.
నో, నెవ్వర్… పవన్ కల్యాణ్ అనే కేరక్టర్ అస్సలు మారదు… అత్యంత చంచల మనస్కుడు… అంతకు మించి తెలంగాణ ద్వేషి… తెలంగాణ బీజేపీ వాళ్లకు కలుక్కుమన్నా సరే… ఇదే రియాలిటీ…
ఏమాత్రం పరిణతి, రాజకీయ జ్ఞానమూ లేకుండా ఇంకా ఈరోజుకూ అవే సినిమా వేషాలే రాజకీయాలు అనుకునే భ్రమాత్మక పొలిటిషియన్… సరే, అది ఏపీ రాజకీయాల అసలు విషాదం…
Ads
చేగు వేరా నుంచి మాయవతి మీదుగా… చివరకు సనాతన ధర్మ పరిరక్షక పాత్ర దాకా… అవన్నీ రకరకాల పాత్రలు… సమయాన్ని, సందర్భాన్ని, అవసరాన్ని, అవకాశాన్ని బట్టి వాటిని పోషిస్తుంటాడు…
కానీ ఎటొచ్చీ… తన తెలంగాణ ద్వేషమే ప్రస్తుతం ఓ చర్చనీయాంశం… అరె, కొత్తేముంది..? తెలంగాణ ఏర్పడ్డాక పదకొండు రోజులు నిద్ర లేదు, తిండి లేదు అని తనే చెప్పాడు కదా అంటారా..? అవును, అదే కరెక్టు… తన మనసులో నుంచి వచ్చిన వ్యాఖ్య అది…
సోకాల్డ్, తన కుటుంబంలో ఎవరేం చెప్పినా… ఎప్పటికప్పుడు తెలంగాణ మీద ద్వేషాన్ని కక్కుతూనే ఉంటారు… ఇదంతా ఎందుకు ఇప్పుడు చెప్పుకోవడం అంటారా.,.? తను ఏవో పాత్రలు పోషించే సినిమా నటుడు కాదు… ఓ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి… ఆ సోయి ఉందా తనకు..?

కోనసీమలో ఎక్కడో కొబ్బరి చెట్లకు ఏదో రోగం తగిలి నేలకూలుతున్నాయట… ఈ సారు అక్కడికి వెళ్లాడు… తన శాఖ, తన పరిధి తనకు అవసరం లేదు… తను డిఫాక్టో ముఖ్యమంత్రి అనుకుంటాడు.,.. ఫాఫం చంద్రబాబు, భరిస్తుంటాడు…
సీజ్ ది షిప్ అనీ కేకలు వేయగలడు… అదేదో సినిమా షూటింగ్ అయినట్టు…! సరే, విషయానికి వస్తే… కొబ్బరి ఆంధ్రా కల్చర్ అంటాడు… ఫాఫం కొబ్బరి కనిపించే ప్రాంతాలు, దేశాలు ఏమైపోవాలో…! కొబ్బరి లేనిదే జీవితం లేని కేరళ వాళ్లు ఏమైపోవాలో..!
ఛల్, ఏమేం చేయాలో అన్నీ చేద్దాం అన్నాడు సరే… వోకే… కానీ తెలంగాణ దిష్టి తగిలి ఈ కొబ్బరి ధ్వంసం అయిపోతుందీ అంటున్నాడు… గోదావరి జిల్లాల అన్నపూర్ణగా భాసిల్లుతూ ఉంటే, ఆ పచ్చదనం మీద తెలంగాణ నేతలకు అసూయ అట… ఆంధ్రా నిత్యం పచ్చగా ఉంటుందీ అనే ఈర్ష్య అట… ఇదే రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం అట…
సాహో, చంద్రబాబూ… ఇలాంటి కేరక్టరా నీ సహ-ముఖ్యమంత్రి..!? రాష్ట్ర విభజనకు ఏమేం కారణాలు అని అనేక స్టడీలు, విశ్లేషణలు సాగాయి… పనికిరానివాళ్లు, ఒక్కడైనా ఈ పాయింట్ పట్టుకున్నారా..? లక్ష పుస్తకాలు చదివాడు కాబట్టి శ్రీమాన్ పవన్ కల్యాణ్‌కు ఈమాత్రం విచక్షణ, విశ్లేషణ జ్ఞానం అలవడింది…

ప్రపంచంలో దిష్టి కారణంగా విడిపోయిన ప్రాంతం ఏమైనా ఉందంటే, అది ఏపీ- తెలంగాణ మాత్రమే అన్నమాట… అన్నట్టు దిష్టి నిర్వచనాలు, ప్రభావాలు, పరిణామాలు, పర్యవసానాలు అనే బుక్ సారుకు ఇంకా దొరకలేదు, అది దొరికాక నిమిషాల్లో నమిలేసి క్లారిటీ ఇస్తాడు… సరేనా..?
ఈ అత్యంత జ్ఞాన సంపన్నుడైన విజ్ఞ కేరక్టర్‌ను పట్టుకుని తెలంగాణ బీజేపీ రాబోయే రోజుల్లో గోదావరి ఈదుతుందట… సిగ్గుపడండి..!! ఆంధ్రా జనం గోచీలు కట్టుకునే రోజులకు ముందే నిజాం రాజ్యం ఎంత సంపన్న రాజ్యమో చెప్పే బుక్ పవన్ కల్యాణ్ గారికి దొరకలేదు… ఆగండి, తరువాత క్లారిటీ ఇస్తాడు..!@!@
Share this Article