ఫేస్‌బుక్‌లో మిత్రులు Juluri Sriramulu… పోస్ట్ కొంత ఆలోచనాత్మకంగా ఉంది… నిజానికి ఇంకా వివరంగా రాస్తూపోతే ఓ నవల అవుతుంది… మన పెళ్లి కలుషితమైంది… అందులో అబద్ధం లేదు… పెడపోకడల్లో వెళ్తున్నాం… అది నిజం… అదే నిజం… ఒకడిని చూసి మరొకడు మరిన్ని వాతలు పెట్టుకోవడమే తప్ప ఒక్కడూ సంస్కరణ, ప్రక్షాళన గురించి ఆలోచించడం లేదు… అలా ఆలోచించనివ్వదు బంధుగణం, స్నేహగణం, అనగా సమాజం… అంతెందుకు..? ఇంట్లో ఆడవాళ్లే అంగీకరించరు… సంస్కరణకు అతి పెద్ద ఆటంకవాదులు వాళ్లే…
అన్నీ అంగీకరించగలమో లేదో గానీ ఇలాంటి పోస్టులు సొసైటీకి అవసరం… ఆలోచన రగలాలి… మథనం జరగాలి… అట్టహాసపు ఖర్చు చేసేవాళ్లను చూసి వెక్కిరించాలి జనం… నిరాడంబరంగా పెళ్లి జరిపేవారిని అభినందించాలి… అది అందరికీ ప్రయోజనం… ఈ పోస్టుకు పెట్టిన ఓ కల్యాణవేదిక బాగుంది… కానీ ఇంటి పైకప్పు మీద ఎందుకు వేశారో తెలియదు… కానీ ఎంత పెద్ద హాలైనా సరే, ఇతరత్రా ఎంత ఆడంబరపు డెకొరేషన్ చేయించుకున్నా సరే, ఖచ్చితంగా ఈ సంప్రదాయపు పందిరి కిందే పెళ్లి జరగాలని రూల్ పెట్టుకుంటే, అమలు చేసుకుంటే ఎంత బాగుంటుందో అన్నట్టుగా ఉంది…
రకరకాల స్వీట్లు ఎన్ని పెట్టినా సరే, సంప్రదాయికంగా ఒక లడ్డూ కంపల్సరీ అని రూల్ పెట్టుకుంటే ఎంత బాగుండు… ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లే పెళ్లిపంతుళ్లు గాకుండా ఉంటే ఎంత బాగుండు..? సుదీర్ఘమైన పెళ్లి తంతులోని అనవసర భాగాల్ని కట్ చేస్తే ఎంత బాగుండు..? నిజంగానే మనవి కాని సంగీత్‌లు, హల్దీలు, మెహిందీలు, బ్యాచిలర్ పార్టీలను నిషేధిస్తే ఎంత బాగుండు..? సిరిసిల్ల ఏరియాలో ముస్లిం కమ్యూనిటీ కేవలం ఒకటే మటన్ కర్రీ అనే నిబంధన పెట్టుకుందట… మొత్తం హిందూ సమాజం కూడా ఇలాంటి పరిమిత భోజనాలు అనే నిబంధనకు వస్తే ఎంత బాగుండు..? ఏమో… చూడబోతే మరిన్ని తంతులు యాడ్ అవుతాయేమో… పెళ్లికూతురి తండ్రి మరింతగా కూరుకుపోతాడేమో… ఇక్కడ డబ్బు అనేది ఓ ప్రధాన సమస్య అయితే, ఇవన్నీ చేసే వాళ్లు ఎవరున్నారు ఇప్పుడు కుటుంబాల్లో..?
Ads
మిత్రుడు జూలూరి శ్రీరాములు పోస్ట్ గురించి కదా చెప్పుకుంటున్నది… అదొక్కసారి చదవండి… అన్నీ ఏకీభవించాలని లేదు… కానీ ఎన్ని నిజమో ఒక్కసారి ఆలోచించండి…
ఇప్పుడు జరుగుతున్న పెళ్ళిలలో వింత పోకడలు…
1. *కేవలం ముఖ పరిచయం ఉన్న అందరిని వేల సంఖ్యలో పిలవడం* (పిలిచిన వారికి ఎవరు వచ్చారో కూడా గమనించే తీరిక ఉండదు. Attend అయిన వారికి 6 నెలల తరువాత అసలు సదరు పెళ్లికి వెళ్ళామని కూడా గుర్తుండదు)
2. *ప్రొద్దున పెళ్లి అయితే, స్నానం కూడా చెయ్యని ,చెమట కంపుతో, అపరిశుభ్రంగా ఉన్న వ్యక్తులు, అర్థరాత్రి వంట చేసి, దానికి విందు అని పేరు పెట్టి, ప్రొద్దున వడ్డించడం…….రాత్రి పెళ్లి అయితే సీన్ రివర్స్ అంతే* .
