మొన్న ఎవరో ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు… చంద్రబాబు డప్పులో కొత్త రికార్డులు సృష్టిస్తున్న సాంబశివ టీవీ (టీవీ5) రేటింగ్స్‌లో అట్టడుగు స్థానానికి పోయిందీ అనేది ఆ పోస్ట్… ఎహె, అదెలా సాధ్యం..? ఎన్నో ఏళ్లపాటు టాప్ త్రీలో ఉంటున్న చానెల్ కదా… మీటర్లున్న టీవీ కనెక్షన్ల ఇళ్లను పట్టుకునే ఉంటుంది… ఎప్పటిలాగే, ఇతర చానెళ్లలాగే మేనేజ్ చేయలేదా అనుకుంటే అది పొరపాటు అని తేలింది…
తాజా బార్క్ రేటింగ్స్ చూస్తే ఫాఫం టీవీ5 అనిపించింది… కాదు, టీవీ5 కాస్తా టీవీ6 అయిపోయింది అనిపించింది… అంటే మరీ ఆరో ప్లేసుకు ఘోరంగా పడిపోయింది… రోజూ అనేక పోస్టులు, వెటకారాలు, వెక్కిరింపులు, మీమ్స్ సదరు టీవీలో వచ్చే వ్యాఖ్యల మీద, డిబేట్ల మీద… ప్రత్యేకించి న్యూస్ ప్రజెంటర్ సాంబశివరావు మీద మరీనూ… (అఫ్ కోర్స్, దీనికి దీటుగా కనిపించే మహాన్యూస్ అసలు బార్క్ జాబితాలోనే కనిపించదు, అది వేరే కథ…)
Ads
చూశారు కదా… తాజా రేటింగ్స్ పరిస్థితి… టీవీ5 కాస్తా టీవీ6 అనగా… ఆరో ప్లేసులోకి పడిపోయింది వేగంగా… టాప్‌లో ఉండే టీవీ9, ఎన్టీవీలతో పోలిస్తే వాటి రేటింగుల్లో నాలుగో వంతు రేటింగ్స్ ఇప్పుడు టీవీ5 రేటింగ్స్… ఫాఫం… చంద్రబాబును మోసీ మోసీ, అదీ అడ్డగోలుగా, నవ్వు పుట్టించే వ్యాఖ్యలతో ఒనగూరిన ఫలితం ఇదీ… పోనీ, ఈ బాపతు అపాత్రికేయంతో చంద్రబాబుకు ఏమైనా ఫాయిదా ఉంటుందా..? నెవ్వర్… జనానికి వినోదం పుట్టించడం మినహా మరేమీ లేదు…
ఎస్, ఏబీఎన్ కూడా చంద్రబాబు డప్పే… కానీ కాస్తోకూస్తో పాత్రికేయ స్పృహ కనిపిస్తుంది… కనీసం ఇతర వార్తల్లో… అందుకే నిలదొక్కుకుంది… అందుకే అది వైసీపీ సొంత ఛానెల్ సాక్షి టీవీ, టీవీ5 చానెళ్లను దాటేసి నాలుగో ప్లేసులోకి వచ్చింది… చివరకు టీవీ5 దేనితో పోటీపడుతుందీ అంటే జనం పెద్దగా చూడని ఈటీవీ ఆంధ్రప్రదేశ్ చానెల్‌తో పోటీపడుతోంది… జాబితాలో టీవీ1, హెచ్‌ఎంటీవీ, సీవీఆర్ న్యూస్ కూడా జీరో రేటింగ్స్… (నాట్ అవైలబుల్)…
టీవీ1 సరే, దాన్నెప్పుడో టీవీ9 వదిలించేసుకుంది, దాని ప్రస్తావనే వృథా… సీవీఆర్ ఉండీ లేనట్టే… కాకపోతే హెచ్ఎంటీవీ స్థితి చూస్తేనే పాపం అనిపిస్తుంది… ఒకప్పుడు కాస్త నాణ్యంగా కనిపించిన ఆ ఛానెల్ ఇప్పుడు సోదిలో లేకుండా పోయింది… ఫాఫం వామనరావు… పైసలుండగానే సరిపోదు సారూ…
టీవీ5 గురించి చెప్పుకుంటున్నాం కదా… ఓవరాల్ రేటింగ్స్‌లో దారుణంగా పడిపోయింది కదా… హైదరాబాద్ కేటగిరీలోనూ ఆరో ప్లేసు… (ఈ కేటగిరీలో టీవీ9 టాప్…) ఏపీ తెలంగాణ (బిలో 75 లాక్స్) అర్బన్ కేటగిరీలో టీవీ5 ప్లేసు మరీ ఘోరంగా ఎనిమిదో ప్లేసు… రూరల్ కేటగిరీలో ఏడో ప్లేసు… చానెల్ ఇలాగే ఉంటే చివరకు ఐన్యూస్, రాజ్ న్యూస్, ఈటీవీ తెలంగాణ చానెళ్లతో పోటిపడే రోజులు వస్తాయేమో…
చివరగా… టీవీ9, ఎన్టీవీ గురించి… ఈ రెండు చానెళ్లనూ ఇప్పట్లో మరే చానెలూ కొట్టలేదు… ఫస్ట్ ప్లేసు గురించి ఆ రెండూ కొట్టుకుంటూనే ఉంటాయి… టీవీ9 మీద జనంలో ఎంత వ్యతిరేకత ఉన్నా, సంస్థాగత లోపాలు ఎన్ని ఉన్నా, అపాత్రికేయ దుర్వాసన ఎంత వస్తున్నా దాని ప్లేసు దానిదే… మొన్నటివారం స్వల్ప ఆధిక్యం ఎన్టీవీ మీద చూపించినా మళ్లీ జారిపోయింది… మళ్లీ కేకులు, మళ్లీ హోర్డింగులు, మళ్లీ రజినీకాంత్ భజనల ప్రమాదం తప్పిపోయింది…
Share this Article