Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ సాదాసీదా కట్నం కథ… కామెడీ మిక్సింగ్…, పేలలేదు పెద్దగా…

November 30, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ….. వరకట్నానికి వ్యతిరేకంగా వచ్చిన మరో హాస్యభరిత సందేశాత్మక సినిమా ఈ పెళ్ళి చేసి చూడు . వరకట్నం వంటి సాంఘిక దురాచారానికి వ్యతిరేకంగా ఎన్నో సినిమాలు వచ్చినా యన్టీఆర్ వరకట్నం ఓ మాస్టర్ పీస్ , మోస్ట్ పాపులర్ .

రేలంగి నరసింహారావు దర్శకత్వంలో 1988 సెప్టెంబరులో వచ్చిన ఈ పెళ్లి చేసి చూడు కూడా డైరెక్టుగా వరకట్నానికి వ్యతిరేకంగా తీయబడిన హాస్యభరిత సినిమా . అవలే నన్న హెండ్తి అనే కన్నడ సినిమాకు రీమేకే మన తెలుగు సినిమా . కన్నడంలో కాశీనాధ్ , భవ్య , తార , తదితరులు నటించారు .‌

Ads

కధ ఏంటంటే … రాజేంద్రప్రసాద్ కట్నం తీసుకోనని ఇంటాబయటా ప్రకటిస్తూ ఉంటాడు . అతని తల్లి కొడుక్కి కట్నం పుచ్చుకుని ఆ కట్నం డబ్బుతో కూతురు పెళ్లి జరిపించాలని తాపత్రయపడుతూ ఉంటుంది . చస్తే కట్నం ఇవ్వను పుచ్చుకోను అని తనకు , చెల్లెలికి జోడీ కోసం వీధి వాడా వెతుకుతూ ఉంటాడు .

ఈ క్రమంలో అశ్విని చేత ఆకర్షించబడి ప్రేమిస్తాడు , వెంట పడతాడు , తల్లికి కోపం తెప్పిస్తాడు , తల్లి చేత ఆమె చెంప చెళ్ళుమనిపిస్తాడు , అశ్విని చేత తన చెంప పగలగొట్టించుకుంటాడు . తిక్క రేగి పెళ్ళి చేసేసుకుని ఇంట్లో కాపురం పెట్టేసి తల్లికి వ్యతిరేకంగా బావుటా ఎగరేస్తాడు .

చెల్లెలు ప్రేమించిన క్లాస్ మేట్ రాజా తండ్రి మున్సిపల్ కౌన్సిలర్ గొల్లపూడిని మాయచేసి పెళ్లి జరిపించేస్తాడు . కట్నం తేలేదని గొల్లపూడి కోడలిని చంపేందుకు ప్రయత్నించటం , రివర్సయి తన భార్యే ప్రమాదంలో ఇరుక్కోవడం జరుగుతుంది . హీరో బడిత పూజతో బుద్ధి వచ్చి కోడలిని , మనమడిని ఇంటికి తీసుకుని పోయేందుకు రావడంతో కధ సుఖాంతం అవుతుంది .

కధ కేవలం హాస్యపూరితమే కాదు . చాలా మలుపులు తిరుగుతుంది . మధ్యమధ్యలో సుత్తి వీరభద్రరావు , శ్రీలక్ష్మి సీన్లను దర్శకుడు రేలంగి బాగా మలిచారు . కనిపించేది కాసేపే అయినా శ్రీలక్ష్మి పాత్ర , నటన గుర్తుండిపోతాయి .

రాజేంద్రప్రసాద్ , అన్నపూర్ణమ్మ అదరగొట్టేసారు . గొల్లపూడి , అశ్విని , కన్నడ నటి తార , రాజా , రావి కొండలరావు , ఆలీ , పి ఆర్ వరలక్ష్మి , డా శివప్రసాద్ , ప్రభృతులు ఎవరి పాత్రలని వారు చక్కగా పోషించారు . సంభాషణలను మాడభూషి దివాకర్ బాబు వ్రాసారని అనుకుంటాను . బాగా వ్రాసారు .

కన్నడ చిత్రాల సంగీత దర్శకుడు హంస లేఖ అని పిలవబడే గంగరాజు ఈ సినిమాకు సంగీత దర్శకత్వాన్ని నిర్వహించారు . బయట పెద్ద పాపులర్ కాకపోయినా థియేటర్లో బాగానే ఉన్నాయి . మీసమున్న మగాడికే డిమాండయ్యో డిమాండు పాట రాజేంద్రప్రసాద్ మీద హుషారుగా ఉంటుంది .

రాజేంద్రప్రసాద్ , అశ్విని మీద ఓ పిల్లా పిచ్చి అంటూ సాగే ఓ డ్యూయెట్ రాజేంద్రప్రసాద్ మార్కులో ఉంటుంది . తార , రాజాల మీద ఉన్న రెండు డ్యూయెట్లు కూడా బాగా తీసారు . అంత దూరాన కౌగిలిలో , మనసొక గువ్వలగూడు అంటూ సాగుతాయి . సినిమా ఎక్కువ భాగం షూటింగ్ రాజమహేంద్రవరం , కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో జరిగిందనుకుంటాను .

హిందీలో కూడా జవానీ జిందాబాద్ అనే టైటిలుతో రీమేక్ అయింది . అమీర్ ఖాన్ , టాబూ అక్క ఫర్హా , ఖాదర్ ఖాన్ , ప్రభృతులు నటించారు . హాస్యరస సినిమాలకు పేరయిన రేలంగి నరసింహారావు చక్కని సందేశాత్మక సినిమాను అందించారు . ఇదే టైటిలుతో యన్టీఆర్ , జి వరలక్ష్మిలతో 1952 లో ఓ సినిమా వచ్చింది . ఈ రాజేంద్రప్రసాద్ సినిమా యూట్యూబులో ఉంది . చూడబుల్ సినిమాయే .

నేను పరిచయం చేస్తున్న 1181 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వామ్మో వాయ్యో…! సంక్రాంతి బరి నుంచి మరో పందెం కోడి ఔట్…!!
  • ఇండియా కొత్త బాట..! ఐనవాడే అందరికీ… ఐనా లొంగడు ఎవ్వరికీ..!!
  • అరైవ్ అలైవ్..! సేఫ్టీ ఫస్ట్..! తెలంగాణ పోలీసుల గుడ్ క్యాంపెయిన్…!!
  • ‘బాబు బూచి’… ఫ్రీజోన్ కుట్ర అట… బీఆర్ఎస్ గాయిగత్తర రాజకీయం…
  • ముత్యమంత ముద్దు..! ఓ అబ్సర్డ్ నవలకు దారితప్పిన మూవీకరణ..!!
  • పవన్ కల్యాణ్… ఓ యుద్ధ ఖడ్గం… ఓ బిరుదు ప్రదానం… ఓ క్లారిటీ..!!
  • హఠావో లుంగీ- బజావో పుంగీ..! వీళ్లు వారసులా..? విద్వేష వైరసులా..?!
  • మళ్లీ ఓ చిరంజీవి రెట్రో లుక్కు… జోడీగా ఇదే నయనతార… ఏమిటది..?!
  • హైడ్రోజన్ రైల్..! ఈ పైలట్ రన్స్ గనుక సక్సెసైతే… రవాణా విప్లవమే..!!
  • ‘‘తెలంగాణ వ్యతిరేకులతో కలిసొస్తాం.., కాస్త కరుణించి వోట్లేయండి ప్లీజ్..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions