ఎప్పుడైనా బోర్ కొడుతుంటే మంచు విష్ణు మీడియా మీట్లు, ప్రకటనలు తిరగేయాలి… మనసారా నవ్వుకోవచ్చు… రిలాక్స్… బండ్ల గణేష్‌లు, కేఏపాల్‌లు పైసాకు పనికిరారు… తన వాక్చాతుర్యానికి ఇప్పుడు ముంబై వేదిక అయ్యిందట, అందరూ చప్పట్లు కొట్టారట… వాడెవడో రాశాడు… ఓ ముఖ్యమైన సైటే లెండి… ముంబైకు ఎందుకు వెళ్లాడు మన పెకాహం పంతులు..?
జిన్నా అనే ఓ సినిమా తీస్తున్నాడు కదా… అసలు ఆ పేరు ఎంపికే బ్రహ్మండమైన టేస్టు… అసలు మన శతృదేశం జాతిపిత, దేశాన్ని చీల్చిన జిన్నా పేరుతో సినిమా తీయడం మామూలు విషయమా..? ఎహె, ఆయన బయోపిక్ కాదు, విష్ణుకు అంత సీనెక్కడిది గానీ… తన పాత్ర పేరు గాలి నాగేస్పర్రావు అట… దాంతో జిన్నా అని పెట్టామని ఆ సినిమా టీంలో కోన వెంకటో, మరొకరో చెప్పినట్టు గుర్తు… దానికి గిన్నా అని పెట్టుకోవచ్చు కదా అనకండి, కళ్లు పోతాయి… చెంపలేసుకొండి…
ఆ సినిమాలో మాంచి బోల్డ్ కంటెంట్ ఉంటుందట… మరి దానికి దీటైన యాక్టర్లు కావాలి కదా… మరీ రష్మినో, ఆంటీనో పెట్టలేరు కదా… ఏకంగా సన్నీ లియోనిని దింపారు… తోడుగా పాయల్ రాజపుత్… ఈ సన్నీ లియోని… పేరు చివర అక్షరాలు మర్యాదగా ధ్వనించడం లేదు… సో, సన్నీ లియోన్… ఎనిమిదేళ్ల క్రితమే మంచు కుటుంబానికి పరిచయం… కరెంటు తీగ అని ఓ సినిమా చేసింది… సినిమా ఘోరంగా తన్నేసింది… అది వేరే సంగతి… మియా మల్కోవాలు, సన్నీ లియోన్‌లు సినిమాను ఆడించలేరు…
Ads
ఎనిమిదేళ్ల తరువాత మళ్లీ తీసుకున్నారు ఆమెను… అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా..? బరువు పెరిగింది… మొహంలో కళాకాంతులు లేవు… అసలే ఆమెది ఉత్త గాజుమొహం… ఏదో ఐటమ్ సాంగ్ పెట్టారు జారు మిఠాయో అని… ట్యూన్ పర్లేదు, కానీ ఓ జోష్ లేదు, విష్ణు బాగానే చేశాడు… కానీ సన్నీ డాన్స్ చేస్తుంటేనే జాలేసింది… సినిమాలో షాళా భఱువైణ ఫాథ్రే ఇచ్చినట్టున్నారు… పాట సాహిత్యం, సారీ, కంటెంటులో ఓ ఉదాహరణ చూద్దాం… ‘‘ఆడదాన్ని కాదంట, మొగ్గలఖింగో’ అని పలికించారు గాయనితో… ఆడదాన్ని కాదంట వరకూ వోకే… అర్థమవుతూనే ఉంది ఆమెను చూస్తుంటే… కానీ ఈ మొగ్గలఖింగో అనే పదమే సమజ్ కాలేదు… బహుశా మనకు తెలియని ఏదో మాండలికంలోని మాంచి సరసపదమేమో… (అది ఏ ప్రాంత భాషో ఎవరైనా చెబితే బాగుండు…)
ఆ పాట గురించి చాల్లే గానీ… మరి జిన్నా పేరు పెట్టాక దేశవ్యాప్తంగా విడుదల చేయకపోతే ఏం బాగుంటుంది..? పైగా ‘మా’ అధ్యక్షుడాయె… ప్రకాష్ రాజ్ నవ్వడా..? అసలే పాన్ ఇండియా సీజన్… అందుకే జిన్నా భాయ్ అని పేరు పెట్టేసి దేశప్రజల మీదకు వదులుతున్నారు ఈ సినిమా నిర్మాతలు… ముంబైలో పెట్టిన మీడియా మీట్‌లోనే ఓ హిందీ ట్రెయిలర్, రెండు పాటల్ని ప్రదర్శించారు… జిన్నా టైటిల్ వివాదం ఏమిటండీ అనడిగాడుట ఓ విలేఖరి… కంట్రవర్సీ ఉంటేనే ప్రచారం కదా అని బదులిచ్చాడట విష్ణు, హబ్బ, ఎంత స్పాంటేనిటీ, ఎంత చాతుర్యం, భలే చెప్పారండీ పెకాహం గారూ…
సినిమా ముందు చెప్పిన తేదీకన్నా లేటుగా ఎందుకు రిలీజ్ చేస్తున్నారండీ అనడిగాడుట ఓ విలేఖరి… ‘‘ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంది… జిన్నా గాడు దీపావళి క్రాకర్ అని… సో, దీపావళిరోజే విడుదల చేస్తే ఆప్ట్‌గా ఉంటుందని, దీపావళికి పోస్టపోన్ చేశాం’’ అన్నాడు విష్ణు,.. హబ్బ, మళ్లీ ఆగకుండా చప్పట్లు కొట్టాలనేంత చాతుర్యం, చాకచక్యం… మరో ఆణిముత్యం చెప్పాలా..? RRR సినిమాను ప్రేక్షకులు విపరీతంగా ఆదరించడాన్ని ఉదాహరణగా తీసుకున్న మంచు విష్ణు.. ‘‘నేనొక అబద్ధాలకోరుని… నేను చెప్పే అబద్ధాలను థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడు నమ్మేలా చేస్తే అదే నేను సాధించిన విజయం’’ అన్నాడు… అంటే ఆర్ఆర్ఆర్ సినిమాను తిట్టాడా..? పొగిడాడా..? లెట్ దెమ్ నో అంకుల్…!!
Share this Article