రాజకీయాలు అంటే ఏమిటి..? విలువలు కాదు, లెక్కలు… అధికారం కోసం మనిషి కానీ, పార్టీ కానీ వేసుకునే లెక్కలు… ‘‘అది రమ్మంటే రాదురా సెలియా, దాని పేరే సారంగదరియా’’ అన్నట్టుగా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నా సరే, తిరుపతిలో జనసేన మద్దతు కోసం ఇంతటి జాతీయ పార్టీ అర్రులు చాస్తున్నదంటే దానికి ఆ లెక్కలే కారణం… ప్రేమలు, అభిమానాలు, సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, నిబద్ధతలు, మన్నూమశానం, తొక్కాతోలూ ఏమీ ఉండవ్… బాబ్బాబూ అంటూ ఒక్క ఏడెనిమిదేళ్లయినా ఒక్క సీటుకూ కొరగాని ఓ నాయకుడి కాళ్ల దగ్గర పారాడుతున్నదీ అంటే… అదుగో, ఆ లెక్కలే కారణం… అసలు తిరుపతి ఎన్నికే కాదు, వర్తమాన రాజకీయాల్లో సంగతులు ఓసారి చూద్దాం… చూడాలి… జనానికి నిజాలు అర్థం కావాలి… నిష్ఠురంగా ఉన్నా సరే, తెలుసుకోవాలి…
- చాలారోజులుగా సాగర్ నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నా సరే, బీజేపీ నివేదిత రెడ్డిని కాదని, ఓ బంజారా లీడర్ రవినాయక్‌ను ఎందుకు ఎంపిక చేసుకుంది..? ఒక లెక్క… పైన చూశారుగా టేబుల్, అదీ వోట్ల లెక్క… కులం గిలం జాన్తానై అనడానికి ఏమీ లేదు… ఎక్కడ ఏది ముఖ్యమో దాన్ని పట్టుకుని వేలాడటమే లెక్క…
- జానారెడ్డికి రెడ్లు ఉన్నారు… టీఆర్ఎస్కు యాదవులున్నారు… మరి మనకు..? అంతేసంఖ్యలో ఉన్న లంబాడాలు కావాలి… అదీ లెక్క… మరి మనం బంజారాలకు వ్యతిరేకంగా ఆదివాసీలకు సపోర్ట్ చేస్తున్నాం కదా… నో ప్రాబ్లం… అది దువ్వడానికే రవినాయక్ కావాలి… సాగర్ నియోజకవర్గం అంటే రెడ్డి సీటు అనే నివేదిక మార్క్ భావనల్నుంచి బయటకు వచ్చేసి, బహుజన సమీకరణాల వైపు ప్రయాణించడం… అదీ లెక్క…
- వోట్ల సంఖ్యను బట్టి బీసీల వోట్లు రావాలంటే చిన్నపురెడ్డి ఎట్సెట్రా లీడర్లు కాదని కేసీయార్ తేల్చుకోవడం ఇంకో లెక్క… సో, సాగర్ ఉపఎన్నిక నేడు కులాల పంచాయితీ… సంక్షేమ పథకాలు, సాధనసంపత్తి ఎట్సెట్రా తరువాతి విషయం…
- అవునూ, ఆయా కులాల వాళ్లు తమ కులం అభ్యర్థికి పార్టీలకు అతీతంగా వోట్లేస్తారా..? ఇది చాలా సంక్లిష్టమైన ప్రశ్న… అది పోల్ మేనేజ్మెంట్ను బట్టి ప్రధానంగా ఆధారపడి ఉంటుంది… మరి నివేదితరెడ్డి గ్రూపు బంజారా రవినాయక్‌కు మద్దతునిస్తుందా..? చాలా సంక్లిష్టమైన ప్రశ్న…
- సేమ్… ఆశలు పెట్టుకున్న చిన్నపురెడ్డికి నిరాశ కదా, జానారెడ్డి వదిలేయొచ్చు కదా వంటి ప్రశ్నలకు చాన్స్ లేదు ఇక్కడ… లెక్కలు ముఖ్యం…
- ఇక తిరుపతి ఎంపీ సీటుకొద్దాం… గురుమూర్తి స్వామివారికి పాదయాత్రలో పాద సేవలు చేశాడు కాబట్టి… (అంటే ఫిజియో థెరపిస్టుగా…) ఆ దేవుడు కరుణించి ఓ ఎంపీ పదవిని ప్రసాదించాడు, ప్రపంచంలో జగన్ లెక్కలు ఎవరికీ అర్థం కావు, అర్థమైతే తను జగనే కాడు…
- ఇన్నేళ్లయింది, ఇంకా చింతా మోహన్‌కు కాంగ్రెస్ టికెట్టు దేనికి..? కొత్తవాళ్లకు అవకాశం ఇస్తే పార్టీ కేడర్‌కు కొత్త జోష్ కదా అనేది మరో లెక్క… సారీ, ఎన్నేళ్లయినా మార్పు ఆలోచించకపోవడం అనేది కాంగ్రెస్ దరిద్రం… అది అంతే… ఎలాగూ ఫలితప్రాధాన్యం లేని పోటీ కదా, ప్రయోగం చేయొచ్చు కదా అంటే ఆ పార్టీ వినదు, వింటే దాన్ని కాంగ్రెస్ అనరు, అనిపించుకోదు…
- టీడీపీకి వేరే దిక్కులేదు.., బీజేపీ కూడా మాదిగ కోణం ఆలోచించింది తప్ప, ఎంతోకాలంగా పనిచేస్తున్నవాళ్లకు చాన్స్ అనే కోణం దానికి పట్టలేదు… పైగా పవన్ కల్యాణ్ థూఫో అంటున్నా సరే, ఆయన కాళ్ల దగ్గర పారాడుతూ బలిజ, కాపు వోట్ల కోసం కక్కుర్తి… అదీ దాని దుర్గతి…
- ఏతావాతా అర్థమయ్యేది ఏమిటి..? రాజకీయాలంటే విలువలు కావు… జస్ట్, లెక్కలు మాత్రమే… ఎస్, లెక్కలు మాత్రమే….
Share this Article
Ads