Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాతవన్నీ తూచ్… అల్లు అరవింద్ వెళ్లి పవన్‌కళ్యాణ్‌ను హత్తుకుపోయాడు…

June 25, 2024 by M S R

అల్లు అరవింద్ కొడుకు అర్జున్ అలియాస్ బన్నీ వైసీపీ అభ్యర్థి ఎవరికో ప్రచారం చేశాడు కదా… జబర్దస్త్ బ్యాచులు, మెగా ఇతర హీరోలు వెళ్లి పిఠాపురంలో ప్రచారం చేశారు కదా… ఐనా బన్నీ గానీ, అల్లు అరవింద్ గానీ పిఠాపురం పరిసరాల్లోకి కూడా వెళ్లలేదు కదా…

గతంలోలాగే పవన్ కల్యాణ్‌కు భంగపాటు తప్పదని అనుకున్నారో… లేక పవన్ కల్యాణ్‌తో చాన్నాళ్లుగా పడటం లేదో గానీ అల్లు అరవింద్ కుటుంబం సైలెంటుగా ఉండిపోయింది… మరిప్పుడు జగన్ దారుణంగా ఓడిపోయి, కూటమి అధికారంలోకి వచ్చింది కదా అల్లు అరవింద్ ముఖచిత్రం ఎలా ఉంటుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు…

జస్ట్, పవన్ కల్యాణ్ మంత్రిగా కొలువు దీరాడో లేదో… తోటి నిర్మాతలు పది మందిని తీసుకువెళ్లి పవన్ కల్యాణ్‌కు అతుక్కుపోయాడు అల్లు అరవింద్… అంతే, రాటుదేలిన సినిమా వ్యాపారి కదా మరి… పాతవన్నీ తూచ్… నిర్మాతలతో భేటీ సమయంలోనూ తనే ఇండస్ట్రీ పెద్దమనిషిగా కాస్త హవా చూపించాడు…

Ads

తనే కాదు, సినిమా సిండికేట్‌గా చెప్పబడే వ్యక్తులూ తనతోపాటు వెళ్లి పవన్ కల్యాణ్‌కు బొకేలు ఇచ్చి ఆలింగనాలకు పోటీలుపడ్డారు… దిల్ రాజు కావచ్చు, సురేష్ బాబు కావచ్చు, ఇతరులు కావచ్చు… చిత్రపరిశ్రమ సమస్యలు చర్చించామనీ, చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇప్పించాలని అడిగామనీ అరవింద్ చెప్పాడు…

అదేమీ లేదు, అభినందించడానికి వెళ్లారు, చిత్ర సమస్యలు పవన్ కల్యాణ్‌కు తెలియవా..? తను ఇండస్ట్రీ మనిషే కదా… నిజానికి చంద్రబాబు అపాయింట్‌మెంట్ కూడా ప్రత్యేకంగా అక్కరలేదు… ఇండస్ట్రీ ఎప్పుడూ చంద్రబాబు పక్షమే… ఆ సినిమా వాళ్లతో పెనవేసుకున్న కుటుంబమే కదా తనది…

కాకపోతే ఇండస్ట్రీకి ఏం చేశాడని అడగొద్దు… ఏం చేయగలడనీ అడగొద్దు… ఇదుగో ఇదే జగన్‌కు మంటపుట్టించేది… చంద్రబాబును ఓన్ చేసుకుంటారు, వెళ్తారు, అభినందిస్తారు, కానీ తను ముఖ్యమంత్రిగా గెలిచినా సరే తనను ఇండస్ట్రీ పట్టించుకోలేదు అనే కోపం… అది తన నిర్ణయాల్లోనూ కనిపించేది… తనను కలవడానికి వస్తే గేటు బయట కార్లు ఆపుకుని నడిచి లోపలకు రావాలి…

చివరకు చిరంజీవి తనను ఏదో విషయంపై దీనంగా అభ్యర్థిస్తున్న వీడియోను కూడా లీక్ చేయడం కూడా ఆ కోపప్రదర్శనలో భాగమే… ఎవరో చిన్నాచితకా ఆలీ, పోసాని, పృథ్వి వంటి నలుగురైదుగురు తప్ప జగన్ వెంట ఎవరూ లేరు…l ఆ పృథ్విని కూడా నాలుగు రోజులకే తరిమేశారు…

విచిత్రంగా ఏపీ రాజకీయాలు అంటేనే రెడ్లు వర్సెస్ కమ్మగా మారిపోయిన స్థితిలోనూ… ఇండస్ట్రీ స్థంభాలుగా ఎదిగిన ఒకరిద్దరు రెడ్లు కూడా జగన్ పక్షాన నిలబడలేదు… ఇప్పుడు మళ్లీ టీడీపీ కూటమి గెలవగానే వెళ్లి, తామే గెలిచినంత సంబరంగా హత్తుకుపోయారు..!!

అవునూ, అప్పట్లో శ్రీరెడ్డి ఇష్యూలో తనకు ఇండస్ట్రీ ముఖ్యులు అండగా నిలబడలేదనే కోపం పవన్ కల్యాణ్‌లో ఉండేదని అంటారు, ఇప్పుడెలా ఉందో మరి..!! చివరగా…. జగన్ సీఎంగా ఉండి ఉంటే… అశ్వినీదత్ సినిమా కల్కి రేట్ల పెంపుదల ఉండేదో లేదో తెలియదు గానీ… ఇప్పుడు గెలిచిందే అశ్వినీదత్ పార్టీ కదా… అలా అడిగారు, ఇలా సినిమా టికెట్ రేట్లు పెరిగిపోయాయి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions