Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం… మోడీ వద్దన్నాడా..? ఎందుకు కవితమ్మా..?.!

May 29, 2025 by M S R

.

ఏముంది..? ఆరుగురు ఎమ్మెల్యేలను తీసుకొస్తా, మంత్రి పదవి ఇవ్వండి అని కవిత కాంగ్రెస్‌తో రాయబారాలు చేసినట్టు ఆంధ్రజ్యోతి రాసింది… అంతేకాదు, బీఆర్ఎస్ పార్టీనే బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని కవితే చెబుతోంది మీడియా చిట్‌చాట్‌లో… ప్రముఖంగా కవరేజీ రావాలనే భావనతోనే…

హరీష్‌రావును కూడా తీసుకుని వచ్చెయ్, ఇద్దరికీ ఉపముఖ్యమంత్రుల పదవులు ఇస్తాం అని కూడా కాంగ్రెస్ రెడీ అవుతుంది ఆ ఆఫర్‌ను కవిత అంగీకరిస్తే… రాజకీయాల్లో ఇది జరగాలి, ఇలాగే జరగాలి అని ఏమీ ఉండదు… కొట్టేయడానికి ఏమీ ఉండదు, ఎందుకంటే, ఆమె డెస్పరేట్‌గా ఉంది కాబట్టే బయటికి వచ్చి పార్టీని కుదుపుతోంది గట్టిగా…

Ads

అదే నిజమైతే… కేటీయార్‌ను ముఖ్యమంత్రిని చేస్తానంటే బీఆర్ఎస్‌ను బీజేపీలో కలిపేస్తా అని కేసీయార్ ఆఫర్ పెట్టి ఉంటాడనడంలో పెద్ద ఆశ్చర్యపోయేదేమీ లేదు కూడా.,. అంతకుముందు కాంగ్రెస్‌లో కలిపేయడానికి సర్వం సిద్ధం చేయలేదా..? సో, ఆమె కాంగ్రెస్‌లోకి వెళ్లిపోతే, వీళ్లు బీజేపీలోకి వెళ్లిపోతే ఖేల్ ఖతం, దుకాణ్ బంద్…….

…….. ఇదీ ఓ బీఆర్ఎస్ పట్ల నిబద్దతతో ఇన్నేళ్లుగా పనిచేస్తున్న తెలంగాణ ఉద్యమకారుడి ఆవేదన… తను వైరాగ్యంతో కూడిన ఓ ఆవేదనతో చెప్పినా సరే… బీఆర్ఎస్ క్యాంపులో ఆందోళనతో కూడిన ఓ తీవ్ర స్తబ్దత, వింత నిశ్శబ్దం కనిపిస్తోంది…  అటు కేటీయార్, ఇటు కవిత పంచాయితీ నిజంగానే తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో వేడి పుట్టిస్తున్నారు…

kavitha

ఆంధ్రజ్యోతి ఏం రాసింది..? ఆమె కాంగ్రెస్‌తో రాయబారాలు చేస్తోందని… తప్పుపట్టడానికి ఏముంది..? అది ఆంధ్రజ్యోతి సోర్స్… షర్మిల పార్టీ పెడుతుందని రాస్తే అందరూ ఖండించారు, ఆమె కూడా… ఏమైంది..? పార్టీ పెట్టింది, అట్టర్ ఫ్లాప్, తీసుకుపోయి కాంగ్రెస్‌లో నిమజ్జనం చేయలేదా…? ఇప్పుడు కవిత కూడా కేసీయారే నా నాయకుడు, నాది బీఆర్ఎస్ పార్టీ అని ఖండితంగా చెబుతున్నా… ఆమె అడుగులు ఆ ధోరణికి భిన్నంగా తిరుగుబాటలోనే ఉన్నాయనేది నిజం కాదా..?

kavitha

బీఆర్ఎస్ క్యాంపులో ముసలం సహజంగానే కాంగ్రెస్ క్యాంపు ఆసక్తిగా గమనిస్తోంది… ‘కాగల కార్యం గంధర్వులు తీర్చారు అన్న తరహాలో మేం ఆ క్యాంపులో క్రియేట్ చేయాలనుకున్న కలవరం కవితే క్రియేట్ చేస్తోంది’ అన్నట్టుగా ఒకింత సంబరపడుతోంది…

kavitha

‘‘మా పార్టీ సోషల్ మీడియాతోనే నామీద రాయిస్తున్నారు, టార్గెట్ చేశారు… ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా..? నా మీద పడి ఏడుస్తారా..? బొచ్చెడు లేఖలు రాశాను ఇప్పటివరకూ, అన్నీ చదివి చింపేసేవాడు డాడీ, కానీ ఇదే ఎందుకు లీకైంది…? అనడుగుతోంది కవిత… అంటే కేసీయారే ఈ లేఖ మాత్రం చింపివేయకుండా లీక్ చేయించాడా..? మరి తన ఉద్దేశం ఏమై ఉంటుంది..?

