అదేమిటో… విష్వక్సేన్ అనగానే… తన సినిమా కోసం ఓ ప్రాంక్ వీడియో చేయించి అడ్డగోలుగా బదనాం అయిపోయిన సంఘటన గుర్తొస్తుంది… అంతేకాదు, టీవీ9 దేవి తర్జని చూపిస్తూ గెటౌట్ ఫ్రం మై స్టూడియో అని హైపిచ్‌లో అరిచి, వెళ్లగొట్టిన ఉదంతం కూడా గుర్తొస్తుంది… దాని మీద బోలెడంత రచ్చ… ప్రజలకు వినోదం మాటేమిటో గానీ, సినిమాల చిల్లర ప్రమోషన్ల మీద మంచి చర్చ జరిగింది… ఐతే నిజంగా సదరు హీరోకు ఈ వివాదం వల్ల ఏమైనా మంచి జరిగిందా..?
మే నెలలో రిలీజ్ చేసినట్టున్నారు… పాజిటివ్ టాక్ వచ్చింది… ఆ నెలలో థియేటర్లన్నీ గంపగుత్తాగా కబ్జా చేసేలా వేరే పెద్ద సినిమాలు కూడా ఏమీలేవు… కానీ అర్ధంతరంగా థియేటర్ల నుంచి సినిమాను తీసేసినట్టు కొన్ని వార్తలు చదివినట్టు గుర్తు… ఏం జరిగిందో సదరు నిర్మాతే చెప్పాలి… ధైర్యముంటే…! ఆహా ఓటీటీకి అమ్మేశారు… వాళ్లు కూడా జూన్‌లో స్ట్రీమింగ్ పెట్టేశారు… తరువాత చాన్నాళ్లకు… అంటే ఆగస్టు ఏడున జెమిని టీవీలో ప్రసారం చేశారు… అంటే, ఓటీటీకి ఎక్కువ టైమ్ ఇచ్చినట్టే లెక్క… సినిమా పేరు చెప్పనేలేదు కదూ… అశోకవనంలో అర్జున కల్యాణం…
Ads
సరే, జెమిని వాళ్లకు అమ్మారు… వాళ్లు ప్రసారం చేశారు… కానీ ఎంత ఘోరం అంటే… మరీ 2.95 రేటింగ్ వచ్చింది… (హైదరాబాద్ బార్క్ కేటగిరీ)… అత్యంత దయనీయమైన టీవీఆర్… అదే టీవీలో లారెన్స్ సినిమా గంగ మళ్లీ ప్రసారం చేస్తే 2.38 వచ్చింది… ఫాఫం… అసలు జెమినిటీవీకి టీవీ రైట్స్ అమ్మడమే ఓ తప్పు… దాని రీచ్ తక్కువ… చూసేవాళ్లు తక్కువ… అందుకే, ఇదుగో, ఇలా దారుణమైన రేటింగ్స్… ఈటీవీ వాడు ఎలాగూ సరైన రేటు పెట్టడు… కొత్త సినిమాల కొనుగోలు దందా జోలికి వెళ్లడు… జీవాడో, మాటీవీ వాడో కొని ఉంటే కాస్త ఇజ్జత్ దక్కేదేమో…
నిజానికి సినిమా టీవీలో చూడబులే… అశ్లీలం లేదు, అసభ్యత ఏమీలేదు… కాస్త వినోదాత్మకంగానే నిర్మించారు సినిమాను… మరీ థియేటర్ల దాకా వెళ్లి చూసేంత సీన్ లేకపోయినా సరే… ఓటీటీలో లేదా టీవీలో చూడటానికి ఏమాత్రం ఇబ్బంది లేని సినిమా… ఓటీటీలో ఎన్ని వ్యూస్, ఎన్ని నిమిషాల వాచింగ్ వచ్చిందో తెలియదు గానీ… టీవీలో మాత్రం సినిమా అట్టర్ ఫ్లాప్ కావడం నమ్మశక్యం గాకుండానే ఉంది… కానీ బార్క్ వాడు ఈ దయనీయమైన రేటింగ్స్ నిజమే అంటున్నాడు… మరేటి సేత్తం..?! ప్చ్, ప్రాంక్ వీడియోలు వర్కవుట్ కాలేదు, టీవీ9 రచ్చ ఉపయోగపడలేదు..! దేవి కళ్లు చల్లబడ్డట్టున్నాయి…!!
Share this Article