.
ప్రవస్తి పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది… అఫ్‌కోర్స్, లిటిగెంటు అని ముద్రేసి మరెవ్వరూ ఆమెను దగ్గరకు రానివ్వరు… నిజంగానే అపరిపక్వ విమర్శలు ఆమెవి… ఐతేనేం… మ్యూజిక్ రియాలిటీ షోల అసలు రంగును బయటపెట్టింది కదా… అదీ సూపర్…
ఇండస్ట్రీలో ఉండాలా వద్దా… ఉంచుతారా, తరిమేస్తారా అనేది వేరే కథ… ఎవడైతేనేం, ఎంత ఆస్కారుడైతేనేం అన్నట్టుగా ఆ ఇద్దరు ఆస్కారుల బట్టలిప్పింది కదా… మొత్తం తెలుగు సమాజం అభినందిస్తోంది ఆమెను…
Ads
ఓ పిల్ల చేసిన విమర్శల్ని పరిగణలోకి తీసుకుని, స్థూలంగా తెలుగు సమాజం ఆ ఇద్దరినీ తూలనాడుతుందీ అంటే… ఆల్రెడీ కీరవాణి, చంద్రబోస్‌ల మీద ఎంత వ్యతిరేకత తెలుగు సమాజంలో నెలకొని ఉందో అర్థం చేసుకోవచ్చు… సీన్ కట్ చేస్తే…
Kvs Prasad వాల్ మీద కనిపించిన ఓ పోస్టు ఆసక్తికరంగా అనిపించింది… రియాలిటీ షోలు ఎంత స్క్రిప్టెడో చెబుతోంది… ఇలా…
మా పెద్దక్కయ్య మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి సెలెక్ట్ అయి వెళ్ళినప్పుడు.. నేను తోడు వెళ్ళాల్సొచ్చింది.
అప్పుడు చూశాను.
పార్టిసిపెంట్స్ మాత్రమే కాదు. ఆడియన్స్ గ్యాలరీలో కూర్చున్న నాకు కూడా ముందే కాస్ట్యూమ్స్ సెలక్ట్ చేస్తారు.
నేను తీసుకెళ్ళిన డ్రస్‌లు బాలేవని… క్రొత్తవి డార్క్ కలర్స్ కొనిపించారు. అందులో కూడా వాళ్ళు సెలెక్ట్ చేసిందే ధరించాలి.
ఆడియన్స్ లో కూర్చున్న నాకే ఇలా ఉంటే ఇక పార్టిసిపెంట్స్ సంగతి చెప్పక్కరలేదు కదా…
ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్‌లో అక్కయ్యను అనౌన్స్ చేశాక కూడా… మళ్ళీ ఆమె డయాస్ మీదకు వెళ్తుండగా…
మరొకరి పేరు అనౌన్స్ చేశారు.
ఇదేంటని అడిగితే…
వాదనకు తావు లేదు. మా టైమర్ మళ్ళీ ఇంకొకరిని సెలెక్ట్ చేసింది.
మీరు జస్ట్ మిస్ అయ్యారుఅన్నారు…
@@@@
ఇక పాడుతా తీయగా…
మా బంధువులమ్మాయి అనుభవం ఇలాంటిదే. మొదటి రౌండ్ లో అద్భుతమైన అప్లాజ్ వచ్చింది తనకు.
2 వ రౌండ్ కొచ్చేప్పటికి….ఈ జడ్జెస్ కి వత్తిడి ఉంటుందో… లేక వాళ్ళకే ముందే డైరెక్షన్స్ వస్తాయో గానీ…
#ఫాల్సెటో అనే పదం ఉపయోగిస్తారు. బాగా పాడావు గానీ… తల్లీ… ఫాల్స్ వాయిస్ తో పాడావు…
ఆ చరణం మళ్ళీ పాడు….. అని అడిగి….
పాడాక… తప్పు చెప్తారు.
పాడే అమ్మాయిలకు…. అబ్బాయిలకు…. కూడా ఆత్మ విశ్వాసం పోయేట్లు…
నీ వాయిస్ బాగాలేదు అనరు. బాగా పాడలేదు అనరు. ఇలాంటి ఫాల్సెటో లాంటి పదాలు… వాడుతారు.
చిన్న పిల్లలు… ఎందుకలా బాధ పెట్టాలి!?
ఇక్కడ ఏంటంటే… ఆ జడ్జెస్ గానీ… ఎస్.పి. బాలు గానీ…
అంత ఈజీగా ఏమీ ఈ స్టేజి కి రాలేదు కదా…
ఎన్నో కష్టాలు… అవమానాలు పడే ఇప్పుడు ఈ స్టేజి కొచ్చారు…
మరి ఈ పిల్లలు మటుకు ఈ రోజు ఇంత ఈజీగా పేరు తెచ్చుకుంటే ఎట్లా!?
అనే దుగ్ధ ఒకటి ఏడుస్తుంది…
అంటే అక్కడ పాడే పార్టిసిపెంట్స్ అందరూ… అద్భుత గాయనీ గాయకులని కాదు.
ఆసక్తితో వచ్చారు. అంతే.
సృష్టిలో ఏ ఒక్క స్వరం ఒక్కలా ఉండదు కదా.