kavitha

పార్టీ సోషల్ మీడియా ఎవరు నడిపిస్తున్నారో క్లారిటీతో చెప్పొచ్చు కదమ్మా… ఇంతదూరం వచ్చాక ఇంకా దాపరికాలు దేనికి..? కుండ బద్దలు కొట్టేయడమే… కేసీయార్‌ను నడిపిస్తున్నట్టు చెప్పుకుంటున్న వాళ్లు ఎవరో తెలంగాణ సమాజానికి తెలియాలి కదా… కావాలనే ఎంపీ ఎన్నికల్లో నిన్ను ఓడించారనేది నీ నమ్మకం అయితే… కేసీయార్ ఎదుటే ఎందుకు పంచాయితీ పెట్టలేదు ఇప్పటిదాకా…!?

బీజేపీ వాళ్లు కట్టిన ఆసుపత్రి ప్రారంభానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్లు వెళ్లారు అంటున్నావు, అంటే హరీష్ రావును నిందిస్తున్నావా..? పార్టీని, కేసీయార్‌ను తామే నడిపిస్తున్నామని అనుకుంటున్నారు కొందరు, సోషల్ మీడియాలో నన్ను తిట్టిస్తున్నారు అంటున్నావు, అంటే కేటీయార్‌ను తప్పుపడుతున్నావా..? లేక బీజేపీలో విలీనం చేయబోయాడని కేసీయార్‌ను వేలెత్తి చూపిస్తున్నావా..?

కేసీయార్‌కు నోటీసులు వస్తే ఎవరూ మాట్లాడరు, ఇంకెవరికో నోటీసులు (కేటీయార్?) వస్తే హడావుడిగా ఖండనలు అంటున్నావు కదా… కేటీయార్ కేసీయార్‌ను మించి పార్టీ మీద గుత్తాధిపత్యం సంపాదించాడు, కేసీయార్‌ది ఏమీ నడుస్తలేదని చెబుతున్నవా..? ఇవన్నీ స్ట్రెయిట్‌గానే చెప్పొచ్చు కదా… తెగేదాకా లాగుతున్నట్టు అర్థమవుతోంది… బహుశా షోకాజు నోటీసులు రావచ్చు…

అవునూ, మీడియా చిట్‌చాట్‌లో ఏమన్నది చివరగా.,.. నేను తిక్కదాన్ని… చిచోరా రాజకీయాలు చేయను… ఎవరికీ భయపడను… సరేనమ్మా…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అయ్యా, రేవంతం సారూ… ఈ కేరక్టర్లను అస్సలు పట్టించుకోవద్దు సుమీ…
  • ఫాఫం తెలుగు సినిమా… దిల్ రాజు రాగద్వేషాల గుప్పిట్లో అవార్డులు….
  • ఔరా.., ఇది విశ్వనాథ్ సినిమాయేనా..? అత్యంత నిరాసక్తంగా…!!
  • హే భైరవా, హే గరుడా… ముగ్గురు హీరోయిన్లు మూడు సహాయక పాత్రలు…
  • ఖలేజా ఫ్లాప్‌కు ప్రధాన బాధ్యుడు దర్శకుడు, నెక్స్ట్ నిర్మాతలే…!!
  • దిక్కుమాలిన పాత్రికేయం… మన ‘‘గొప్ప’’ టీవీ యాంకర్లు నయమేమో..!!
  • సీన్ రివర్స్… రేవంత్ Vs కేసీయార్… కాంగ్రెస్ Vs బీఆర్ఎస్…
  • నెహ్రూకే తప్పలేదు… ఆఫ్టరాల్ మనం..? మన జుట్టుకు మనమే లోకువ..!!
  • పాకిస్థానీ డమ్మీ రాకెట్… చైనా డిఫెన్స్ మిసైల్ ఫ్లాప్… మనం ఆనాడే చెప్పాం…
  • జాతీయ పార్టీ అధ్యక్షుడు సరే… మరి ఇతర దేశాల శాఖల మాటేమిటి..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions