సినిమాల్లో పాత్రను బట్టి కొన్ని డైలాగ్స్ ఉంటాయి… ఏదో ఓ పాత్ర ఏవో డైలాగ్స్ చెప్పినంతమాత్రాన అవి ఆ దర్శకుడు, కథారచయిత, డైలాగ్స్ రచయిత అభిప్రాయాలేమీ కావు… అర్థం చేసుకోవచ్చు, కానీ కొన్ని డైలాగ్స్ సొసైటీపై ప్రభావం చూపిస్తాయి… ఉదాహరణకు ఏదేని సినిమాలో ఓ డాక్టర్ పాత్రలో ఏదేని వ్యాధి మీద ఏవేవో తెలిసీతెలియని వ్యాఖ్యలు చేయిస్తే, ప్రేక్షకులు వాటిని నిజమేనేమో అని భ్రమపడే ప్రమాదం ఉంది…
అందుకే మాటల రచయిత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి… అఫ్‌కోర్స్, దర్శకుడికి ముందుగా ఈ సోయి ఉండాలి… బ్రో సినిమాకు సంబంధించిన ఓ పాత్ర మాటలు ఇలాంటివే… ఓ సన్నివేశంలో ఓ డాక్టర్ పార్కిన్సన్స్ వ్యాధి గురించి మాట్లాడిన మాటలపై ప్రముఖ కార్టూనిస్ట్ సురేంద్ర (Surendracartoonist) తన వాల్ మీద రాసుకున్న ఒక పోస్టు ఆలోచనాత్మకంగా ఉంది… పైగా అది స్వీయానుభవం కాబట్టి తను చెప్పినదానికి విశ్వసనీయత కూడా వచ్చింది… అది యథాతథంగా…
What is this ‘Bro’? మన సినిమాల్లో డాక్టర్లు మాట్లాడేవి రెండే మాటలు . ఒకటి “పేషెంట్ పరిస్థితి సీరియస్ గా ఉంది. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం”. రెండు “మా ప్రయత్నం మేం చేసాం. ఆ దేముడిదే భారం”. కానీ బ్రో సినిమాలో కొంచం వెరైటీ గా చూపించారు. ఈ సినిమాలో హీరో తల్లికి పార్కిన్సన్ ప్రాబ్లెమ్ ఉంటుంది.
Ads
దానికి డాక్టర్ ” ఇది పార్కిన్సన్ ప్రాబ్లెమ్. దీనికి చికిత్స ఇండియా లో లేదు. US వెళ్లాల్సిందే” అంటాడు . మాట్లాడింది రెండే ముక్కలు.రెండూ తప్పులే. పార్కిన్సన్స్ ప్రాణాంతకమైన వ్యాధి కాదు మందులతో కుదుట పడుతుంది అని ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు ఘోష పెడుతున్నా ఈ అవగాహనా రాహిత్యం ఎందుకో ?
పార్కిన్సన్ ప్రాబ్లెమ్ కి ట్రీట్మెంట్ ఉంది, హేండిల్ చెయ్యగలిగిన డాక్టర్స్ మన ఇండియాలోనే ఉన్నారు. దానికి నేనే బెస్ట్ example . నేను వృత్తిరీత్యా cartoonist ని. రోజూ బొమ్మలు గీయాల్సి ఉంటుంది . దాదాపు 10 years గా డాక్టర్స్ సహాయంతో నేను పార్కిన్సన్ తో పోరాడుతున్నాను. పార్కిన్సన్స్ ప్రధాన సమస్య ఐన hand tremors , నా బొమ్మల క్వాలిటీ ని దెబ్బ తీయటంతో చాలా struggle అయ్యాను.
ఎన్నో ఆసుపత్రులు , డాక్టర్ల చుట్టూ ప్రదక్షణలు, ఎన్నెన్నో మందులు, వాటి సైడ్ ఎఫెక్ట్స్ తో అవస్థల తర్వాత 2015 లో అది పార్కిన్సన్స్ అని నిర్ధారణ అయింది. కొన్నేళ్లు మందులతో మేనేజ్ చెయ్యటం, తరవాత DBS (Deep brain stimulation) గురించి విని Hyderabad “City Nuero Centre ” లో న్యూరో డాక్టర్లు RRR (Dr Roopam , Dr Rajesh , Dr Rupmini ) లను సంప్రదించటం జరిగింది.
వారు DBS కి ఇదే సమయం అని నిర్ధారించి , బ్రెయిన్ సర్జరీ చెయ్యటం జరిగింది . దీని మూలంగా నా సమస్య చాలావరకు కంట్రోల్ అయింది. నా ప్రొఫెషన్ కొనసాగించటం జరిగింది. Hats off to RRR టీం. పార్కిన్సన్ ట్రీట్మెంటు , DBS surgeries మన ఇండియాలో హైదరాబాద్ వంటి నగరాల్లో డాక్టర్స్ చేస్తున్నారు అనే అవగాహన కల్పించటమే ఈ పోస్ట్ ముఖ్య ఉద్దేశ్యం…
Share this Article