Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘ఆమెను’ చంపేసి… రెండు వారాల తరువాత మళ్లీ బతికించారట…

January 17, 2026 by M S R

.

Subramanyam Dogiparthi ….. మరో మధుర ప్రేమ కావ్యం ఈ ప్రేమ సినిమా . ప్రేమ సినిమాలు మనకు ఎన్నో ఉన్నాయి . కానీ , కొన్నే గుర్తుంటాయి . మరో చరిత్ర , గీతాంజలి , ప్రేమికుడు మచ్చుకు . ఆ కోవలోనిదే ఈ ప్రేమ సినిమా కూడా . It’s a musical splendour . ఇళయరాజా , బాలసుబ్రమణ్యం , చిత్ర , శైలజ , ఆత్రేయ మధుర సంగీత సృష్టి .

అప్పట్లోనే చాలా రోజుల తర్వాత పాటలనన్నీ ఆత్రేయే వ్రాసారు . అద్భుతంగా వచ్చాయి ఆయన కలం నుంచి మధుర గీతాలు . ఇళయరాజా విజృంభణలో మరో సినిమా . ఈనాడే ఏదో అయ్యింది ఏనాడూ నాలో జరగనిది అంటూ సాగే వెంకటేష్ , రేవతిల మీద యుగళగీతం మోస్ట్ మెలోడియస్ సాంగ్ .

Ads

గుండెల్ని పిండేసే పాట . ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా క్లైమాక్స్ పాట . చిత్రీకరణ కూడా మధురంగా ఉంటుంది . మరో పాట ఒంటరి వాడిని నేను ఎవ్వరి వాడిని కాను కూడా బాగుంటుంది .

యు ఆర్ మై హీరో హీరో హీరో , ఎక్కడ ఎక్కడ పోతావురా ఇక్కడ ఇక్కడ నేనుండగా , ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు , ఐయామ్ సారీ సో సారీ అంటూ సాగే డ్యూయెట్లు అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి . దర్శకుడు సురేష్ గోపీకృష్ణ అద్భుతంగా చిత్రీకరించారు . ఇళయరాజా సంగీతాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే .

సురేష్ గోపీకృష్ణ , సాయిచంద్ కధని మనసులతో నేసారేమో అని అనిపిస్తుంది. అంత చిక్కటి కధ. హీరో వెంకటేష్ ఒంటరివాడు . తల్లిని అన్యాయం చేయటమే కాకుండా దుర్మార్గంగా చంపేసిన తండ్రిని చంపి జైలు శిక్ష అనుభవిస్తాడు . చుట్టూ అందరూ అతని తల్లిని , అతన్ని కాకుల్లాగా పొడుస్తూ ఉంటారు.

అతడో సంగీత ప్రేమికుడు . సంగీతంలో గొప్ప గుర్తింపు తెచ్చుకోవాలనేది జీవిత ధ్యేయం . ఇంతలో హీరోయిన్ రేవతి తారసపడుతుంది . అల్లరి పిల్ల . ఇద్దరి మధ్య ప్రేమ అంకురించి దిన దిన ప్రవర్ధమానం అవుతుంది . హీరో అవేశానికి , కోపానికి కళ్ళెం వేసి సంగీత యాగం వైపు మళ్ళిస్తుంది .

ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర బాలసుబ్రమణ్యానిది . సంగీత ఆచార్యుడి పాత్ర . వెంకటేషుని శిష్యుడిగా స్వీకరించడమే కాకుండా తండ్రి కూడా అవుతాడు . ఈ సినిమాలో ఒకనాటి అందాల హీరోయిన్ మంజుల నెగటివ్ పాత్రలో ‘షిలన్‌’గా బ్రహ్మాండంగా నటిస్తుంది . హీరోయిన్ రేవతి తల్లి పాత్ర . కూతురి పెళ్ళిని జైలుకు వెళ్ళివచ్చిన వెంకటేషుతో జరిపించటం ఇష్టం లేని ఆమె ఓ రౌడీని కూడా పురమాయిస్తుంది .

ప్రేమ

ఈ అవరోధాలను అన్నీ దాటి హీరోహీరోయిన్లు పెళ్ళి కూడా చేసేసుకుంటారు . కానీ , దురదృష్టవశాత్తు అనారోగ్యంతో హాస్పిటల్ పాలవుతుంది రేవతి . ఆమె ఆకాంక్ష మేరకు వెంకటేష్ సంగీత పోటీల్లో ప్రధమ స్థానాన్ని గెలుచుకుంటాడు . ఆ గెలుపు అయ్యాక అతని ఒడిలోనే ప్రాణాలను వదులుతుంది హీరోయిన్ . ఇంత మధుర కావ్యం రచయిత ఎందుకని విషాదాంతం చేయాలని భావించాడో !!

