సీత… మనకు చాన్నాళ్లుగా తెలిసిన మంచి నటి… తన మొదటి భర్త పేరు పార్తీబన్… (1990 నుంచి 2001 వరకు తనతో ఉంది, తరువాత విడాకులు, తొమ్మిదేళ్ల తరువాత మరొకరితో పెళ్లి, ఆరేళ్లలోనే పెటాకులు…) సదరు పార్తీబన్ ఓ వ్యాఖ్య చేశాడు…
తను యాక్టర్, డైరెక్టర్… కాకపోతే నోటి మీద అదుపు కాస్త తక్కువ… ప్రకాష్ రాజ్, కమలహాసన్, సిద్ధార్థ్, కస్తూరి, చిన్మయి, సుచిత్ర బాపతు… తమిళంలో ఈ కేరక్టర్ల జాబితా పెద్దదే… మొన్నామధ్య ఏదో కూశాడు… సారీ, నిజానికి తను చెప్పింది కరెక్టే…
కథను ఎవడు పట్టించుకున్నాడు, తమన్నా డాన్స్ ఉంటే చాలు, నడుస్తున్నయ్ సినిమాలు అనేది తన కామెంట్… సోషల్ మీడియా దాన్ని వక్రీకరించింది… తనేదో తమన్నాను కించపరుస్తున్నాడు అని మొదలుపెట్టింది ట్రోలింగ్… థూ దీనమ్మ నాకెందుకొచ్చిన పెంట ఇది అనుకున్నాడేమో ఏమో, సారీ చెప్పాడు, లెంపలేసుకున్నాడు, నా ఉద్దేశం అది కాదు అన్నాడు… కానీ ఎవడు వింటాడు, ఆల్రెడీ గాయి గత్తర అయిపోయాక…
Ads
ఎస్, తను జైలర్, బాక్ సినిమాలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడని అందరూ అనుకున్నారు… అసలే జైలర్ రజినీకాంత్ సినిమా… ఇదంతా ఎటో పోయి, ఇంకెటో దారితీస్తుందని గ్రహించి వెనక్కి తగ్గాడు… నిజానికి జైలర్ సినిమాలో కథ ఏముందని..? తొక్కలో సగటు తమిళ స్టార్ హీరో రొటీన్ ఇమేజీ బిల్డప్ రొడ్డ కొట్టుడు సినిమాయే కదా… ఆ వయస్సులో పాపం తమన్నా పక్కన డాన్సాడటానికి ఫాఫం రజినీకాంత్ ఎంత కష్టపడ్డాడో… మన చిరంజీవిలాగా..! (కోలీవుడ్‌లో కూడా ఓ శేఖర్ మాస్టర్ ఉన్నట్టున్నాడు…)
మరీ ఆ సినిమాలో ఓ పాట… దా దా, రావాలయ్యా రా రా అని వెగటు బాడీ లాంగ్వేజీతో… చేతులను తొడల నడుమకు తీసుకుపోతూ అశ్లీలపు సైగలు చేస్తుంటుంది తమన్నా… వ్యాంప్ తరహా పాత్రలు వేసేవాళ్లు కూడా అలా చేయరు… కానీ పేరుకు అవి స్టెప్పులు… ఇక బాక్ సినిమాలో రాశీ ఖన్నా, తమన్నా… ఏక్‌కేఏక్ ఎక్స్‌పోజింగు… మరి పార్తీబన్ చేసిన వ్యాఖ్యలో తప్పేముంది..? కాకపోతే తను ఆమెను టార్గెట్ చేసి కామెంట్స్ చేయలేదు… కథను విడిచిపెట్టి ఇలాంటి ఆకర్షణలతో సినిమాలు తీసేస్తున్నాం మనం అనేది తన భావన…
కానీ ఈ సోషల్ మీడియా యుగంలో అవెవడు పట్టించుకుంటాడు..? దొరికాడురా పార్తీబన్ అని పట్టుకుని ఉతికి ఆరేశారు… వెరసి తను నోరుమూసుకున్నాడు… ఒకప్పటి సినిమాలతో పోలిస్తే ఇప్పుడు భిన్నమైన కథల్ని ఏ స్టార్ హీరో యాక్సెప్ట్ చేస్తున్నాడు..? తమిళ, కన్నడ, తెలుగు… అందరూ అదే… ఒకటే పోకడ… కథలెవడికి కావాలిరా భయ్ అన్నట్టుగా ఏదో మసాలా… అంతే…!
Share this Article