.
మోడీకి, అమిత్ షాకు… ఏమాత్రం సోయి లేనట్టుంది… నిజంగానే… తెలంగాణలో సొంతంగా అధికారంలోకి రావడానికి మంచి చాన్స్ ఉన్నా గాలికి వదిలేసింది స్థానిక నాయకత్వం…
ఇప్పుడు కాదు, వెంకయ్యనాయుడి సారథ్యంలో చంద్రబాబుకు బానిస పార్టీగా మార్చిన కాలం నుంచీ అంతే… సరే, వెంకయ్యనాయుడు ఔటాఫ్ పాలిటిక్స్… చంద్రబాబుకూ తెలంగాణాకు సంబంధం లేదు… మరి ఇప్పుడు..? అదే వెంకయ్య శిష్యరత్నం అదే బాటలో….
Ads
కేసీయార్ కరుణాకటాక్ష వీక్షణాల కోసం వెంపర్లాడిన బీజేపీ ముఖ్యనేతల జోలికి వెళ్లడానికి బీజేపీ హైకమాండ్ గడగడా ఎందుకు వణికిపోతోంది….? ఆ కోవర్టులే నా పార్టీకి శ్రీరామరక్ష అనుకుంటున్నదా..? మజ్లిస్‌కు, నక్సలైట్లకు ఎదురుపడి, నిలబడి పోరాడిన బీజేపీ కేడర్ తీవ్రంగా నిరాశపడేది అందుకే…
ఇదంతా ఎందుకూ అంటే..? ది గ్రేట్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో కలిసి ఓ ప్రెస్ మీట్ పెట్టాడు కిషన్ రెడ్డి… అందులో రామ్మోహన్ నాయుడు మామునూరు ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ అనేది చంద్రబాబు దయ, పుణ్యం అన్నట్టు ఓన్ చేసుకున్నాడు… (అదే చంద్రబాబు ఇన్ని దశాబ్దాల పాలనలో ఎందుకు పట్టించుకోలేదు అనడకండి, పురుగులు పట్టిపోతారు… రామ్మోహన్ నాయుడికి కోపం వస్తుంది…)
చంద్రబాబు తనకు చెప్పాడట… విమానయాన కేంద్ర మంత్రిగా రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి చేయి అన్నాడట, తను మామునూరుకు వోకే అన్నాడట… క్రెడిట్ అంతా చంద్రబాబుదేనట… ఫస్టాఫ్ ఆల్ సిగ్గుపడాల్సింది మోడీ… తరువాత కిషన్ రెడ్డి….
కూటమిలో బీజేపీ, టీడీపీ ఉండవచ్చుగాక… ఐతేనేం… తెలంగాణలోకి మళ్లీ జొరబడటానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు, రామ్మోహన్‌నాయుడి వంటి అర్థజ్ఞానులు స్రాటజిక్‌గా ప్రయత్నిస్తుంటే,,, ఆ పక్కనే కూర్చున్న కిషన్ రెడ్డి సైలెంటుగా ఉన్నాడు… జాలేసింది కిషన్ రెడ్డిని చూసి కాదు, బీజేపీని చూసి…
మేఘా, మైహోం ఫైళ్లు మోసినప్పుడు కాదు కిషన్ రెడ్డీ… రేవంత్ రెడ్డి సూటిగా తిడుతున్నాడు, నువ్వే తెలంగాణకు పెద్ద అడ్డంకి అని…. అది నిజమే అన్నట్టుగా నీ ప్రవర్తన… అసలు ఆ రామ్మోహన్ నాయుడు కెరీర్ ఎంత..? వయస్సెంత..? నువ్వు నోరు మూషుకుని తలూపుతావా..? కేసీయార్ నేర్పించాడా..?
ఎందుకంటే… నువ్వు ఎప్పుడో మోడీ, అమిత్ షా పరిధి నుంచి బయటపడ్డావు… ఫాఫం బీజేపీ ఖర్మ… భరిస్తోంది, నిన్నూ, లక్ష్మణ్‌నూ… ఇంకెవడినీ రానివ్వరు… వస్తే గిస్తే బండి… ఏం మాట్లాడతాడో తనకే తెలియదు… ఈటలను సహించరు… అందరూ అంటారు బీజేపీ హైకమాండ్ బాగా దీర్ఘకాలిక స్ట్రాటజీ ఉన్న పార్టీ అని… నమ్మేవాడి బొంద..!!
కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రాజాసింగ్, ఈటల లేని బంగారు బీజేపీ రోజులు ఏమైనా వస్తాయా..? ఓ అన్నామలై వస్తాడా..? నో, నో, ఆశకు హద్దు ఉండాలి… చూస్తూ ఉండండి… ఇదే బీజేపీ రేప్పొద్దున ఇంకా కేసీయార్ ఎదుట ఎలా మోకరిల్లబోతున్నదో… తను కొన్నేళ్లుగా చెప్పులు తీసుకుని కొడుతున్నా సరే…! సిగ్గూశరం లేని తెలంగాణ బీజేపీ..!!
Share this Article