(రెండు వారాల తరువాత కొన్ని థియేటర్లలో ఆ పాత్రను బతికించి ప్రదర్శించారని కూడా వార్తలు వచ్చాయి)…

నటనపరంగా మొదటి మెప్పు రేవతికే . అల్లరి పిల్లగా , ప్రేమికురాలిగా , తన ప్రేమికుడిని కార్యోన్ముఖుడిని చేసే స్త్రీగా అద్భుతంగా నటించింది . ఆ తర్వాత వెంకటేష్ . బాగా నటించాడు . వెంకటేష్ కెరీర్ మొత్తం తనను ప్రమోట్ చేసుకోవడం మీద కన్నా తాను నటించిన సినిమా హిట్ కావాలి అనే అంశంపైనే కాన్సెంట్రేట్ చేస్తాడని అనిపిస్తుంది . అయితే ఈ క్రమంలో ఈ సినిమా హిట్ మాత్రమే కాదు . అతనికి నంది అవార్డు కూడా తెచ్చిపెట్టింది .

రేవతి
ఈ ఇరువురి తర్వాత తల్లి పాత్రలో మంజుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసి ఉంటుంది . అదరగొట్టేసింది . రేవతి చెల్లెలుగా వైష్ణవికి ఇది తెలుగులో మొదటి సినిమా . అలాగే సురేష్ అనే నూతన నటుడు వెంకటేషుకి స్నేహితుడిగా నటించాడు . మరే ఇతర సినిమాలో ఇతను కనిపించినట్లుగా లేదు .

మరో ప్రధాన పాత్రలో వన్ సైడ్ లవరుగా కల్పన నటించింది . హీరో వెంకటేష్ ఆరాధకురాలిగా అందంగా తళుక్కుమంటుంది .ఇతర ప్రధాన పాత్రల్లో గొల్లపూడి , రాళ్ళపల్లి , అనిత , బ్రహ్మానందం , పి యల్ నారాయణ , చలపతిరావు , జెన్నీ , ప్రదీప్ శక్తి , పి జె శర్మ  ప్రభృతులు నటించారు .

సురేష్ బేనరుపై కాకుండా రామానాయుడు రాజేశ్వరి ఫిలింస్ బేనరుపై ఈ సినిమాను నిర్మించారు . తన సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమాలో ఆయన తళుక్కుమనలేదెందుకో !? I am subject to correction . క్లైమాక్సులో హీరోహీరోయిన్ల పెళ్ళిని మెదక్ చర్చిలో షూట్ చేసారు . రాష్ట్రంలో మెదక్ చర్చి సందర్శించవలసిన ప్రదేశాలలో ఒకటిగా చెపుతారు .

ప్రేమ

అప్పుడయినా ఇప్పుడయినా ఎప్పుడయినా ప్రేమంటే ఎలా ఉంటుందో , ప్రేమీప్రేమికులు ఎన్ని గిల్లికజ్జాలు పెట్టుకున్నా , ఒకరి మీద ఒకరు అలిగినా , స్ట్రైకులు చేసుకున్నా , మళ్ళా ఎలా ఒకటవుతారో ప్రేమికులకే తెలుసు . అలా ప్రేమించే అదృష్టం కలగని వాళ్ళు అలాంటి స్వచ్ఛ మధుర ప్రేమను ఈ సినిమాలో చూసి తరించవచ్చు .

ఇంత అందమైన మధుర సంగీత భరిత ప్రేమ కావ్యం తమిళంలోకి డబ్ చేయబడింది . సురేష్ గోపీకృష్ణే హిందీలో Love అనే పేరుతో రీమేక్ చేసారు . సల్మాన్ ఖాన్ , రేవతి , అమ్జాద్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు .

1989 సంక్రాంతి సీజన్లో వచ్చిన ఈ సినిమాను ఇంతకుముందు చూసి ఉన్నా మరలా మరలా ఆస్వాదించతగ్గ అద్భుత ప్రేమ కావ్యం . యూట్యూబులో ఉంది . ఆస్వాదించండి . Love is always beautiful .

నేను పరిచయం చేస్తున్న 1224 వ సినిమా .
#తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కలాం కావల్ – మమ్ముట్టి ‘నట మాయాజాలం’… మరో భిన్నపాత్రలో…
  • ‘ఆమెను’ చంపేసి… రెండు వారాల తరువాత మళ్లీ బతికించారట…
  • మరాఠీల అసలు తీర్పు..! విద్వేషంపై విజయం సాధించిన విజ్ఞత..!
  • నవ్వుతూ, నవ్విస్తూనే… పాఠం చెప్పగలదు… ప్రతిభ చూపగలదు…
  • చిన్న ఆవిష్కరణలే… చెప్పరాని అవస్థల్ని తీరుస్తాయి… ఇలా…!!
  • గొర్లు, బర్ల దాకా…! కేసీయార్ కరప్ట్ చేయని రంగం ఏమైనా మిగిలిందా..?!
  • “చచ్చావా… బతికావా?”…. చైనాలో సెన్సేషన్ సృష్టిస్తున్న కొత్త యాప్…!
  • ప్రజారాజ్యం పార్టీ పెట్టింది అక్కినేని..! ఎన్నికల్లో పోటీ కూడా చేశాడు..!!
  • భారత్‌కు చరిత్రాత్మక విజయం … అమెరికాకు వ్యూహాత్మక దెబ్బ…
  • కుంతి కోసం, నెత్తుటి మూలాల కోసం… ఓ డచ్ కర్ణుడి అన్వేషణ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions