మరీ తేలికగా తీసిపారేయలేం కదా… ఎప్పుడో ఓసారి చివరకు ఆ ఆంధ్రప్రభలోనూ హఠాత్తుగా ఓ ఇంట్రస్టింగ్ వార్త తళుక్కుమంటుంది… ఇదీ అలాంటిదే… పయ్యావుల కేశవ్‌కు ఎట్టకేలకు శాపవిముక్తి దొరికిందనేది వార్త… బాగుంది… అంటే, ఇంట్రస్టింగుగా ఉందీ అని..!
అందరికీ తెలిసిందే కదా… సినిమాల్లో, రాజకీయాల్లో సెంటిమెంట్ల మంట అధికం… జ్యోతిష్కులు, మూఢనమ్మకాలు, పూజలు గట్రా అధికం… బయటికి నాస్తికుల్లా, హేతువాదుల్లా కనిపించే కొందరు లోలోపల ఏవో భయాలతో శనిజపాలు కూడా చేస్తుంటారని అంటుంటారు… సరే, దాన్నలా వదిలేస్తే… పయ్యావుల కేశవ్ శాపం ఏమిటి..?
తను గెలిస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదట… తను ఓడిపోతే తన పార్టీ అధికారంలోకి వస్తుందట… ఇదొక నమ్మకం బలంగా ప్రబలిపోయింది ఆ నియోజకవర్గంలో… పాపం, పార్టీ వోటర్లు, పార్టీ శ్రేణులు, సానుభూతిపరులు ఏం చేయాలి..? ఓడించాలి, తెలుగుదేశం అధికారంలోకి రావాలంటే తను ఓడిపోవాలి… లేదూ, మన నాయకుడు గెలవాల్సిందే అనుకుంటే అధికారం రాదు…
Ads
ఆయన పార్టీ అధికారంలోకి రావొద్దంటే మనమే ఆయన్ని గెలిపిస్తే పోలా అని ప్రత్యర్థి పార్టీలు అనుకోలేదు, అక్కడికి ఇంకా నయం… నిజానికి ఉరవకొండ తెలుగుదేశం పార్టీ నాయకుడు పయ్యావుల కేశవ్ యాక్టివ్ పొలిటిషియన్… సబ్జెక్టు నాలెడ్జ్ ఉంటుంది… కంఠం ఖంగుమంటుంది… తను చెప్పదలుచుకున్న విషయాన్ని తడబాటు లేకుండా, స్పష్టంగా వ్యక్తీకరించగలడు… మీడియాతోనూ మంచి రిలేషన్సే ఉన్నట్టు తెలుసు…
కానీ తన సొంత పార్టీ, సొంత నియోజకవర్గ కార్యకర్తలే కొందరు తను ఓడిపోవాలని పూజలు చేస్తారట… కోటి దేవుళ్లకు నూటొక్క మొక్కులు మొక్కుకుంటారట, కనిపించిన ప్రతి గుడి మెట్లెక్కుతారట, కొబ్బరికాయలు, పొర్లుదండాలు, అష్టోత్తరాలు, సహస్ర నామాలు… ఎవరైనా ఏమైనా క్షుద్ర పూజలు కూడా చేయించారో లేదో మాత్రం తెలియదు…
సరే, ఇన్నాళ్లకు ఆయనకు శాపవిముక్తి దొరికింది… తను గెలిచాడు, తన పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. అలా ఇలా కాదు… స్టన్నింగ్ విక్టరీ… తెలుగుదేశం ఎప్పుడూ ఎరగనంత బ్లాక్ బస్టర్ హిట్… ప్రత్యర్థి పార్టీ కలలో కూడా మరవలేని ఓటమి… ఇదంతా వోకే గానీ… తన గ్రహచార దోషాలు, తన శని అంతర్దశల నుంచి విముక్తమయ్యాడు సరే… మరి ఇప్పుడైనా ఓ మంత్రి పదవి దక్కేనా..? అదీ అందరిలోనూ ఆసక్తి రేపుతున్న ప్రశ్న… నిజానికి తను అర్హుడే… ఏ పోర్ట్ ఫోలియో ఇచ్చినా న్యాయం చేయగలడు..! పైగా చంద్రబాబు సామాజికవర్గమూ సేమ్ సేమ్… బాలయ్యకు ఇచ్చాను, ఇక అనంతపురానికి చాలు అంటాడా..?!
Share this Article