Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బాగానే వండినా ప్రేక్షకులకు రుచించలేదు… సారీ ఎన్టీయార్ అన్నారు…

January 30, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …. ఇది ప్రేమ సింహాసనం హృదయాల ప్రియ శాసనం అనే ఈ పాట సూపర్ హిట్ సాంగ్ . ఈ ప్రేమ సింహాసనం సినిమాకే ఐకానిక్ సాంగ్ . సినిమా మొత్తం మీద మూడు సందర్భాలలో వస్తుంది .

సి నారాయణరెడ్డి చాలా బాగా వ్రాసారు . చక్రవర్తి చాలా శ్రావ్యమైన సంగీతాన్ని అందించగా మంజు భార్గవి శాస్త్రీయ నృత్యం చాలా అందంగా ఉంటుంది . ఈ పాటే కాదు; మిగిలిన అన్ని పాటలూ బాగుంటాయి , హిట్టయ్యాయి కూడా .

Ads

ఆరుద్ర వ్రాసిన అరివీర భయంకర రామా పాటలో, వేటూరి వ్రాసిన చందమామ కొండెక్కింది గ్రూప్ డాన్సులో కూడా యన్టీఆర్ చాలా కష్టపడతాడు . చిత్రీకరణ కూడా బాగుంటుంది …

ఆయన వ్రాసిందే హరి ఓం గోవింద , జేజెమ్మ చెప్పింది , లాలమ్మ లాలి పాటలు కూడా బాగుంటాయి . హీరోయిన్ రతి అగ్నిహోత్రి చాలా హుషారుగా డాన్సుల్ని చేసింది . యన్టీఆర్ రతితో , జయమాలినితో పోటాపోటీగా డాన్స్ చేసారు .

శ్రావ్యమైన సంగీతం , యన్టీఆర్ ద్విపాత్రాభినయం , సందేశాత్మక కధ , మంజుభార్గవి అందమైన శాస్త్రీయ నృత్యాలు , వెరశి అన్నీ ఉన్నా , బాగున్నా ఈ సినిమా ఎందుకు సక్సెస్ కాలేదో చాలా ఆశ్చర్యం .

ఈ సంవత్సరం ప్రేమ అనే పదంతో అయిదు సినిమాలు వచ్చాయి . ఈ సినిమా జనవరిలో , ప్రేమాభిషేకం పిబ్రవరిలో , చిరంజీవి ప్రేమ నాటకం ఏప్రిల్లో , ఎయన్నార్ ప్రేమ కానుక జూన్లో , ఆయనదే ప్రేమ మందిరం సెప్టెంబరులో వచ్చాయి . ఒక్క ప్రేమాభిషేకమే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ . ప్రేమాభిషేకం కన్నా ముందొచ్చిన ఈ ప్రేమ సింహాసనం ప్రేక్షకుల ఆదరణ పొందకపోవటం దురదృష్టమే .

నాకు అప్పుడూ ఇప్పుడూ బాగా నచ్చిన సినిమా . ముఖ్యంగా జంధ్యాల డైలాగులు చాలా పదునుగా ఉంటాయి . దేవదాసి అయిన మంజుభార్గవిని దేవాలయంలో అమ్మకానికి పెట్టడం , యన్టీఆర్ అభ్యంతరం చెప్పడం , అక్కడికక్కడే ఆమెను పెళ్లి చేసుకోవడం , ఆ మొత్తం ఎపిసోడ్లో జంధ్యాల డైలాగులు సూపర్బ్ .

ఏ కొండవీటి వెంకట కవో , ఏ మోదుకూరి జాన్సనో , ఏ పరుచూరి బ్రదర్సో వ్రాసారని అనిపిస్తుంది . కానీ ఆ డైలాగులు జంధ్యాల కలం నుండి రావటం విశేషం .

నటీనటులు అందరూ బాగా నటించారు . తండ్రీకొడుకులుగా నటించిన యన్టీఆర్ తండ్రి పాత్రను ధీరోదాత్తంగా నటిస్తే , కొడుకు పాత్రను చలాకీగా లాగిస్తాడు . రతి అగ్నిహోత్రి గ్లామర్ని , చలాకీ డాన్సుల్ని అందించింది . మంజుభార్గవి శాస్త్రీయ నృత్యాలన్నీ సూపర్బ్ .

కె ఆర్ విజయ ఎప్పటిలాగానే గ్రేషియస్ గా , చక్కగా నటించింది . ఇతర ప్రధాన పాత్రల్లో యస్ వరలక్ష్మి , మోహన్ బాబు , హేమసుందర్ , సత్యనారాయణ , నూతన్ ప్రసాద్ , రావి కొండలరావు , పి యల్ నారాయణ , పుష్పకుమారి ప్రభృతులు నటించారు . కధ , స్క్రీన్ ప్లే , దర్శకత్వాన్ని బీరం మస్తాన్ రావు అందించారు . కె విద్యాసాగర్ నిర్మాత .

సినిమా కమర్షియల్ జయాపజయాలను పక్కన పెట్టి చూడతగ్గ సినిమా . యన్టీఆర్ అభిమానులు , సంగీత నృత్య ప్రియులు చూసి ఉండకపోతే తప్పక చూడండి . యూట్యూబులో సినిమా , పాటల వీడియోలు ఉన్నాయి . పాటల వీడియోలను మిస్ కావద్దు . (కాకపోతే ఎన్టీయార్ బరువు పెరిగాడు, లావుగా కనిపిస్తున్నాడు అప్పటికే… తన పక్కన బక్కపలుచగా ఉండే రతి అగ్నిహోత్రి సరైన జంటగా అస్సలు సెట్ కాలేదు…)

ఈ సినిమాలో చాలా సీన్లలో యన్టీఆర్ కుడి చేయి ముడిచి డాన్స్ చేస్తాడు . ఒక ఫైటింగ్ సీన్లో కుడి చేయి ముడిచే వెడం చేత్తో ఢిష్యూం ఢిష్యూం చేస్తాడు . కారణం ఏమిటంటే..? ఏదో సినిమా షూటింగులో యన్టీ‌ఆర్‌కు యాక్సిడెంట్‌లో చేయి విరిగింది… డేట్స్ ఉన్న నిర్మాత నష్టపోకూడదని అలాగే కవర్ చేస్తూ ఈ సినిమాలో పాటలు, ఫైట్లు లాగించారు… సినిమా పట్ల ప్రేక్షకుల విముఖతకు అదీ ఓ కారణమే కావచ్చు… ప్లస్ చిన్నాచితకా వ్యాంప్ తరహా పాత్రలు వేసుకునే మంజుభార్గవికి ఎన్టీయార్ సరసన చోటివ్వడం కూడా..! #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions