ప్రశాంత్ కిషోర్‌కు తత్వం బోధపడింది… తను కూడా వేణుస్వామి బాటలోకి వచ్చేసి, ఇకపై జోస్యాలు చెప్పను అంటున్నాడు… అంతేకాదు, లెంపలేసుకుని, సిన్సియర్‌గా క్షమాపణలు చెబుతున్నాను అన్నాడు… అసలేం జరిగింది..?
బీజేపీని ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు… బలంగా పాతుకుపోయింది… ఈసారి ఎన్నికల్లో 300 సీట్లకు కాస్త అటూఇటూ వస్తాయి చూస్తుండండి… ప్రతిపక్షాలు ఏవేవో ఊహించుకుంటున్నాయి గానీ మళ్లీ బీజేపీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, 20, 30 ఏళ్ల పాటు బీజేపీని నిలువరించడం కష్టమే… కాంగ్రెస్ రివైవల్ అనేది ఇప్పట్లో అసాధ్యం….. ఇలా చెబుతూ పోయాడు ఈమధ్య ఇండియాటుడే డిబేట్‌లో…
తనకు ఎన్నికల వ్యూహకర్తగా అపరిమితమైన ఫాలోయింగ్ ఉంది దేశంలో… నిజంగానే సక్సెస్ స్టోరీలున్నాయి తన ఖాతాలో… తను ఎవరి వైపు నిలబడితే వాళ్లకు గెలుపు తథ్యం అనే పాపులారిటీ వచ్చింది… కొన్ని వందల కోట్ల దందా తనది… సరే, ఐప్యాక్ మూసేసి, కొన్నాళ్లు బీహార్‌లో రాజకీయవేత్తగా ఎదగాలని పాదయాత్ర చేశాడు, క్లిక్ కాలేదు… అందరికీ ఫలించిన వ్యూహచిట్కాలు తనకు ఫలించలేదు, ఈయన్ని తన రాజకీయ వారసుడిగా చెప్పిన నితిశ్ కూడా వదిలేశాడు…
Ads
జగన్ ఓడిపోతాడని కూడా చెప్పాడు కదా, అదే జరిగింది… కానీ బీజేపీ విషయంలో తను చెప్పిన అంకె బోల్తాకొట్టింది… ఎక్కడి 300, ఎక్కడి 240… ఎన్డీయే టోటల్ సంఖ్య కూడా 300 చేరలేదు… ‘‘అవును, నేను అంకె చెప్పకుండా ఉండాల్సింది… 20 శాతం వరకూ తేడా కొట్టింది… నిజానికి గతంలో ఓసారి బెంగాల్ రిజల్ట్ గురించి, ఇప్పుడు బీజేపీ గురించి తప్ప నేనెప్పుడూ అంకెల్లో ఇరుక్కోను, ఏదో అలా జరిగిపోయింది, అందుకే క్షమాపణలు, ఇకపై నేను ఫలానా పార్టీ, ఫలానా సంఖ్యలో సీట్లు గెలుస్తుందనే జోస్యం అస్సలు చెప్పబోను’’ అని చెప్పుకొచ్చాడు ఇండియాటుడే ఇంటర్వ్యూలో…
‘‘నిజానికి నేను చెప్పింది ట్రూస్పిరిట్‌లో నిజమే అయ్యింది, ఆ అంకెలు తప్ప… కాంగ్రెస్ రివైవల్ అసాధ్యం అని చెప్పాను, ప్రతిపక్షం అనుకున్నట్టు జరగదు, ఆ పార్టీలకు సానకూల పవనాలు లేవు అని చెప్పాను, బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేస్తుందనీ చెప్పాను, అన్నీ జరుగుతున్నాయి, జరిగాయి కదా… ఐనాసరే, ఒక అంకెను నేను ఓ వ్యూహకర్తగా చెప్పకుండా ఉండాల్సింది, వ్యూహాత్మకంగా అది తప్పే… నిజమే, మోడీ మీద కొంతమేరకు కోపం ఉంది గానీ మరీ ఓడించేంత వ్యతిరేకత లేదు అని చెప్పాను, అదే కదా రిజల్ట్ కూడా చెప్పింది… ఒక్క 300 అనే అంకె తీసేసి నా వ్యాఖ్యల్ని పరిశీలించండి, అన్నీ నిజాలే అయ్యాయని మీరే అంగీకరిస్తారు’’ అని చెప్పుకొచ్చాడు ఆయన…
Share this Article