Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పెట్టుడు ముహూర్తాల్లో కృత్రిమ జననాలు జాతకాలను మారుస్తాయా..?!

June 20, 2025 by M S R

.

నిజమే, నిన్న సాక్షిలో ఏదో సెంటర్ నుంచి ఓ వార్త కనిపించింది… అదేమిటంటే..? సహజ ప్రసవం కోసం చూడకుండా గర్భిణులు మంచి ముహూర్తం చూయించుకుని, అన్ని గ్రహాలూ సరైన స్థితిలో ఉన్నప్పుడే, కడుపు కోయించుకుని మరీ పిల్లల్ని కంటున్నారు అనేది సారాంశం…

ఇదొక పెద్ద దందా అయిపోయింది… ముహూర్తాలు పెట్టేవాళ్లకు డబ్బులు, సిజేరియన్లు సరిగ్గా అదే సమయంలో కానిచ్చేయడానికి డాక్టర్లకు, హాస్పిటల్స్‌కు డబ్బులు… ఈరోజుల్లో డబ్బులు కానిదేముంది..? ఆహా, మంచి నక్షత్రంలో, మంచి ఘడియాల్లో పిల్లల్ని కన్నాం అనే తృప్తి… ఇక ఆ పిల్లల జాతకాలకు ఢోకా లేదనే భరోసా తల్లిదండ్రులకు…

Ads

ఐతే ఇది కొత్తేమీ కాదు, చాన్నాళ్లుగా సాగుతున్నదే.., అన్ని సందర్భాలకూ పంతుళ్ల దగ్గర విరుగుడు మంత్రాలు ఉంటాయి… మరీ మూఢాలు, వర్జ్యాలు తప్ప మిగతా ఏ రోజంటే ఆరోజున, ఏ సమయం కావాలంటే ఆ సమయానికి అభిజత్ లగ్నం పెట్టేస్తారు…

births

మీరు చూడండి, ఈమధ్య పెళ్లిళ్లన్నీ ఉదయమే ఉంటాయి… పొద్దున వచ్చిన బంధుగణం, సాయంత్రానికల్లా గాయబ్… కంఫర్ట్ చూసుకుంటున్నారు… సరే, అలాగే పిల్లల జననాలకూ ఇదే… మామూలుగా గ్రహసంచార సంబంధ జాతకాలకు జన్మసమయమే ప్రధానాధారం కదా… అదే కదా వ్యక్తుల జాతకాల్ని నిర్దేశించేది…

సో, అనుకూల గ్రహాలు, అనుకూల గళ్లల్లో కూర్చున్నప్పుడే… అన్నీ చూసుకుని మరీ పిల్లల్ని కనేస్తే వాళ్ల జాతకం దివ్యంగా ఉంటుందనేది ఈ ముహూర్తాలు పెట్టేవాళ్లు చెప్పే మాట… ఆ తల్లిదండ్రుల బాట… అంటే, బ్రహ్మ రాసే జాతకాన్ని వీళ్లు తిరగరాసే ప్రయత్నం అన్నమాటే కదా… మరి నిజంగానే ఈ జాతకాలు దివ్యంగా ఉంటాయి..? పిల్లల జాతకాల్ని మనమే కృత్రిమంగా మార్చేయగలుగుతున్నామా..?

ఈ సందేహం వచ్చింది… అబ్బే, అది తల్లుల ఆరోగ్యానికి మంచిది కాాదని కొందరు… సహజ ప్రసవాలు తప్ప ఈ కృత్రిమ కడుపుకోత జననాలతో పిల్లల ఎదుగుదలకు అనారోగ్యకరం అని మరికొందరు ఏదో చెబుతున్నారు గానీ… అవన్నీ తప్పు… సిజేరియన్ ప్రమాదం కాదు, పిల్లలకైనా, తల్లులకైనా… నిజానికి ఏ అర్ధరాత్రో, అపరాత్రో బిడ్డ అడ్డం తిరిగే తిప్పలకన్నా సిజేరియన్ డేంజరేమీ కాదు… గండమూ కాదు…

ఎస్, సహజ ప్రసవం మంచిదే గానీ, సిజేరియన్ ప్రమాదం అనే అభిప్రాయం మాత్రం తప్పు… ఇప్పుడు మెజారిటీ సిజేరియన్లే కదా… సరే, అదీ ఓ దందా… ఆ చర్చ ఇక్కడ అప్రస్తుతం… కానీ ముహూర్తాలు చూసుకుని, ఇష్టమైన టైములో ప్రసవం చేయించుకుంటే అది ఆ పిల్లల జాతకాల్ని మారుస్తుందా..?

మార్చదు అంటున్నాడు ధర్మపురి గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ (Onlinejyotish) ..  * జాతకం అంటే జన్మ లగ్నంతో పాటుగా ఆ సమయంలో ఉన్న గ్రహ స్థితి.., కేవలం మనం లగ్నాన్ని మారుస్తున్నాం కానీ గ్రహ స్థితులను, అంటే ఒక్కో రాశిలో ఉన్న గ్రహాన్ని మార్చడం లేదు… మార్చలేం… అటువంటప్పుడు మనం ఎంత అనుకూల ముహూర్త సమయాన్ని చూసుకొని డెలివరీ చేసుకున్నా… నీచంలో ఉన్న గ్రహం ఉచ్చ స్థితిలోకి రాదు*

మరెందుకు కొందరు ఈ ముహూర్తాలు పెడుతున్నారు..? అది వాళ్లకు ఉపాధి, బతుకుతెరువు, అవి నమ్మాలా వద్దానేది తల్లిదండ్రులు తేల్చుకోవాల్సిందే… పిల్లల్ని వాళ్లకు రాసి ఉన్న సమయంలోనే రానివ్వండి..!! కృత్రిమ జనన లగ్నం స్థూలంగా శిశువు జాతకాన్ని ప్రభావం చేయదు, చేయలేదు… నొసటి రాతను మార్చలేదు…!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అనితర సాధ్యమైన ఆద్యకళకు ఏది గుర్తింపు..? ఏది పట్టింపు..?!
  • 8 వసంతాలు… కంప్లీట్ అనంతిక షో… కానీ మేఘసందేశం రోజులు కావివి..!!
  • పెట్టుడు జనన ముహూర్తాలు నమ్ముతారా..? ఈ కథ చదవాలి మీరు..!!
  • ఆ భీకరమైన శబ్దం విని, భయపడి, ఆ లింక్ నొక్కారో… అయిపోయారు..!!
  • పెట్టుడు ముహూర్తాల్లో కృత్రిమ జననాలు జాతకాలను మారుస్తాయా..?!
  • బనకచర్ల ప్లాన్ బద్దలు… చంద్రబాబు ప్రణాళికలపై రేవంత్ పాశుపతం..!!
  • ఫాఫం కొనఊపిరి… పరుచూరి డైలాగుల దెబ్బకు వెంఠనే హరీమంది రోజా…
  • భేష్ శేఖర్ కమ్ముల… కుబేర ఓ క్లీన్ హిట్… ఆకట్టిపడేశావు పలు సీన్లలో…
  • ఇవి మాయ ఉంగరాలు కావు… మహత్తులూ ఉండవు… జస్ట్, స్మార్ట్ రింగ్స్…
  • ‘‘ఎందుకింత ఎక్కువ ఆయుష్షునిచ్చావ్ దేవుడా…? ఏడవడానికా..!’’

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions