ఎవరూ మనోభావాలు దెబ్బతీసుకోకండి… రియాలిటీలో బతకండి… పవన్ కల్యాణ్ ఆంధ్రా రాజకీయ నాయకుడు… ఏపీ జనం వరద కష్టాలకు చలించిన సోకాల్డ్ కల్కి మేకర్స్ వైజయంతి మూవీస్‌కు తనకూ తేడా లేదు… తను ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయల విరాళం ఇస్తానని ప్రకటించాడు…
తను అక్కడివాడే గానీ ఇక్కడివాడు కాదు అని మరోసారి నిరూపించుకున్నాడు… తెలంగాణ ఏర్పడినప్పుడు రోజుల తరబడీ నిద్రాహారాలు మాని బాధపడినట్టు చెప్పిన గొప్ప మనిషి… ఐనా సరే, ఇంకా తెలంగాణలో వీరభక్తులు జేజేలు పలుకుతూనే ఉంటారు… అందరికీ మించి తెలంగాణ బీజేపీది పులుసులోె పడ్డ ఈగ మాదిరి పరిస్థితి… ఫాఫం, ఏపీలో బీజేపీతో పొత్తు, తనేమో తెలంగాణ విముఖి… సై అనలేక, కాదనలేక కిక్కుమనలేరు తెలంగాణ బీజేపీ నేతలు… ఫాఫం…
నిజం ఇదే… మొహమాటాలు అక్కర్లేదు… ఇలాంటి విపత్తు సమయాల్లో ఎవరు ఎక్కడివారో తేలిపోయేది… వెంకయ్యనాయుడు, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, బాలకృష్ణ, విశ్వక్సేన్, డీజే టిల్లూ వంటి హీరోలు కూడా రెండు రాష్ట్రాల ప్రజల కష్టాలకు స్పందించి సమానంగా సాయం ప్రకటిస్తుంటే… వైజయంతి అశ్వినీదత్తుడు మాత్రమే ఇప్పటిదాకా నేను ఆంధ్రావాడినే కానీ, తెలంగాణ జనం కష్టాలు నాకేమిటి అన్నట్టు స్పందించాడు…
Ads
అచ్చు అదే రీతిలో పవన్ కల్యాణ్ స్పందించాడు… జస్ట్, ఓ ఆంధ్రా నేత, ఓ ఆంధ్రా హీరో అన్నట్గుగా… హార్ష్‌గా అనిపించినా కనిపించే రియాలిటీ అదే… చిన్న చిన్న అప్ కమింట్ హీరోలు చూపించే మెచ్యూరిటీ కూడా పవన్ కల్యాణ్ చూపించలేకపోయాడు… పైగా ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియదు గానీ ఏపీజనం వరద కష్టాల్లో తీవ్ర అవస్థల పాలవుతుంటే… మొత్తం చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు సహా అధికార యంత్రాంగం అంతా సహాయక చర్యల్లో ఉంటే… ఎక్కడా పవన్ కల్యాణ్ జాడ లేదు…
జగన్ దిక్కుమాలిన పాలనపై జనంలో కనిపించిన తీవ్ర వ్యతిరేకత పుణ్యమాని 100 శాతం స్ట్రయిక్ రేట్‌తో ఎమ్మెల్యే సీట్లు గెలిచాడు గానీ… అదే జగన్ సరిగ్గా పాలించి ఉంటే పవన్ కల్యాణ్‌కు అసలు అంత స్కోప్ ఎక్కడిది..? సరే, మళ్లీ ఆ చర్చలోకి వెళ్లడం అనవసరం గానీ… నేను మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో ఉన్నాను, కష్టాల్లో జనం వెంట ఉంటానే అనే సోయే కనిపించలేదు… జయహో పవనిజం… ఇదే నిజం… ఫాఫం ఏపీజనం… బట్, ఏమాటకామాట…
పబ్లిసిటీ హైపా… మరొకటా వదిలేస్తే… చంద్రబాబు ఇలాంటి సందర్భాల్లో అంతటా తానై కనిపిస్తాడు… మీడియా హడావుడి సరేసరి… తెలంగాణ సీఎం రేవంత్ వెలవెలాబోయాడు… ఓరోజంతా బయటికే రాలేదు… పొంగులేటి, సీతక్క, భట్టి, తుమ్మల సహాయక చర్యల్లో తిరుగుతున్నా సరే రేవంతుడికి సోయి లేదు… ఇక జనం ఛీత్కరిస్తారని ఎవరు చెప్పారో గానీ కాలు బయటపెట్టాడు… అఫ్ కోర్స్, విదేశాల్లో ఉండి ఏవేవో ట్వీట్లతో బురద జిమ్మే కేటీయార్, జాడాపత్తా లేని పవన్ కల్యాణ్ వంటి నేతలకన్నా బెటరే… అది కరెక్టు… వేగంగా తన కర్తవ్యం ఏమిటో తెలుసుకున్నాడు..!!
Share this Article