@@@@
ప్రవస్తి… చెప్పిన మాటల్లో ఒకటి నిజం.
సునీత… కీరవాణి & చంద్రబోస్‌లతో ….
ఈ ప్రవస్తి వాయిస్‌లో బేస్ లేదు. హై పిచ్‌కి పోయినప్పుడు మేనేజ్ చేస్తుంది కానీ… అబ్బే…
మీరే చూడండి… అనడం.
ఖచ్చితంగా జరిగే ఉంటుంది.
మరి సునీత వాయిస్ ఏమైనా అద్భుతమా! హై పిచ్ కెళ్ళి పాడగలుగుతుందా!
గుస గుసల సుందరి అంటారు కదా… (గాలి సంగీతం)…
పాటలో నటనను చూపుద్ది సునీత.
ఇప్పుడు శ్రేయా ఘోషల్‌తో ఈమెను కంపేర్ చెయ్యగలమా!?
ఒక సుశీలమ్మ…
ఓ జానకమ్మ…
ఓ వాణీ జయరాం..
ఓ లతాజీ…
ఓ చిత్ర…
వీరితో కంపేర్ చేస్తే…. సునీత వారి దరిదాపులలోకి కూడా రాదు. రాలేదు…
సిడ్ శ్రీరాం.. ఇతనంటే ఇప్పుడు మహా క్రేజ్ యూత్ కి. నాకు మాత్రం అరుస్తున్నట్లుంటుంది.
పాడినట్లుండదు.
ఇక అంతా రామమయం పాట నిన్న చూశాను… ప్రవస్తి పాడినది… లింక్…
ఆ తరువాత జడ్జెస్ ఒపీనియన్ కూడా విన్నాను.
గొప్పగా పాడకపోయినా… తన కెపాసెటీ ఎంతో అలాగే పాడింది…
జెడ్జెస్ ఒపీనియన్ బయాస్డ్ అని క్లియర్ గా అర్ధమవుతోంది. మీరే చూడండి.
@@@@
అయ్యా కీరవాణి గారూ.. ఇళయరాజా వారూ…. మీరు స్వంతంగా పాడుకున్న మీ పాటల్ని ఎప్పుడన్నా విన్నారా!?
తరచి చూసుకోండి. చూసుకుంటే…. మరే బిడ్డల్ని అలా కామెంటరు.
మీరు గొప్ప సంగీత దర్శకులే…. కానీ మాగొప్ప గాయకులేం కాదు.
సునీత అలా అనడం బాలేదు. ఆమెదే అసలు బేస్ అంటూ లేని వాయిస్.
మీరిప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారని…
ఎదుగుతున్న పిల్లల ఆత్మాభిమానాన్ని… ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసే హక్కు మీకు లేదు.
కామెంట్ చేసేప్పుడు…. కనీసం నటించడం నేర్చుకోండి.
ఎస్.పి.బాలు…. గొప్ప నటుడు ఈ విషయంలో.
మీకు మీ పొజిషన్ ముఖ్యం..
మీ ప్రోగ్రాం అడ్మినిస్ట్రేటర్లు..
మీ ఛానల్ ఓనర్లు…
మీ స్పాన్సరర్లు…
ముఖ్యం.
కదా…
అలాంటప్పుడు…
శుభ్రంగా… అందరి పాటల్నీ వినండి.
కామెంట్లేమీ అక్కరలేదు.
చివరాఖరులో మీకిష్టమొచ్చిన వారికి మీరు నంబర్ 1 స్థానాన్నివ్వండి.
నా చిన్నప్పుడు… మా స్కూల్ లో పాటల పోటీలు అలాగే జరిగేవి.
నో కామెంట్స్
ఓన్లీ ఫైనల్ రిజల్ట్.
ఫస్ట్ – సెకండ్ -థర్డ్.
పటా ఫట్.
దీనికింత తతంగమెందుకు అసలు.
ప్రతి ఛానల్ వాడికీ చులకనై పోయుళ్ళా మీరు ఇప్పుడు.
లోపాయికారిగా… మీరేమైనా చేసుకోవచ్చు.
మీ కార్యక్రమం..
మీ ఛానల్..
మీ ఇష్టం…
మీది వ్యాపారం…
మాకు తెలుసు.
పార్టిసిపెంట్స్ కు తెలియదు పాపం.
వాకే…
గీతామాధురి, సునీత వంటి సింగర్స్‌ను జడ్జిలుగా కూర్చోబెడితే వచ్చే సమస్య ఏమిటంటే… కంటెస్టెంట్లు కూడా తమలాగే పాడాలనుకోవడం… కొందరు ఇంప్రూవైజ్ చేస్తారు… కొందరు స్కేల్ మారుస్తారు, కొందరు తమ వాయిస్ కల్చర్‌ను బట్టి మార్చుకుంటారు… ఫైనల్‌గా పదాల ఉచ్ఛారణ, ఆ సమయంలో సరైన భావ ప్రకటన, స్టేజీ మీద ప్రజెంటేషన్ వంటివి ముఖ్యం… అన్నింటికీ మించి జడ్జిలకు రాగద్వేషాలు ఉండకూడదు…
Share this Article