పాల్కీ శర్మ… ఇంగ్లిష్ టీవీల్లో న్యూస్, విశ్లేషణలు చూసే ప్రేక్షకులు బాగా ఆదరించి పేరు… ఆమె వ్యాఖ్యలకు ఓ క్రెడిబులిటీ ఉంది… తెలుగు టీవీల్లో న్యూస్ విభాగాలు పనిచేసే స్టాఫ్, రుధిర ప్రజెంటర్లు, పౌడర్ దిగ్గజాలు, పోస్కో పెద్ద తలకాయలు గట్రా ఆమెకు కనీసం ఓ వంద మైళ్ల దూరంలో ఉంటారేమో… కయ్ కయ్ అని హైపిచ్‌లో అరిచే ఆర్నబ్‌కన్నా కూడా చాలారెట్లు నయం ఆమె… ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే దానికి ఓ నేపథ్యం ఉంది…
ఎన్డీటీవీని తీసేసుకున్న ఆదానీ ఆమెను న్యూస్ హెడ్‌గా చేయబోతున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి కదా… మంచి నిర్ణయమే అని అందరూ అభిప్రాయపడ్డారు… కానీ ఆమె వెళ్లలేదు… బహుశా ఏమైనా టరమ్స్ కుదరలేదేమో… ఫస్ట్ పోస్టులో చేరింది… దానికి పాల్కీ శర్మ పెద్ద బూస్టర్… కానీ ఆమెకు ఇందులో చేరడం వల్ల ప్రయోజనం లేదు, తన ఇమేజీని పోగొట్టుకోవడమే… ఆమె సొంతంగా యూట్యూబ్ చానెల్ పెట్టి, ఇవే వార్తావ్యాఖ్యలు గనుక చేస్తే ఎక్కువ రీచ్, ఎక్కువ రెవిన్యూ, ఎక్కువ స్వేచ్ఛ లభించేవేమో… ఈ కొత్త వీడియోలను న్యూస్18 వాడుకుంటోంది… కొత్త తరహా అగ్రిమెంట్ కావొచ్చు బహుశా…
సరే, ఆ లెక్కలన్నీ చూసుకునే చేరి ఉంటుందిలే… దాన్నలా వదిలేస్తే ఫస్ట్ న్యూస్ అనాలిసిస్ బీబీసీ మీద ఎక్కుపెట్టింది వాంటేజ్ పేరిట… బీబీసీ అనగానే ఎవ్వరూ ఏమీ అనొద్దన్నంత పవిత్రంగా వేరే మీడియా హౌజులు భయపడిపోయాయి… యాంటీ నేషన్ బీబీసీ మీద విమర్శకు ఎందుకు సందేహించాలి..? ఆ వీడియో చూస్తుంటే మొన్న ముచ్చట పబ్లిష్ చేసిన పాయింట్లే అవి దాదాపుగా…
Ads
బీబీసీ చెత్త పాత్రికేయం..! పాత పెంటను తవ్విపోస్తోంది ఎందుకో..!!
బీబీసీ తిక్క వీడియోలను, విష ప్రచారాన్ని కాంగ్రెస్ వాడుకుంటోంది… అది అందులోనే విభేదాలకు దారితీస్తోంది… కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఏకే ఆంటోనీ కొడుకు అనిల్ ఆంటోనీ తీవ్రంగా స్పందించాడు… బీబీసీ చేసే ప్రచారాన్ని భారత సార్వభౌమాధికారం, ఆత్మాభిమానం కోణాల్లో చూడాల్సి ఉండగా, ఆ దిక్కుమాలిన వీడియోలకు పార్టీ ప్రచారం కల్పించడం ఏమిటని ప్రశ్నించాడు… నిజం చెప్పాలంటే బీజేపీలోనే ఎవరికీ ఇలా అటాక్ చేతకాలేదు…
ప్రస్తుతం కేరళ డిజిటల్ మీడియా సెల్‌లో పనిచేస్తున్న అనిల్ ఆంటోనీ అల్లాటప్పా స్ట్రీట్ కార్యకర్త కాదు… స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో ఎంఎస్ చేసిన తను ఇప్పుడు యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని మేనేజ్‌మెంట్ స్కూల్ అడ్వయిజర్ బోర్డు మెంబర్… చాలు కదా… తను లేవనెత్తిన ప్రశ్నకు బదులు ఇవ్వలేక కాంగ్రెస్ తనను సస్పెండ్ చేసి, అర్జెంటుగా మరో వ్యక్తిని తన ప్లేసులో నియమించింది… ఇదుగో ఇలాంటి చర్యలే కాంగ్రెస్ పార్టీని మరింతగా జనంలో పలుచన చేస్తుంటాయి…
పాల్కీ శర్మ వద్దకు వద్దాం… ఆర్నబ్‌కూ ఆమెకూ తేడా ఏమిటంటే… ఆర్నబ్ అరుస్తాడు, కరుస్తాడు, ఎగురుతాడు, ఆవేశపడతాడు, తన సొంత భావాల్ని రుద్దే ప్రయత్నం చేస్తాడు… కానీ పాల్కీ అలా కాదు… కూల్… తను ఎమోషనల్ అయిపోదు… విషయం ఏమిటో అర్థమయ్యేట్టుగా వివరిద్దాం, ప్రేక్షకులకే సొంత అభిప్రాయం ఏర్పరుచుకునే అవకాశం ఇద్దాం అనేది ఆమె సూత్రం… ఏ భావజాలాన్నీ మెదడుకు రుద్దుకుని, ప్రతి విషయాన్ని ప్రిజుడీస్ కోణంలో పరిశీలించే అపాత్రికేయమే రాజ్యమేలుతున్న వర్తమానంలో ఆమె ఎంతమేరకు స్వచ్ఛంగా ఉండగలదో వేచి చూడాలి…
Share this Article