నువ్వు రాధేశ్యాం సినిమాలో పామిస్టు (హస్తసాముద్రికుడు)వి కదా… ఏదీ నా చెయ్యి చూసి వచ్చే పదేళ్లు నా భవిష్యత్తు ఏమిటో చెప్పు అని అడుగుతాడు బాలకృష్ణ ప్రభాస్‌ను తాజా అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో… తన చెయ్యి చూసి, మీకేంటి సార్, పదేళ్లూ మీరు అన్‌స్టాపబుల్ అంటాడు ప్రభాస్… అదే రాసి ఉంది అంటాడు… తన అరచెయ్యిని ప్రేక్షకులకు చూపిస్తాడు బాలకృష్ణ… దానిపై నిజంగానే మార్కర్ పెన్‌తో అన్‌స్టాపబుల్ అని ఇంగ్లిషులో రాసి ఉంటుంది……….. ఇదీ ప్రభాస్ ఎపిసోడ్ మీద జరిగిన మరీ నాసిరకం క్రియేటివ్ వర్క్…
నో డౌట్… అన్‌స్టాపబుల్ సక్సెస్‌ఫుల్ చాట్ షో, లేదా టాక్ షో… ప్రిరిలీజ్ ఫంక్షన్ జరగకపోవడం ఒక్కటే లోటు తప్ప ఒక సినిమాకు చేసినంతగా ప్రచారం చేశారు… హైప్ క్రియేట్ చేశారు… సిగ్గరి, మొహమాటస్తుడు, తక్కువ మాట్లాడే అలవాటున్న ప్రభాస్ సాధారణంగా ఇలాంటి టీవీ షోలు, ఇంటర్వ్యూలకు పెద్దగా వెళ్లడు… దాంతో సహజంగానే ఈ ఎపిసోడ్ మీద జనంలో కూడా ఆసక్తి పెరిగింది… పైగా ప్రభాస్‌కు క్రేజ్ కూడా ఉంది… కానీ ఆ హైప్‌కు తగినట్టు కంటెంట్ లేదు… తుస్సుమనిపించారు రాధేశ్యాం సినిమాలాగే..!
దీని స్ట్రీమింగ్ స్టార్ట్ కాగానే ఆహా యాప్ క్రాష్ అయ్యింది… కాదా మరి..? ఒక ఎపిసోడ్ మీద ఇంత హైప్ క్రియేట్ చేస్తున్నప్పుడు, జనం స్పందనను అంచనా వేసి, దానికి తగినట్టుగా టెక్నికల్‌గా అప్‌గ్రేడ్ కావాలి కాదా… సర్వర్లు లోడ్‌ను తట్టుకునేట్టుగా ఉండాలిగా… ఆహా మేనేజ్‌మెంట్ అదేమీ పట్టించుకోలేదు… ఒక్కసారిగా కుప్పకూలిపోయింది… సరే, ఏ అర్ధరాత్రికో రీస్టోరీ చేశారు, అదంతా వేరే కథ… ఇంత హైప్ బిల్డప్ చేసినప్పుడు ఆ రేంజ్‌కు తగినట్టు కంటెంట్ ఉండాలిగా… అది లేదు…
Ads
ఓ ఐదు ప్రశ్నలు… కాస్త దూరంగా ప్రభాస్… తను ఏదో నంబర్ చెబితే బాలయ్య ఆ ప్రశ్న ఉన్న కాగితం తీసి, అందులోని ప్రశ్న అడుగుతాడు… ఇదీ ఓ బిట్ ఆ ఎపిసోడ్‌లో… విచిత్రం ఏమిటంటే… ఆ కాగితం మీద ఏమీ రాసి ఉండదు… బాలయ్యకే కనిపిస్తుందట… సరే, ఫర్ ఫన్, వోకే… కానీ అయిదు ప్రశ్నలూ అడిగేసినప్పుడు మరిక ప్రభాస్ చాయిస్ ఏముందని ఆ నంబర్లు ఎంచుకోవడం..? పైగా జవాబు ఇవ్వవద్దని అనిపిస్తే, స్కిప్ చేయవచ్చు అంటూ ఓ బెల్ రిమోట్ ఇచ్చాడు బాలయ్య… అది నొక్కినా సరే పట్టించుకోలేదు, అదేమంటే అది నా ఇష్టం అంటాడు…… ఈ ఎపిసోడ్ నాసిరకం క్రియేటివ్ వర్క్‌కు మరో ఉదాహరణ ఇది…
