Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యాడ్ గురు… మన వాణిజ్య ప్రకటనల రంగంలో ఒక శకం సమాప్తం…

October 25, 2025 by M S R

.

( గోపు విజయకుమార్ రెడ్డి ) ….. పీయుష్ పాండే…, ఫేస్ అఫ్ ది ఇండియన్ అడ్వర్టయిజింగ్…. ఇంకా ఒక్క ముక్కలో చెప్పాలంంటే క్రికెట్ కి సచిన్ ఎలాగో, సాఫ్ట్‌వేర్‌కి బిల్‌గేట్స్ ఎలాగో, అడ్వర్టయిజింగ్ రంగానికి పీయుష్ పాండే అలాగా..!

18 అధికారిక భాషలు, భిన్న సంస్కృతులు, భిన్న సామాజిక నేపథ్యాలు కలిగిన ఒక ఉపఖండం భారత దేశంలో… ఒక 40 సెకండ్లలో అన్ని బాషలకి, అన్ని ప్రాంతాలకి అర్ధమయ్యే విధంగా ఒక బ్రాండ్ స్టోరీ చెప్పడం ఆషామాషీ విషయం కాదు…

Ads

అటువంటిది గత 40 యేండ్లుగా డిఫరెంట్ జెనరేషన్స్ కి అంటే…మన తాతలకి, మన తండ్రులకి, మనకి మన పిల్లలకి అర్ధమయ్యే విధంగా చిన్న సబ్బు బిళ్ళ యాడ్ నుండి పెద్ద పెద్ద కార్ల యాడ్స్ వరకు క్రియేటివ్స్ చెయ్యడం నీకే చెల్లింది గురువా…

మీరు చేసిన సేవలు, మీరు చెప్పిన కథలు, మీరు ఇన్స్పైర్ చేసిన జనరేషన్స్ నాలాంటి వాళ్ళు ఎందరో అడ్వర్టయిజింగ్ అనే ఒక కెరీర్ ఆప్షన్ ని ఎంచుకోవడానికి కారణం…, ఎక్కడో జైపూరులో పుట్టి, ఢిల్లీలో చదువుకొని, ముంబయిలో జాబ్ చేస్తూ… ఒక దేశాన్ని, ఒక ఇండస్ట్రీని నాలాంటి సామాన్యులకి పరిచయం చేసినందుకు హాట్సాఫ్ సార్…

ఒక యాడ్ గురు మరణిస్తే… ప్రధాని మోడీతో సహా సచిన్, అమితాబ్, ఉదయ్ కొఠక్, ఆనంద్ మహీంద్రా, గౌతమ్ ఆదాని… ఇలా ఎన్నో రంగాల నుంచి ఎందరో మీకు సంతాపం తెలపడం అంటే మీ ఇంపాక్ట్ వాళ్ల మీద ఎంత ఉందో తెలుస్తుంది…

గౌతమ్ ఆదానీ అన్నట్టు, మీరు ఒక అడ్వర్టయిజింగ్ లెజెండ్ కాదు.., (Piyush Pandey was far more than just an advertising legend. He was the voice that made India believe in its own story. He gave Indian advertising its self-confidence, its soul, its “swadeshi” swagger. And he was a very good friend! Like a master batsman, he played every stroke with his heart) బహుశా ఇంతకంటే బాగా మీ గురించి ఇంకెరు చెప్పలేరేమో…

చల్ మేరే లూనా… అని మీరు చెప్పితేనే, మా నాన్న తన ఫస్టు మొపేడ్ లూనా కొన్నాడు (1984)… మీరు చెప్పితేనే అక్కడి నుండి స్కూటర్ కొన్నాడు (హమారా బజాజ్ )… మీరు చెబుతేనే మా అమ్మ నిర్మా సర్ఫ్ కొన్నది.., మీరు చెప్పితేనే నేను ఎయిర్టెల్ సిమ్ కార్డు వాడుతున్న (హర్ ఏక్ ఫ్రెండ్ జరూరి హై )… క్రికెట్ మ్యాచులల్లో సచిన్ బ్యాటింగ్ తర్వాత బాగా ఎంజాయ్ చేసింది మీరు చేసిన వోడాఫోన్ ఫోన్ కుక్కపిల్ల యాడ్స్, ఇంకా జూ…. జూలూ)…

మా చిన్నప్పుడు మా తమ్ముడు, చెల్లితోపాటు మీరు చెప్పిన ఐ లవ్ యు రస్నా అమ్మాయి మాకు చెల్లి అయ్యింది… మీరు చెప్పితేనే ఫెవికాల్ అంత బలంగా అతుక్కుంటుంది అని తెలిసింది… మీరు చెపితేనే “హర్ ఘర్ కుచ్ కెహత హై ” అని ఆసియన్ పెయింట్స్ ద్వారా తెలిసింది, చివరకి క్యాడబరీ చాకొలెట్ ఎంత స్వీట్ గా ఉంటుందో… గుజరాత్ ఎంత అందంగా (గుజరాత్ టూరిజమ్ యాడ్) ఉంటుందో తెలిసింది…

మీరు చెప్పితేనే పాండ్స్ సబ్బు వాడటం తెలిసింది… చివరికి మీరు చెప్పితేనే మళ్ళీ మోడీకి ఓటు వేసింది (అబ్‌కి బార్ మోడీ సర్కార్ )… మీరు చెప్పితేనే నెస్ కాఫీ ఎంత బాగుంటుందో తెలిసింది…చివరికి ఇప్పుడు నాకు కావాల్సింది, నాకు నచ్చేటట్టు చెప్పేవాళ్ళు… అల్విదా పాండే సాబ్…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇటు ఇండియా దెబ్బ..! అటు అఫ్ఘాన్ దెబ్బ..! పాకిస్థాన్‌ పెడబొబ్బ..!!
  • యాడ్ గురు… మన వాణిజ్య ప్రకటనల రంగంలో ఒక శకం సమాప్తం…
  • అదొక సెన్సేషనల్ వార్త… కానీ ధ్రువీకరణ ఎలా..? ఉత్కంఠ రేపే కథనం..!
  • అత్యాచార బాధితురాలు లేడీ డాక్టర్ అర చేతిలో సూసైడ్ నోట్..!!
  • Knowledge is not devine… జ్ఞానం ఎప్పుడూ అత్యంత ప్రమాదకరం…
  • హాస్యం అశ్లీలం చొక్కా వేసుకుని థియేటర్లకు వచ్చిన రోజులవి..!!
  • ఎక్కడుందీ లోపం…? ఎందుకిలా నిలువునా కాలిపోతున్నాం మనం..?!
  • హఠాత్తుగా ఈ ఏసీ బస్సులు ఎందుకిలా కాలిపోతున్నయ్…? ఏం చేయాలి..?!
  • దావత్ వితౌట్ దారు..! ఆల్కహాల్‌పై మోజు తగ్గుతున్న యువతరం..!!
  • BESS… The Game-Changer for Continuous Power…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions