‘పొత్తు ధర్మం మరిచి నువ్వు ఇద్దరి పేర్లు ప్రకటించేశావుగా, తప్పు, కరెక్టు కాదు, సో, నేనూ రెండు పేర్లు ప్రకటిస్తున్నా, ఐనా సరే ఇద్దరమూ కలిసి పొత్తులోనే ఉంటాం… కలిసి జగన్‌ను పాతరేస్తాం…’ అన్నాడు కదా పవన్ కల్యాణ్… ఏవో రెండు సీట్లకు జనసేన అభ్యర్థుల్ని ప్రకటించాడు కదా… ఆ తరువాత పొద్దున్నుంచీ చంద్రబాబు మీద వెల్లువెత్తుతున్న సోషల్ మీడియా పోస్టులు చూస్తుంటే నిజంగానే తన మీద జాలేస్తోంది…
ఎంతటి చంద్రబాబు, ఏమిటీ ప్రస్తుత దుర్గతి…? అంతటి ఎన్టీయార్‌నే కసుక్కుమని వెన్నుపోటు పొడిచీ, వోకే బ్రదర్ అనేలా తరువాత ప్రజల ఆమోదం కూడా పొందగలిగిన ఆ చంద్రబాబేనా..? ఢిల్లీలో గిరగిరా దేశరాజకీయాల చక్రాలు తిప్పిన ఆ చంద్రబాబేనా..? వరల్డ్ బ్యాంకు మెచ్చి మేకతోలు కప్పిన ఆ చంద్రబాబేనా..? మరేమిటి ఇప్పుడు ఇలా తనను, తన ఖ్యాతిని, తన పార్టీని, తన భవిష్యత్తును ఒక సినిమా నటుడి కాళ్ల మీద పడేసుకున్నాడేమిటి..?
అసలు తన వోటు బ్యాంకు ఏమిటి..? పవన్ కల్యాణ్ వోటు బ్యాంకు ఎంత..? చివరకు లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబే అని చెబుతున్నా సరే పవన్ కల్యాణ్ సహించడం లేదు… అంటే అర్థమేమిటి..? ఇలా పవన్ కల్యాణ్ కాళ్ల దగ్గర సాగిలబడిపోవడానికి కారణమేమిటి..? ఇలా కొన్ని వేల మెట్లు దిగిపోవడానికి బదులు ఎంచక్కా బీజేపీలో పార్టీని విలీనం చేసి, లోకేష్‌ను ఓ కేంద్ర మంత్రిని చేసేసి, వానప్రస్థం స్వీకరించడం బెటర్ కాదా..?
Ads
లోకేష్ సీఎం వ్యాఖ్యలను కూడా పవన్ కల్యాణ్ సహించలేకపోతున్నాడు అంటే… తనే సీఎం క్యాండిడేట్ అని ముందుగానే చెబుతున్నట్టు భావించాల్సిందే కదా… అస్సలు ఒక్కటంటే ఎమ్మెల్యీ సీటు లేని ఒక పార్టీ తమ అధినేతే కాబోయే సీఎం అని ముందే షరతు పెడుతున్నా సరే, చంద్రబాబు ఇంకా తనతో ఊరేగుతున్నాడంటే ఇంతకుమించిన నేలస్థాయి ఇంకేం ఉంటుంది..? ఎన్డీయే పొత్తులను డిక్టేట్ చేసిన మనిషి పొత్తు ధర్మం మీద పాఠాలు నేర్పించుకుంటున్నాడు…
మూడో వంతు సీట్లు ఇస్తే గానీ, సీఎం పదవి ఇస్తే గానీ టీడీపీతో పొత్తు అవసరం లేదు అని జనసేన సోషల్ మీడియాలో ఎక్స్‌పోజ్ అవుతున్నా సరే చంద్రబాబు సిగ్గుతో తలవంచుకునే సీన్ కూడా ఎక్కడా కనిపించడం లేదు ఫాఫం… నువ్వు రెండు ప్రకటించావు, నేను రెండు ప్రకటించాను అనే వ్యాఖ్యలు ఇండియా కూటమి కూడా సిగ్గుపడే రేంజులో కనిపిస్తున్నాయి… అంతేకదా…
ఢిల్లీ, పంజాబ్ తప్ప మిగతా దేశంలోనే కాంగ్రెస్‌తో పొత్తు అంటాడు కేజ్రీవాల్… బెంగాల్‌లో ఒక్క సీటూ ఇచ్చేది లేదు, ఎన్నికల తరువాత పొత్తు గురించి ఆలోచిద్దాంలే అని తీసిపారేస్తున్న తృణమూల్ కాంగ్రెస్… బీహార్‌లో దోస్తీ కటీఫ్ అంటున్న జేడీయూ… ఆల్‌రెడీ కట్ చేసుకున్న జేడీఎస్… ఇండియా కూటమి దుర్గతి అది… చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొత్తు కూడా దాదాపు అదే స్థితిలో కనిపిస్తోంది… ఇంకా ఈ పొత్తులో బీజేపీ కూడా చేరాలట… ఫాఫం, మోడీ కూడా చంద్రబాబులాగే మాటలు పడాల్సి వస్తుందేమో… రెండు టరమ్స్ బీజేపీని అధికారంలోకి తెచ్చి, మూడో టరమ్ కూడా ప్రధాని కావడానికి పరుగులు తీస్తున్న మోడీకి ఇది అవసరమా..? రామా, శ్రీరామా… ఇదేం వాతావరణం బాలక్ రామా…!!
Share this Article