సొంతంగా బలం పెంచుకోవాలనీ, అధికార పార్టీల అక్రమాలపై పోరాడాలనీ అసలు ఢిల్లీ పాదుషాలకు ఉంటే కదా… ఫస్ట్ నుంచీ ఇంతే… నిజానికి బండి సంజయ్‌దే కదా తప్పు… తను కోవర్టుగా వ్యవహరించలేడు… ఢిల్లీలో పైరవీలకు మాత్రమే పరిమితం కాలేడు… అధికార పార్టీకి తెరవెనుక విధేయంగా ఉండలేడు… తనేదో తమిళ అన్నామలై అనుకున్నట్టున్నాడు… అధికార పార్టీపై దూకుడుగా వెళ్లాడు… ప్చ్, కేసీయార్‌కు బండి సంజయ్ మీద వైరాగ్యం వచ్చింది…
బయట ఎలా కనిపించినా సరే, లోలోపల కేసీయార్ పట్ల సాఫ్ట్ ధోరణితో లేకపోవడం హైకమాండ్‌కు నచ్చదు అని తెలుసుకోలేకపోయాడు ఫాఫం… దెబ్బతిన్నాడు… ఇప్పుడు నేను ఎంత పద్ధతిగా బిహేవ్ చేసినా, నన్నెందుకు పీకిపారేశారో సమజైత లేదు అని బాధపడటం దేనికి..? బండి సంజయ్‌ను ఎందుకు పీకేశారో సగటు బీజేపీ అభిమానికీ తెలియదు… కేసీయార్ మోడీకి సరెండర్ అయ్యాడా, మోడీయే కేసీయార్‌కు సరెండర్ అయ్యాడా అర్థం కాదు…
Ads
ఇటు బీఆర్ఎస్ గానీ, అటు ఎంఐఎం గానీ పరోక్షంగా మనకే సహకరిస్తాయనే సోయి బండి సంజయ్‌కు లేకుండా పోవడమే తన అనర్హత… కాంగ్రెస్ నాయకత్వంలో ప్రతిపక్షాలు ఒక్కటి గాకుండా కేసీయార్ ఉపయోగపడుతూ ఉంటాడనే మార్మిక వాస్తవాన్ని తెలుసుకోలేకపోవడమే తన అనర్హత… మోడీ, అమిత్ షా నా పనితీరు మెచ్చుకున్నారని చంకలు గుద్దుకోవడమే గానీ వాళ్ల లెక్కలు వాస్తవంలో వేరేగా ఉంటాయని సమజ్ కాలేదు…
గుండె జబ్బున్నా పాదయాత్ర చేశానని చెప్పుకొని ఇప్పుడు బాధపడటం కాదు… మోడీ చేయమన్నాడా..? డాక్టర్ వద్దన్నా వినలేదని ఇప్పుడు చింతిస్తే ఏం ప్రయోజనం..? కాళ్లకు రక్తాలు కారుతున్నా చెప్పులు లేకుండా తిరిగానని ఆవేదనపడితే ఫాయిదా ఏమిటి ఇప్పుడు..? వీథి పోరాటాలు చేయాలని పార్టీ చెప్పి ఉండవచ్చుగాక… కానీ అలా నటించాలే తప్ప నిజంగా చేయకూడదు… అది పార్టీ హైకమాండ్‌కు నచ్చదు…
ఇప్పుడు చూడు… కాస్తోకూస్తో జోష్ ఆమధ్య కనిపించిన పార్టీ ఇప్పుడు ఎక్కడికో జారిపోయింది… జారిపోయినా హైకమాండ్‌కు పర్లేదు… రేప్పొద్దున అవసరమైతే కేసీయార్ సపోర్ట్ కావాలి… అందుకే నో అరెస్ట్ ఆఫ్ కవిత, నో కాలేశ్వరం కథ… ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బీజేవైఎంల నుంచి ఎమర్జ్ కావడం కూడా అనర్హతే… ఏదో ప్రగతిశీల భావజాలం నుంచి ఎదిగి, ఫక్తు రాజకీయ నాయకుడిలా ఉండాలి… ఆ సోయి, ఆ లౌక్యం లేక ఫాఫం, బండికి నొగలు విరిగినయ్జ… ఇదంతా తెలంగాణ సగటు బీజేపీ కార్యకర్తల మనోభావాలే… సో వాట్… ఎవడిక్కావాలి..?!
Share this Article