Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎన్టీఆర్ వచ్చేవరకు… మావన్నీ సెంటినలీస్ బతుకులే నీ బాంచెన్ దొర…

November 28, 2022 by M S R

పవన్ కల్యాణ్ చదివినన్ని వేల పుస్తకాలు మనం చదవలేదు… తనకున్న జ్ఞానసంపద, చరిత్రవిజ్ఞానం మనకు లేదు… ఉండదు… అసలు ఎన్టీఆర్ వచ్చేవరకు మనవి సెంటినలీస్ బతుకులే కదా… ఆంధ్రుల వంటి నాగరికులను చూస్తే భయంతో దాక్కునేవాళ్లం కదా… బట్ట ఉండదు, ఏదో అఢవుల్లో దొరికే కందమూలాలు తింటూ, ఎప్పుడైనా రాగులు, జొన్నలో పండితే పండుగ చేసుకోవడం… పొద్దెక్కేదాకా పడుకోవడం…

భాష లేదు, కళ లేదు, సంస్కృతి లేదు, ఓ గౌరవప్రదమైన జీవనవిధానం లేదు… ఆటవికుల్లా బతికేవాళ్లం… ఎన్టీఆర్ వచ్చాకే వరిఅన్నం మొహం చూశాం… రేషన్ బియ్యంతో రోజూ పండుగ చేసుకున్నాం… పొద్దున్నే లేచి పనిచేయడం నేర్చుకున్నాం… ముడ్డి కడుక్కోవడం నేర్చుకున్నాం… బట్ట కట్టాం, భాష ఒంటబట్టింది… మనుషుల్లా బతకడం ఎన్టీయార్ వచ్చాకే మొదలైంది… పవన్ కల్యాణ్ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు… అందరివీ అలాంటివే కూతలు… వాళ్ల జన్యువుల్లోనే తెలంగాణ వ్యతిరేకత అంతఃనిర్మితమై ఉంటుందేమో… ఏ పార్టీ, ఏ కులం అనే తేడా ఏమీలేదు…

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నా సరే… మీరూ వద్దు, మీ సోపతి వద్దు, అయ్యోడివా, నువ్వు అవ్వోడివా అంటూ వెళ్లగొట్టినా సరే… ఎనిమిదేళ్లయినా ఓ చిన్న రాజధాని కట్టుకునే దిక్కులేదు, తెలివి లేదు ఈరోజుకూ… తెలంగాణ మీద పడి తింటూ, తెలంగాణ మీదే ఏడుపు… అదే వెక్కిరింపు, అదే హేళన… వరిబియ్యం ఇవ్వడమే కాదు, వండుకోవడం తెలియకపోతే ఎన్టీయారే ఊరూరా క్యాంపులు పెట్టి, అన్నం ఎలా వండుకోవాలో నేర్పించాడు అప్పట్లో… అంతేనా సార్..?

ఏ కాంటెక్స్ట్‌లో అన్నాడు, ఏ ఫ్లోలో అన్నాడు అనేది ముఖ్యం కాదు… జగన్‌ను తిడుతూ ఎన్టీఆర్ తెలంగాణను ఏం ఉద్దరించాడో చెప్పడం దేనికి..? అసందర్భ ప్రేలాపన కాదా..? పోనీ, మీ ఆంధ్రా జిల్లాలను ఏం ఉద్దరించాడో చెప్పొచ్చు కదా… ఎన్టీఆర్ వచ్చేవరకే వాళ్లు ఉద్దరింపబడిపోయారా ఏమిటి కొంపదీసి..? అదెలా..? కారణజన్ముడి రాకకు మునుపే కల్చర్ నేర్చేసుకుంటే మర్యాద కాదు కదా…

