.
ఇక్కడే చిన్న సూచన :: మహిళా పాఠకులు ఇక్కడితో ఆగిపొండి… అశ్లీలం అని కాదుగానీ కాస్త చదవడానికి ఇబ్బందిగా ఉండొచ్చు…
.
Ads
.
.
.
.
నిజానికి వయాగ్రా, అంగస్థంభన వంటి అంశాలు ఎంతోకాలంగా సమరం వంటి సంభోగశాస్త్ర నిపుణులు రాస్తున్నవే… చదువుతున్నవే… అలవాటైపోయిన సబ్జెక్టులే… ఊళ్లో ఓ పెద్ద మనిషి… రసపురుష్…
ఓసారి మాత్రలు వేసుకుంటాడు… బహుశా ఓవర్ డోస్… టీవీ ముందు కూర్చుని అలాగే చనిపోతాడు… కానీ అంగం యథాస్థితికి రాదు… ఆ శవాన్ని అలాగే చూస్తూ ఊళ్లో పరువు పోతుందని భావిస్తారు ఇద్దరు కొడుకులు…
తామే ఏవో ప్రయత్నాలు చేస్తారు… ఫలితం లేదు… డాక్టర్, మాంత్రికుడు వస్తారు… అనుకోకుండా ఏవీ సక్సెస్ కావు… నానాపాట్లూ పడుతుంటారు… ఓ ఫ్రీజర్‌లో పడుకోబెట్టి కొంతసేపు కవర్ చేస్తారు… ఈలోపు తను ఉంచుకున్నావిడ వచ్చి రచ్చ చేస్తుంటుంది… ఆ బాక్సులో ఓ చోరీ గొలుసు ఉంటుంది…
తనను కొట్టిన ముసలోడి పంచె లాగేసి అందరి ముందు పరువు తీయాలని ఓ కుర్రాడు ప్రయత్నిస్తుంటాడు… చివరకు సమస్య ఎలా సాల్వ్ అయ్యిందనేది కథ… ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి…
ఇది శ్రీలంక సింహళ చిత్రం టెంటిగోకు అనుకరణ… తమిళంలో స్ట్రెయిట్ రిలీజ్… కానీ తెలుగు డబ్బింగుతో నెట్‌ఫ్లిక్స్‌లో పెట్టారు… కోదండరామిరెడ్డి ఇద్దరు కొడుకులు అన్నదమ్ములుగా భలే నటించారు… సినిమాలో హైలైట్ వాళ్లే… మిగతావాళ్లు ఉన్నారంటే ఉన్నారు, ఎవరికీ పెద్ద సీన్ లేదు…
పాపులర్, యాక్టివ్ ఇన్‌ఫ్లుయెన్సర్ నీహారిక ఎన్ఎం తెలుసు కదా… ఓ చిన్న పాత్ర చేసింది… చేయకుండా ఉండాల్సింది… ఆమె పాత్రకు ప్రాధాన్యం లేదు… చెప్పుకోవాల్సింది దర్శకుడి గురించి… ఇబ్బందికరమైన అంశం చుట్టూ కథ తిప్పుతున్నా సరే, వెగటు వేషాలకు పోలేదు… చూపించడం, కథ ప్రజెంటేషన్ కూడా భలే టాకిల్ చేశాడు…
కానీ డార్క్ కామెడీ… కథే గీత దాటింది కాబట్టి ఇక మిగతావన్నీ డైలాగులతో సహా ఆ అంశం చుట్టే తిరుగుతుంటాయి… సో, ఫ్యామిలీ ప్రేక్షకులకు రుచించదు… ఇలాంటి కామెడీని ఇష్టపడేవారికి నచ్చొచ్చు… కానీ సినిమాకు ఈ అంశాన్ని ఎంచుకుని, సమర్థంగా ప్రజెంట్ చేయడం దర్శకుడి సాహసమే, ప్రతిభే…
నిజానికి మనిషి మరణించాక అంగస్థంభన గంటల తరబడీ అలాగే ఉండటం అసహజం, వైద్యం కోణంలో కూడా జరగదు, కొన్ని పరిస్థితుల్లో మినహా… అలాగే వయగ్రా ఓవర్‌డోస్ ప్రమాదకరం, ప్రాణాంతకం అనేది కరెక్టే కానీ సుదీర్ఘ అంగస్థంభన పీరియడ్ మాత్రం ఉండదు… పోస్ట్‌మార్టం ప్రియాపిజం లేదా పోస్ట్‌మార్టం ఎరక్షన్… అంటే మరణానంతర అంగస్థంభన అత్యంత అరుదు…
పైగా వయాగ్రా ఓవర్‌డోస్ వల్ల అది జరగదు… సరే, డార్క్ కామెడీ అనుకున్నాక లాజిక్కులతో పనేముంది..? ఐతే సినిమాలో రోకలిబండతో ప్రయత్నించినా, టేపులతో కట్టేసినా వర్కవుట్ కాని సమస్య, మృతుడు ఉంచుకున్నావిడ వచ్చి గట్టిగా కొట్టగానే ఫ్రీజర్ పైన అద్దం పగిలిపోయి, స్థంభన సడలి యథా పూర్వ స్థితికి వస్తుంది… అదెలా..? అన్నట్టు… పెరుసు అంటే తమిళంలో పెద్ద అని అర్థం..!!
Share this Article