Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎదిగే దశలోనే ఒద్దిక, అణకువ అవసరం… ఫాఫం… తెలియనట్టుంది…

June 23, 2025 by M S R

.

ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చి, ఎదుగుతున్న దశలో అణకువ, ఒద్దిక, డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్ అవసరం… అది లేనివాళ్లు అనుభవిస్తారు… నాకెందుకో భావుక కొత్త దర్శకుడు ఫణీంధ్ర నరిసెట్టికి ఈ నిజం ఎవరైనా చెబితే బాగుండు అనిపిస్తోంది…

మొన్నామధ్య ప్రిలిరీజ్ మీడియా మీట్లలో కాస్త అతిగా మాట్లాడాడు అనిపించింది… మొదట్లో విష్వక్సేన్ యాటిట్యూడ్ కూడా ఇలాగే ఉండేది, ఇంకాస్త అతిగా… దెబ్బలు పడేకొద్దీ అణిగాడు, ఒదిగాడు… ఇకపై ఈ యాటిట్యూడ్ చూపను అని లెంపలేసుకున్నాడు…

Ads

ఈ ఫణీంద్ర నరిసెట్టి గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే… 8 వసంతాలు అని ఓ సినిమా తీశాడు కదా… వీకెండ్ డేస్‌ కూడా సరిగ్గా నిలబడలేదు, కొన్నిచోట్ల షోలు తీసేశారు… అంత ఘోరమైన ఫ్లాప్… ఎందుకు..? సినిమాలో దమ్ములేదు…

మొన్న మనమే రివ్యూలో చెప్పుకున్నాం కదా, ఇవి మేఘసందేశం రోజులు కావు అని… భావకవిత్వం తెరపై పనికిరాదు అని… అవి తీయాలంటే ఓ స్ట్రేచర్ కావాలి, ఏ మణిరత్నం మాత్రమే తీయగలడు… తెరపై కవిత్వాన్ని పండించగలడు…

యండమూరి నవలలు వెన్నెల్లో ఆడపిల్ల, ఆనందో బ్రహ్మ వంటివి చదవడానికి అద్భుతంగా ఉంటాయి… అవి పూర్తిగా కవిత్వాలు కూడా కావు… థ్రిల్ ఉంది… ఐనాసరే, సినిమాను అల్లాటప్పాగా చుట్టేసే సబ్జెక్టులు కావు అవి… సో, వర్తమాన ట్రెండ్లను పట్టుకోవడమే దర్శకుడి పని… అదుగో అక్కడ ఫెయిలయ్యాడు ఫణీంద్ర…

విజువల్ పొయెట్రీని ప్రేమించేవాళ్లు తప్ప ఇంకెవరికీ ఈ సుదీర్ఘ, సాగదీత కథనం ఎక్కదు… వాళ్లేమో సినిమాలు చూడరు…సో, వేరేవాళ్లను ఆకట్టుకోదు… అక్కడే ఉంది ట్రిక్కు… భావుకత వేరు, ఉన్నతాభిరుచి వేరు, ప్రేక్షకులందరినీ ఆకట్టుకునే ప్రజెంటేషన్, సరుకు వేరు… అక్కడే సదరు దర్శకుడు ఫెయిలయ్యాడు…

పైగా నేను కమర్షియల్ మాస్ సినిమాలు తీయలేనా..? అదెంత పని, ఆఫ్టరాల్ అంటాడు… ఇవి కమర్షియల్ లెక్కల్లో ఇమడవు… ఇలా మాట్లాడేవాళ్లను చాలామందిని చూసింది ఇండస్ట్రీ… ఒద్దిక అవసరం… శేఖర్ కమ్ముల ప్రెస్‌మీట్లు, ఇంటర్వ్యూలను చూడాలి ఓసారి ఈ దర్శకుడు…

అసలు తన కెరీర్ ఎంతని..? మధురం షార్ట్ ఫిల్మ్‌తో ఫణీంద్ర నర్సెట్టికి కాస్త గుర్తింపు వచ్చింది. ఆ తరువాత చాలా ఏళ్లకు మను అంటూ వెండితెరపైకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు…. ఆ మూవీ కమర్షియల్‌గా డిజాస్టర్ అయింది… మరి బాట మ్ారాలి కదా… లేదు…

నిజానికి 8 వసంతాలు సినిమా పేరు పలు కలెక్షన్ల వెబ్ సైట్ల జాబితాలోనే కనిపించడం లేదు, అంత లైట్ తీసుకున్నారు వాళ్లు… కానీ ఏమాటకామాట… తను మంచి రైటర్… కానీ మంచి రచయిత వేరు, మంచి దర్శకుడు వేరు… ఐమీన్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వేరు అని…

సినిమాలో అనంతిక సనిల్ కుమార్ మాత్రమే హైలైట్… ఆమే లేకపోతే సినిమాలో ఏమీ లేదు… కానీ ఆమే కొత్త… ఒక్కతీ సినిమాను మోయలేదు కదా, ఎంత కరాటే బ్లాక్ బెల్ట్ స్టామినా ఉన్నా సరే… ‘‘అందరూ కమర్షియల్ సినిమా ఎందుకు తీయవు అని నన్ను అడుగుతుంటారు…

కమర్షియల్ సినిమాలు తీయలేక కాదు… తీయాలని లేక… నాకు ఇలాంటి కవితాత్మకమైన చిత్రాలు, ప్రేమ కథా చిత్రాలు మాత్రమే చేయాలని ఉంది… ఈ ప్రేమ, కవిత్వాలు ఎందుకు అని ఒక్క పది నిమిషాలు పక్కన పెడితే.. నేను ఎలాంటి కమర్షియల్ సినిమాలు తీయగలనో.. ఈ చిత్రంలోని వారణాసి ఫైట్ సీక్వెన్స్ చూస్తే అర్థం అవుతుంది…’’ అని ఏదో చెప్పుకొచ్చాడు… దీన్నే ‘అతి’ అంటారు… ఇండస్ట్రీలో ఏమాత్రం పనికిరాని యాటిట్యూడ్ అది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎదిగే దశలోనే ఒద్దిక, అణకువ అవసరం… ఫాఫం… తెలియనట్టుంది…
  • ఫాఫం రష్మిక…! స్టిల్ సొంతిట్లో నిరాదరణే…! కుబేర భారీ డిజాస్టర్…!!
  • 60 ఏళ్ల క్రితమే… ఈ గొంతు నులిమే కుట్ర… నరకం చూసి, చావును గెలిచింది…
  • అమెరికాలో… నా వాలుజడ కృష్ణవేణి, నా పూలజడ వెన్నెలా గోదావరి…
  • బిన్ లాడెన్ – కొండ గుహ – బంకర్ బ్లస్టర్…! మళ్లీ చెప్పుకోవాలి కథ…!!
  • పార్టీ అమానవీయత ఖచ్చితంగా తప్పే… కానీ జగన్ ప్రత్యక్ష బాధ్యుడా..?!
  • ఇజ్రాయిల్‌కు చేతకాలేదు… అమెరికాను అడిగింది… యుద్ధంలో ట్విస్టు..!!
  • ఎంతటి మంచి భరోసా ఆర్యా… ఇదొక జీవిత బీమా ధీమా…
  • ఫాఫం, ఈ బీసీ కెరటం చివరకు కవిత క్యాంపులో విరిగిపడిందా..?!
  • సితారే జమీన్ పర్..! గుడ్ టేస్ట్, గుడ్ స్టోరీ, గుడ్ ఎఫర్ట్… గుడ్ మూవీ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions