Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మోడీ అనాలోచితంగా కాపాడితే తప్ప… ఫోన్ ట్యాపింగ్ కేసీయార్ మెడకు..!!

June 20, 2025 by M S R

.

Mohammed Rafee ……. ప్రకాశరావు చెప్పిందల్లా నిజమే అవుతుంది! – ఫోన్ వైర్ పెద్దాయనకు చుట్టుకుంటోందా?

గోనె ప్రకాశరావు అంతే! భయపడటాలు లేవు! బెదిరిపోవడాలు లేనే లేవు! అంత ఖుల్లం ఖుల్లా! తెలిసింది తెలిసినట్లు, ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారు! కొండొకచో అరటి పండు వలచినట్లు, బట్టలు ఉతికి తీగపై ఆరేసినట్లే!

Ads

ఫోన్ ట్యాపింగ్ లో ఇవాళ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు! ఎన్నికల ముందు నుంచి ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారు! ఇది మహా గోప్యత వ్యవహారం! కెసిఆర్ చుట్టూ ఫోన్ వైర్ మెల్లమెల్లగా చుట్టుకుంటోంది!

మొత్తం 615 మంది రాజకీయ నాయకులు, అధికారులు, మీడియా అధినేతలు, సినీ నటులు, వ్యాపారవేత్తలు, కొంతమంది పౌరహక్కుల నేతలు తదితరుల ఫోన్లను ట్యాప్ చేశారు. ఇందులో ప్రధాన సూత్రధారి ప్రభాకరరావు నోరు మెదపక పోయినా ఇప్పటికే పూర్తి ఆధారాలు సమీకరించినట్లు సమాచారం.

ప్రణీత్ రావు తదితరులు అప్రూవర్లుగా మారడంతో మొత్తానికి కొలిక్కి వచ్చేస్తోంది! మాజీ డిజిపి చుట్టూ కథ తిరుగుతోంది! ఆ కథ వెనుక ఉన్నది కెసిఆర్, వారి కుటుంబ సభ్యులే కీలకం అని చెబుతున్నారు!

ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులు వెలుగులోకి రావడం ఇది మూడవసారి! గతంలో 1972లో అమెరికాలో రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ముందు గెలుపు కోసం ఫోన్ ట్యాపింగ్ చేసి దొరికిపోయింది! ఇండియాలో 1988లో కర్ణాటకలో అప్పటి రామకృష్ణ హెగ్డే ప్రభుత్వం ఇలాంటి కేసులో ఇరుక్కుంది! 2023లో కెసిఆర్ ఈ కేసులో ఇరుక్కున్నారు!

గోనె ప్రకాశరావు అప్పుడెప్పుడో 1983లో సంజయ్ విచారమంచ్ స్వతంత్ర్య అభ్యర్థిగా పెద్దపల్లి ఎమ్మెల్యే గా గెలిచారు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆర్టీసీ చైర్మన్ గా చేశారు! అంతకు మించి ఆయన ఏమీ చేయకపోయినా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు!

ఏదైనా సరే సూటిగా మాట్లాడతారు! కుండబద్దలు కొట్టినట్లే ఉంటుంది! 1982 నుంచి 2005 వరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండి అన్నీ గమనిస్తూ ప్రతి ఒక్కరి తప్పుల చిట్టా ఆయన మైండ్ లో పెట్టుకున్నారు! ఇవాళ సిట్ విచారణ తరువాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు!

ఇక ఈ కేసులోంచి కెసిఆర్ ను ఎవ్వరూ కాపాడలేరు అని ఆయన జోస్యం చెప్పేసారు! ప్రభాకరరావు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నిజాలు చెప్పక తప్పదని, జూలై 5 తరువాత ఆయన్ని అరెస్ట్ చేస్తారని అన్నారు.

ప్రధాని కావాలనే లక్ష్యంతో కెసిఆర్ పార్టీని బిఆర్ఎస్ గా మార్చి చుట్టు పక్కల రాష్ట్రాలు పర్యటిస్తూ, ఇక్కడ అందరి ఫోన్లు ట్యాప్ చేయించి పూర్తిగా ఇరుక్కుపోయారని గోనె ప్రకాశరావు తెలిపారు. మూడవసారి ఎలాగైనా అధికారంలోకి వస్తామనే నమ్మకంతో పెద్దగా జాగ్రత్తలు తీసుకోలేదని, ఆ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ఇరుక్కుపోయారని ఆయన వివరించారు. కేంద్రం జోక్యం చేసుకుని చిత్తశుద్ధితో ఈ కేసును సిబిఐకి అప్పగించాలని, ఇందుకు స్థానిక బిజెపి నేతలు కృషి చేయాలని కోరారు.

గోనె ప్రకాశరావుకు ఇక్కడే కాదు, అమెరికాలోనూ మన తెలుగు వారిలో అమితమైన క్రేజ్ ఉంది! తానా, అటా సంస్థలు నిర్వాహించే పొలిటికల్ సెషన్స్ లో ప్రతి ఏటా ప్రకాశరావు ప్యానెల్ స్పీకర్ గా ఉండి తీరాల్సిందే! ప్రకాశరావు మాటలు కూడా అంతే ఆసక్తిగా అక్కడ వింటూ ఎంజాయ్ చేస్తుంటారు!

నేను చాలాసార్లు అక్కడ ప్రత్యక్షంగా చూశాను! రాజకీయాల్లో ఇలాంటి నేతల అవసరం వుంది! కానీ ఇలాంటివారికి పార్టీలు సీట్లు ఇవ్వవు! ఇచ్చినా ప్రజలు గెలిపించరు! ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా నిక్కచ్చిగా ఉంటారు! నిజాయితీగా ఉంటారు! డబ్బులు పంచరు! అది మన జనానికి నచ్చదు!… - డా.మహ్మద్ రఫీ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వాడెప్పుడూ పాకిస్తానీ స్నేహితుడే… మనమెందుకు సాగిలబడుతున్నాం…!?
  • మోడీ అనాలోచితంగా కాపాడితే తప్ప… ఫోన్ ట్యాపింగ్ కేసీయార్ మెడకు..!!
  • అనితర సాధ్యమైన ఆద్యకళకు ఏది గుర్తింపు..? ఏది పట్టింపు..?!
  • 8 వసంతాలు… కంప్లీట్ అనంతిక షో… కానీ మేఘసందేశం రోజులు కావివి..!!
  • పెట్టుడు జనన ముహూర్తాలు నమ్ముతారా..? ఈ కథ చదవాలి మీరు..!!
  • ఆ భీకరమైన శబ్దం విని, భయపడి, ఆ లింక్ నొక్కారో… అయిపోయారు..!!
  • పెట్టుడు ముహూర్తాల్లో కృత్రిమ జననాలు జాతకాలను మారుస్తాయా..?!
  • బనకచర్ల ప్లాన్ బద్దలు… చంద్రబాబు ప్రణాళికలపై రేవంత్ పాశుపతం..!!
  • ఫాఫం కొనఊపిరి… పరుచూరి డైలాగుల దెబ్బకు వెంఠనే హరీమంది రోజా…
  • భేష్ శేఖర్ కమ్ముల… కుబేర ఓ క్లీన్ హిట్… ఆకట్టిపడేశావు పలు సీన్లలో…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions