.
మలయాళ సినిమా రాను రాను కుదేలవుతోంది,.. మార్చిలో 15 సినిమాలు రిలీజ్ చేస్తే ఒకటే హిట్… వరుసగా బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్… 194 కోట్ల వ్యయానికి గాను వచ్చిన వసూళ్లు 26 కోట్లు… ఇదీ ఆ ఇండస్ట్రీ విడుదల చేసిన లెక్కలు…
నిజానికి మనవాళ్లతో పోలిస్తే మలయాళ ఇండస్ట్రీ తక్కువ ఖర్చుతో, మంచి కథలతో, భిన్న ప్రయోగాలు చేస్తుంటుంది… ఒకవేళ సినిమా నడవకపోయినా పెద్దగా నష్టం ఉండదు… కానీ కొన్నాళ్లుగా మనల్ని చూసి వాళ్లూ వాతలు పెట్టుకుంటున్నారు… నిర్మానవ్యయం పెరిగింది… అదీ అసలు ఆందోళన…
Ads
నిజానికి ఈ రిపోర్టు కరెక్టే… మాలీవుడ్ ఆందోళనకు అర్థముంది… ఈ సంవత్సరం మలయాళ ఇండస్ట్రీలో మొత్తం 69 సినిమాలు రిలీజ్ చేస్తే తిరిగి వసూలైనవి 302 కోట్లు, అంటే సగటున ఒక్కో సినిమా 4.3 కోట్ల దాకా రికవరీ చేసుకుంది…
కానీ కన్నడ ఇండస్ట్రీ ఎవరికి ఏమని చెప్పుకోవాలి… అది మరీ ఘోరం… రెండేళ్లు ఫుల్ జోష్‌లో ఉన్న శాండల్‌వుడ్ మళ్లీ చతికిలపడింది… ఈ సంవత్సరమే చూసుకొండి… మొత్తం 86 సినిమాలు రిలీజయ్యాయి… తమిళంతో ఈక్వల్…
కానీ వసూళ్లు సగటున ఒక సినిమాకు జస్ట్ 32 లక్షల రికవరీ… అంతే… మరీ దారుణం కదా… అంటే ప్రచార వ్యయం కూడా తిరిగి రాలేదు… థియేటర్ల కరెంటు బిల్లులు కూడా రావడం లేదన్నమాటే కదా…
రెండుమూడేళ్లు వరుస నష్టాలతో భయపడిపోయిన హిందీ ఇండస్ట్రీ చాలా నయం… కోలుకుంటోంది… పాత దెబ్బల నుంచి తేరుకుంటోంది… 70 సినిమాలు రిలీజైతే ఈ ఏడాది 1161 కోట్ల వసూళ్లు… అంటే సగటున ఒక్కో సినిమా 16 కోట్ల పైచిలుకు…
ఇవన్నీ థియేటర్ లెక్కలు… ఆడియా, టీవీ, డిజిటల్ రైట్స్ ఆదాయం వేరే… ఇవే తెలుగులో లెక్క చూస్తే ఏకంగా 96 సినిమాలు రిలీజ్ చేశారు… వచ్చినవి 645 కోట్లు… అంటే సగటున 6.71 కోట్లు… కాస్త నయమే అనిపించినా సరే, హిందీతో పోలిస్తే చాలా తక్కువ…
తమిళంలో 86 సినిమాలు రిలీజైతే వచ్చిన వసూళ్ల డబ్బు 495 కోట్లు… అంటే సగటున జస్ట్, 5.75 కోట్లు… ఇప్పుడు చెప్పండి అసలు ఏడవాల్సింది శాండల్ వుడ్ కదా… ఇప్పట్లో గాడిన పడేసే పెద్ద సినిమాలు కూడా ఏమీ లేవు కన్నడంలో…!!
Share this Article