ఇప్పటివరకు ప్రసారమైంది ఫస్ట్ పార్ట్ మాత్రమే… ఇదంతా ప్రభాస్‌దే… కానీ గోపీచంద్ వచ్చి చేరాడు కదా, రెండో పార్ట్ ఉంటుందన్నమాట… అసలు బ్యానర్లతోసహా చాట్‌షోకు ఫ్యాన్స్‌ను తీసుకురావడం ఏమిటో, మధ్యమధ్య వాళ్ల నినాదాలు ఏమిటో బాలయ్యకే తెలియాలి… ఇదేమైనా ప్రిరిలీజ్ ఫంక్షనా..? సరే, వస్తే వచ్చారు, కనీసం కంటెంట్ మీద కాన్సంట్రేట్ చేయాలి కదా, ఆ కీలకమైన వర్క్ సరిగ్గా జరగలేదు… కాకపోతే బాలయ్య సరదాగా ఎపిసోడ్ టాకిల్ చేసిన తీరు, ప్రభాస్ అణకువ కాస్త ఎపిసోడ్‌ను లైవ్‌లీగా చేశాయి…
20 ఏళ్ల ప్రభాస్ ప్రస్థానం పేరుతో రూపొందించిన AV కూడా నాణ్యతతో లేదు… కొందరు ఫ్యాన్స్‌తో ఏవో నాలుగు మాటలు చెప్పించి తూతూమంత్రంలాగా చేశారు… కానీ నిజంగానే తన సినిమాలకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు, సీన్లతో క్రొనలాజికల్ ఆర్డర్‌లో గనుక చూపించి ఉంటే అదిరిపోయేది… అన్నింటికీ మించి ఈమధ్య బాలయ్య షోలలో మరీ ప్రియురాళ్లు, సంబంధాల గొడవ ఎక్కువైపోయింది… ఈ ఎపిసోడ్‌లో ఎక్కువ టైం ప్రభాస్ పెళ్లి, తన తాజా ప్రియురాలి పేరు చెప్పించడానికి బాలయ్య పడ్డ అవస్థలే కనిపించాయి…
కృతిసనన్ తనే స్వయంగా ప్రభాస్‌తో పెళ్లి పుకార్లను ఖండించింది కదా… ప్రభాస్ అదే చెబుతున్నాడు ఈ ఎపిసోడ్‌లో… ‘మేడం చెప్పారు కదా’ అంటూ… ఐనా బాలయ్య వదిలిపెట్టలేదు… సీత సీత అంటూ మొదలుపెట్టి దాన్నే పట్టుకుని గోకసాగాడు చాలాసేపు… (ఆదిపురుష్‌లో కృతి సీత పాత్ర పోషించింది కదా…) ఒక అంశంపై మరీ అంతగా ఇన్‌సిస్ట్ చేయడం వల్ల అన్‌స్టాపబుల్ వంటి సరదా షో తన ఒరిజినల్ ఫ్లేవర్ కోల్పోతుంది… ఎపిసోడ్ బాగా లేదని కాదు, కానీ ఆహా క్రియేటివ్ టీం గనుక ఇంకాస్త సిన్సియర్‌గా వర్క్ చేసి ఉంటే, ప్రభాస్‌కు సరిపడా కంటెంట్ వచ్చి ఉండేది…!
Share this Article