3. *ఎంగేజ్మెంట్ పేరుతో పెళ్ళి అంత ఆర్భాటం చేయడం*. (కాబోయే వధూవరులను, పెళ్లి కాకుండానే, ఒక చోట కూర్చోపెట్టి, ఆహ్వానితులకు అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించమనడం.)
4. *పెళ్లి కాకుండానే pre wed photo shoot అని సినిమా లెవెల్లో వింత, సామాజిక స్పృహ లేని భంగిమల్లో కాబోయే పెళ్లి కొడుకు,పెళ్లి కూతురు photos కి pose… ఇంకా ఆ photo s(కొన్ని intimate వి) కూడా…. పెళ్లి తంతులో భాగంగా పెద్ద TV screen పైన ప్రదర్శించడం.*
4.*పెళ్లి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన డెకరేషన్ 10 గంటల్లో, ఇంకో ఫంక్షన్ ఉంటే పీకి పారేయడం.*
5. *Photoస్ natural (candid) గా, తీయకుండా photographer కోసమే పెళ్లి చేసుకున్నట్టు, వాడు చెప్పిన వింత భంగిమల్లో pose ఇచ్చి ఫోటోల పరమార్ధం లేకుండా పోయింది*.(photographer bill కూడా లక్షల రూపాయలు)
6. *పెళ్లి బట్టలకు కూడా లక్షల రూపాయలు ఖర్చు చేసి, జీవితంలో మళ్ళీ ఇంకో function కి వాడకుండా, డబ్బు వృధాచేయడం*…
7. *భోజనాల పేరుతో, సమయంతో నిమిత్తం లేకుండా, అల్పాహారం, chat, 20 రకాల స్వీట్స్, 50 రకాల వంటకాలు, 10 రకాల fruits, 5 రకాల desserts (ఇవన్నీ జీవితంలో ఎన్నడూ తిననట్టు, ఆహుతులు, ఆబగా అన్ని తినే ప్రయత్నం చేయడం ఒక వింత*.(భోజనం ఖర్చు కూడా లక్షల రూపాయలు)
8. *పెళ్లి తంతు తరువాత కిలోమీటర్ క్యూలో నిలబడి, స్టేజి ఎక్కి, మొక్కుబడిగా అక్షింతలు, వధూవరుల నెత్తిన చల్లి, వాటిని బూట్లు తొడుకున్న కాళ్లతో తొక్కి, photos కి pose ఇవ్వడం* (ఆ photos జీవితంలో ఎవరికి చూసే తీరిక కూడా ఉండదు), *అనే ప్రక్రియ కూడా ఆక్షేపణీయం*.
9. *ఇక పెళ్లి జరిపించే పంతుళ్ళు కూడా రక రకాల packages తో, పెళ్లి వేడుకను ఒక వ్యాపార తంతుగా మార్చి , లక్షల రూపాయలు వసూలు చేయడం*.
10. *DJ MUSIC అనే పేరుతో, చెవులు, మెదడు భరించలేని అత్యంత భయంకరమైన శబ్దంతో, అర్థం పర్థం లేని సినిమా పాటలు*.
11. *కర్ణ కఠోరంగా పాడే orchestra బృందం* (వీళ్లు కూడా భయంకరమైన సౌండ్ లెవెల్స్ maintain చేస్తారు).
12.*ఇంకా mehendi అని , సంగీత్ అని, bachelor పార్టీ అని ,పనికిమాలిన events*.
13.*మద్యంతో కూడిన విందైతే, హాజరు 110%* (బంధు మిత్ర సపరివారంగా అనే ఆహ్వానాన్ని సీరియస్ గా పాటిస్తారు).
14. *ఒక పెగ్గు కెపాసిటీ వాడు 3 పెగ్గులు, 3 పెగ్గుల కెపాసిటీ వాడు 10 పెగ్గులు లాగిస్తారు*.
15. *ఇంకా హనీమూన్ అనే కార్యక్రమం కోసం ప్యాకేజీ టూర్స్*.(.ఇది కూడా లక్షల్లో).
16.*ఇక గిఫ్ట్స్ పేరుతో వచ్చే పనికిమాలిన వస్తువులను ఏమి చేసుకోవాలో అర్థం కాదు*.
17.*అందుకని పగ తీర్చుకొనేందుకు రిటర్న్ గిఫ్ట్ పేరుతో ప్లాస్టిక్ డబ్బాలు, పచ్చడి సీసాలు వగైరా ఇవ్వడం*.
**పైన చెప్పినవన్నీ మధ్యతరగతి వారు, తాహతుకి మించి, ఈ మధ్య విపరీతంగా పాటిస్తూ, అప్పుల పాలవుతున్నారు*. *ఈ అనాలోచిత విధానాలు ఒకరిని చూసి మరొకరు అనుసరిస్తూ, ఫంక్షన్ హాల్స్ వాళ్లని, caterers వాళ్లని, photographers ని, decoraters ని కోటీశ్వరుల్ని చేయడం మాత్రం ఖాయం.* *ఈ పోస్ట్ చదివి కొంతమందన్నా మారుతారని ఆశిద్దాం*.
Share this Article