అల వైకుంఠపురంలో సినిమా అనూహ్యంగా బంపర్ హిట్… థియేటర్లలోనే కాదు, టీవీల్లోనూ ఇప్పటికీ దానిదే రికార్డు రేటింగ్స్… 29.4… బహుశా ఇప్పట్లో దాన్ని బ్రేక్ చేసే సినిమా వస్తుందో రాదో డౌటే… దాంతో పోటిపడినా సరే సరిలేరు నీకెవ్వరు సినిమా 23.04 రేటింగ్స్ సాధించింది… వేల కోట్ల రికార్డుల్ని ఛేదించినా సరే, బాహుబలి-2 మూడో ప్లేసులో ఉంది తప్ప ఆ రెండు సినిమాలను రేటింగ్స్ కోణంలో దాటలేకపోయింది…
ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… ఆర్ఆర్ఆర్ సినిమా జస్ట్, 19.22 రేటింగ్స్ సాధించింది… దాని రేంజుకు నిజానికి అది చాలా పూర్ రేటింగే అని చెప్పాలి… ఆల్‌రెడీ థియేటర్లలో చూశారు కాబట్టి టీవీల్లో రేటింగ్స్ తక్కువ వచ్చాయి అనే సమర్థన వాదనకు నిలవదు… ఎందుకంటే… అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు, బాహుబలి-2 సినిమాలు థియేటర్లలో కూడా బాగానే ఆడాయి… సో, ఇద్దరు స్టార్ హీరోలు ప్లస్ ఓ స్టారాధిస్టార్ దర్శకుడు కలిసి, చరిత్రకు నానా వక్రబాష్యాలు చెబుతూ, తీసిన ఓ వంకర సినిమాను టీవీ ప్రేక్షకులు తిరస్కరించినట్టే లెక్క…
Ads
విచిత్రం ఏమిటంటే… అరవింద సమేత వీరరాఘవ సినిమాకు కూడా 20.69 రేటింగ్స్ వచ్చింది అప్పట్లో… టాప్ ఫైవ్‌లో శ్రీమంతుడు, దువ్వాడ జగన్నాథం సినిమాలు కూడా ఉన్నాయి… అంటే టాప్ ఫైవ్‌లో నాలుగు మహేశ్‌బాబు, బన్నీలవే… టాప్ 12లో ఉప్పెన ఉండటం కాస్త ఆశ్చర్యం అనిపించింది… ఇక ఆర్ఆర్ఆర్ సంగతికొద్దాం…
అబ్బే, ఇది థియేటర్లలో మాత్రమే చూడాల్సిన విజువల్ ఫీస్ట్ అని సమర్థిస్తారేమో కొందరు… అంత లేదు… అలాగైతే బాహుబలి-2 కూడా అంతేకదా… మరి దానికి రేటింగ్స్ బాగా వచ్చాయి కదా… ఎటొచ్చీ కారణం ఏమిటంటే..? టికెట్ రేట్ల పెంపుతో కలెక్షన్లను దండుకున్నారు నిర్మాతలు… పాన్ ఇండియా పేరిట పలు భాషల్లో డబ్ చేసి, దేశమంతా డబ్బు ప్రింట్ చేసుకున్నారు… అనేక లాజిక్ రాహిత్యాలు… వర్మ చెప్పినట్టు కొన్నిచోట్ల మరీ సర్కస్ చూసినట్టే…
సో, ప్రేక్షకుల్లో సినిమా పట్ల పెద్ద ఆసక్తి లేకుండా పోయింది… అదే టీవీ రేటింగ్స్‌లో రిఫ్లెక్టయింది… నో, నో, ఓటీటీలో చూస్తున్నారు కదా, అందుకని టీవీ రేటింగ్స్ తగ్గిపోయాయి అనే వాదన కూడా సమర్థనీయం కాదు… టీవీ ప్రేక్షకులు వేరు, ఓటీటీ ప్రేక్షకులు వేరు… అయితే ఒక్కటి మాత్రం నిజం… బిలో ట్వంటీ రేటింగ్స్‌తో నిరాశపరిచన ఈ సినిమాను బింబిసార, సీతారామం, కార్తికేయ-2 సినిమాల్లో ఏది టీవీ రేటింగ్స్‌లో అధిగమిస్తుందో చూడాలి…! సీతారామం సినిమాకు చాన్స్ ఉంది…! ఎందుకంటే, ఫ్యామిలీ ఆడియెన్స్‌లో దానిమీద బాగా ఆసక్తి కనిపిస్తోంది కాబట్టి…!!
Share this Article