ఆ పొరపాటే అతడ్ని NIA కి పట్టించింది

***
సిరాజ్…. సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తాడు
పాక్ నుంచి సుగంధ ద్రవ్యాలు.. అత్తర్లు.. మసాలా దినుసులు దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తాడు
భార్య ఆరేళ్ల పిల్లాడు ఉన్నారు
వాళ్లకు కూడా తెలీదు
సిరాజ్ సుగంధ ద్రవ్యాల వ్యాపారం పేరుతో పాక్ వెళ్ళి ఇక్కడి రహస్యాలను అక్కడికి చేరవేస్తూ గూఢచర్యం చేస్తున్నాడని

NIA అతడి ఇంటిమీద దాడి చేసి కస్టడీలోకి తీసుకున్నప్పుడు భార్యకు తెలిసింది
తన భర్త పాక్ గూఢచారి అని
అంతే కుప్పకూలిపోయి భోరున ఏడ్చింది

***
ఇంకోడు సెక్యూరిటీ గార్డుగా చేస్తున్నాడు
లోకానికి అతడొక సెక్యూరిటీ గార్డ్ మాత్రమే
కానీ ఇండియాలో అతడు ISI నియమించిన గూఢచారి అని అతి కొద్దిమందికే తెలుసు
పైకి ఎవరికీ అనుమానం రాకుండా సాధారణ జీవితం గడిపేవాడు

పాక్ నుంచి వచ్చిన డబ్బులు తన బావమరిది ఖాతాలో జమ చేసేవాడు
అయినా దొరికిపోయాడు
ప్రస్తుతం NIA కస్టడీలో ఉన్నాడు

***
మిగిలిన వాళ్ళదీ ఇదే కథ
స్లీపర్ సెల్స్, ఏజెంట్లు, స్పైస్…

మన మధ్యనే మన చుట్టూ ఉంటారు
మేక తోలు కప్పుకున్న పులుల మాదిరి ఉంటారు
ఎప్పుడు ఎవరి మీద పంజా విసురుతారో తెలీదు
నిశ్శబ్దంగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు

వాళ్ళు
యూ ట్యూబర్ కావొచ్చు
వ్యాపారస్తుడు కావొచ్చు
సెక్యూరిటీ గార్డ్ కావొచ్చు
సాధారణ పౌరుల్లానే విధులు నిర్వహిస్తుంటారు

మన మధ్యనే ఉంటారు
అయితే హిడెన్ ఎజెండా వేరు ఉంటుంది
మోస్ట్ డేంజరస్ పర్సన్స్
వీళ్ళని ఏరివేయడం పాక్ తో యుద్ధం కన్నా ముఖ్యమైనది

***
ప్రస్తుతం మనం సోషల్ మీడియా యుగంలో ఉన్నాం
నెటిజెన్లను సోషల్ మీడియా ఎంత పైకి లేపగలదో
అంత పాతాళంలోకి తొక్కగలదు
ప్రస్తుతం NIA అనుమానిత సోషల్ మీడియా అకౌంట్లు జల్లెడ పడుతున్నాయి

విద్వేష పూరిత ప్రసంగాలు కానీ కంటెంట్ కానీ ఉంటే రెడ్ మార్క్ చేసుకుంటున్నాయి
వాళ్ళ అకౌంట్లో మ్యూచువల్స్ ద్వారా వాళ్ళు ఎటువంటి వాళ్ళో అంచనా వేస్తున్నాయి
సైలెంట్ గా నిఘా పెడుతున్నాయి
దాంతో తిమింగలాలే వలలో పడుతున్నాయి
ఈలెక్కన దేశంలో అంతర్గతంగా పేరుకుపోయి ఉన్న దేశ ద్రోహులను పూర్తిగా ఏరివేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టకపోవచ్చు…. పరేష్ తుర్లపాటి 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions