.
మునుపటి చేగు వేరా బాపతు కేరక్టర్ల పవన్ కల్యాణ్ కాదు కదా ఇప్పుడు… సనాతన ధర్మరక్షణకు నడుం కట్టిన నవ కాషాయ ధీరుడు… సో, మహాకుంభమేళాకు వెళ్లాలి… తన ప్రజెన్స్ అక్కడ కనిపించాలి… కనిపించింది…
దక్షిణ భారత గుళ్ల సందర్శన అయిపోగానే నేరుగా ప్రయాగరాజ్ వెళ్లిపోయాడు తన సతీమణి అన్నా లెజనోవాతోపాటు… తోడుగా కొడుకు అకీరా, ఎల్లప్పుడూ వెంట నడిచే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా…!
Ads
గుడ్.., పుణ్యస్నానాలు, గంగాహారతి అయిపోయాయి… ఆ ఫోటోలు, వీడియోలు వాట్సప్ గ్రూపుల్లో ప్రత్యక్షమయ్యాయి… మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కవర్ చేసింది… సరిపోయింది… కానీ చాలామంది దృష్టి ఒక్కచోట ఆగిపోయింది… అది పవన్ కల్యాణ్ శరీరంపై కనిపిస్తున్న జంధ్యం… వేలికి దర్భతో చేసిన ఉంగరం కూడా…! (పుణ్యస్నానాలకు కూడా దర్భ ఉంగరాలు ధరిస్తారా..?)
తనెవరు..? కాపు..! ఓసీ కాపు కావచ్చు, తూర్పు కాపు, మున్నూరు కాపు ఎవరైనా సరే శూద్ర వర్ణమే కదా… శూద్రులు జంధ్యం వేయరు కదా, మరి పవనుడు ఎందుకు వేశాడనేది డౌటనుమానం చాలామందిలో… గూగుల్‌ను సెర్చితే ‘‘ కాపులు యజ్ఞోపవీతం (జంధ్యం) ధరిస్తారు. జంధ్యం వేసుకోవడం వైదిక సాంప్రదాయం’’ అని ఓచోట కనిపించింది… వికీ కాదులెండి… కానీ నిజమా..?
ఒక సమాచారం మేరకు… మన వర్ణపటంలో పైన కనిపించే బ్రాహ్మణులకు యజ్ఞోపవీతం సరేసరి… తరువాత క్షత్రియులు వేస్తారు… కాస్త దిగువన వైశ్యులు కూడా జంధ్యం ధరిస్తారు… వెనుకబడిన కులాల్లో పద్మశాలీలు, విశ్వబ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులు కూడా వేసుకుంటారు… శూద్రుల్లో జంధ్యం వేయరు… కానీ బలిజలు వంటి కొన్ని సెక్షన్లలో (క్షత్రియ బలిజలు) జంధ్యం వేస్తారుట… లింగాయత్‌లు కూడా… ఇలా బ్రాహ్మణేతరుల్లో జంధ్యం ధరించే కులాలు కొన్ని ఉన్నాయి…
ఐతే పవన్ కల్యాణ్ జంధ్యం కథ ఏమిటి..? తను ఓసీ కాపు… వాళ్లలో జంధ్యం వేసుకుంటారా..? ఇదీ ప్రస్తుత సందేహం… నిజానికి వేసుకోరు… పెద్ద సీరియస్ చర్చ ఏమీ కాదు గానీ ఆ ఫోటోలు చూడగానే వర్ణ ధర్మాలు తెలిసినవారికి కలిగే సందేహం అది… నాన్సెన్స్, జంధ్యానికి నిషిద్ధాలేమిటి..? సనాతన ధర్మపరిరక్షకులు ఎవరైనా వేసుకోవచ్చు అని వాదించేవాళ్లు కూడా ఉండొచ్చు…
ఏవేవో సెర్చుతుంటే 2018 నాటి ఓ వార్త కనిపించింది… ఇంట్రస్టింగు అనిపించింది కూడా… ఇదీ లింక్…
https://telugu.filmibeat.com/news/pawan-kalyan-spotted-wearing-jandhyam-063099.html
పవన్ కల్యాణ్ మీద త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రభావం పడింది… బ్రాహ్మణ ఆచార వ్యవహారాలపై పవన్ కల్యాణ్ ఆసక్తి కనబరుస్తున్నాడు… జంధ్యం ధరిస్తున్నాడు… కానీ ఉపనయనం వంటి తంతు ఒకటి జరిగి ఉండాలి కదా… అదీ త్రివిక్రమే చేయించాడా..? అదీ ఆ వార్త సారాంశం… అవునూ, అలా ఉపనయనం చేయిస్తే ఏ కులం వారైనా జంధ్యం వేసుకోవచ్చా..? ఏమోలెండి… మళ్లీ క్లారిటీ ఇవ్వాలంటే కుంభమేళాకు తోడుగా వెళ్లిన ఆ అత్యంత సన్నిహితుడు ఆ త్రివిక్రముడే చెప్పాలి..!!
Share this Article