సాధారణంగా సినిమా ప్రమోషన్ అంటే… ముందుగా ఒక పాటకు సంబంధించిన ప్రోమో… మళ్లీ మరో ప్రోమో… తరువాత లిరికల్ వీడియో… ఆ తరువాత మరో పాట… పాటలు హిట్టయితే సినిమాకు హైప్… సో, పాటలు బాగుంటే సినిమాకు బాగా ప్లస్… పుష్ప ఘనవిజయంలో పాటలదే ప్రధాన పాత్ర ఈమధ్య కాలంలో… అయితే ఒక సినిమాకు సంబంధించి భలే ఆశ్చర్యమేసే ఒకటీరెండు విశేషాలున్నయ్…
మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ తెలుగులో ఓ సినిమాలో నటిస్తున్నాడు… పేరు సీతారామం… యుద్ధంతో రాసిన ప్రేమకథ… దుల్కర్ పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే పరిచయం… నటనలో నాన్నకు వారసుడే… ఈ సినిమాకు దర్శకుడు హను రాఘవపూడి… దీన్ని అశ్వినీదత్ బిడ్డ స్వప్న నిర్మిస్తోంది… ఇది సినిమా నేపథ్యం… నిజానికి చెప్పదలుచుకున్న విషయం ఇది కాదు…
Ads
అసలు షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచే ప్రచారం స్టార్ట్ చేస్తుంటారు ఏ సినిమాకైనా… కానీ నెట్‌లో ఎంత వెతికినా మీకు ఈ సినిమాకు సంబంధించిన వివరాలు కనిపించవు… హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కు సంబంధించిన ఒకటీరెండు వార్తల్లో ఈ సినిమా ప్రస్తావన కూడా ఉంటుంది తప్ప పెద్దగా ఇతరత్రా విశేషాలు ఏమీ లభ్యం కావు… సినిమాలో రష్మిక, సుమంత్ పాత్రలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది… నిజానికి మనం చెప్పదలుచుకున్నది ఇది కూడా కాదు…
యూట్యూబ్‌లో ఈ సినిమా పాట ఒకటి నాలుగు రోజుల క్రితం అప్‌లోడ్ చేశారు… లిరికల్ వీడియో… మంచి మెలోడీ… విచిత్రంగా అనంత శ్రీరాం మంచి పదాలతో పాటను పేర్చాడు… పాడింది ఎస్పీ చరణ్, రమ్య బెహరా… ప్లజెంటుగా ప్రజెంట్ చేశారు ఇద్దరూ… ఢమ ఢమవాయించకుండా మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ భలే వాడుకున్నాడు సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్…
గతంలో అందాల రాక్షసి, లై, పడిపడిలేచె మనసు, కృష్ణ గాడి వీరప్రేమగాథ సినిమాలు మాత్రమే ఈ దర్శకుడి ఖాతాలో ఉన్నయ్… పడిపడి లేచె మనసు చూడబుల్ సినిమాయే… అసలు ఆశ్చర్యం ఏమిటంటే… స్వప్నదత్ సినిమాకు కనీస ప్రమోషన్ కూడా ఎందుకు ఆలోచించడం లేదు అనేదే… ట్రెండ్‌కు భిన్నంగా… ఏళ్లకేళ్లుగా సినిమాలే లోకంగా బతికే కుటుంబం స్వప్నది… మరెందుకీ సినిమా వివరాలపై మౌనం..?! పోనీ, ఆ గాయకులు, దర్శకుల సోషల్ ఖాతాల్లోనూ సినిమాకు సంబంధించి అంతా బ్లాంక్‌నెస్సే… హేమిటో మరి…!!
(ఒక్కటిమాత్రం నవ్వొచ్చింది… ఒకే పాటలో హీరో ఓసారి పోలీస్ డ్రెస్సులో, మరోసారి ఆర్మీ డ్రెస్సులో కనిపిస్తాడు… దర్శకులకు తెలియాల్సింది ఏమిటంటే… నేటితరం ప్రేక్షకులు ప్రతిదీ నిశితంగా పరిశీలిస్తున్నారని…!)
Share this Article