ఆ మనస్సుల్లో ముద్రపడిపోతుంది చిన్నప్పటి నుంచే… తెలంగాణ మీద ఇలాంటి భావనలు… వీళ్లకు చరిత్ర తెలియదు, అక్కర్లేదు, తిండిని వెక్కిరించాలి, బట్టను వెక్కిరించాలి, భాషను వెక్కిరించాలి, పండుగను వెక్కిరించాలి… ఇప్పుడు మళ్లీ ఉద్దరిస్తారట బయల్దేరారు… షర్మిల, పవన్ కల్యాణ్, చంద్రబాబు… వీళ్లు చదివే వేల పుస్తకాల్లో హైదరాబాద్ రాజ్య చరిత్ర ఉండదు… కాకతీయ పాలన వైభవాల చరిత్ర ఉండదు… ప్రకాశం బ్యారేజీ, ధవళేవ్వరం రాకమునుపు బతుకుల మాటేమిటో ఆత్మసోయి అసలే ఉండదు…

గొలుసుకట్టు చెరువులు, పెద్ద పెద్ద మధ్యతరహా ప్రాజెక్టులు, అప్పట్లోనే సన్నబియ్యం పంటలు… బిర్యానీల ఘుమఘుమలు వీళ్ల మెదళ్లకెక్కవు… ఎన్టీయార్ సైకిల్ మీద ఇల్లిల్లూ తిరుగుతూ పాలమ్ముకునే సమయానికి హైదరాబాదు రాజ్యానికి సొంత రైల్వే, సొంత పవర్ స్టేషన్, సొంత కరెన్సీ, సొంత విమానాశ్రయం, సొంత యూనివర్శిటీ ఉండేవనీ తెలియదు… దేశదేశాలతో సాంస్కృతిక సంబంధాలున్న నగరం ఇది… ఇవన్నీ ఎందుకు..? శ్రీనాథుడు ఏం రాశాడో గుర్తు చేస్తే సరిపోతుందిగా…

‘‘చిన్న చిన్న రాళ్లు చిల్లర దేవుళ్లు

నాగులేటి నీళ్లు నాపరాళ్లు

సజ్జ జొన్న కూళ్లు సర్పంబులను తేళ్లు

పల్లెనాటి సీమ పల్లెటూళ్లు


జొన్న కలి, జొన్న యంబలి

జొన్నన్నము, జొన్న కూడు, జొన్నలె తప్పన్

సున్న సుమీ సన్నన్నము

పన్నుగ పల్నాటి సీమ ప్రజలందరికున్


గరళము మ్రింగితిననుచున్

పురహర, గర్వించబోకు, పో, పో, పో, నీ

నీ బిరుదింక గాన వచ్చెడి

మెఱసెటి రేనాటి జొన్న మెతుకులు తినుమీ


రసికుడు పోవడు పల్నాడె

సగంగా రంభమైన నేకులె వడకున్

వసుధేశుడైనను దున్నును

కుసుమాస్త్రుండైన జొన్న కూడే కుడుచున్



Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • పాపులారిటీ సర్వేలో తెలుగు సీఎంలు పూర్ ప్లేస్… అసలు జాడే లేని కేసీయార్…
  • దటీజ్ అమితాబ్..! ఈరోజుకూ తిరుగులేని నంబర్‌వన్ స్టార్… సర్వే చెప్పిందిదే…!
  • సివంగి..! కల్లోలిత జమ్ము కాశ్మీర్‌లో పోలీస్ ఆఫీసర్… ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్…!
  • గుహుడు గుర్తున్నాడా రాముడికి..? మంథర పాత్ర ఎందుకు కీలకం..? (పార్ట్-3)
  • వన్ నేషన్..! ఆరుగురు జాతీయ అవార్డు గ్రహీతలతో ఒక పాన్ ఇండియా సినిమా…!
  • కాంతార, విక్రమ్, దృశ్యం… ఈ మూడూ ఒకే మలయాళ సినిమాలో కలిస్తే…
  • చిరంజీవికన్నా కల్యాణరామ్‌కు ఎక్కువ మార్కులు… ఎక్కడ..? ఎలా..? ఎప్పుడు..?
  • అడుసు తొక్కుతున్న అదితి… అనుభవంతోగానీ తత్వం బోధపడదు…
  • జమున ముక్కు మీద నీడ… ఆమెది సునిశిత పరిశీలన… అందుకే ‘నిలబడింది’…
  • ములాయం పద్మవిభూషణ్‌పై… వాట్సప్ యూనివర్శిటీ తప్పుగెంతులు…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions