Subramanyam Dogiparthi……… ప్రేమసాగరం . కాదు కాదు ప్రేమ దుమారం , ప్రేమ తుఫాన్ , ప్రేమ సునామీ . తెలుగు సినిమా రంగంలో ఓ డబ్బింగ్ సినిమా ఇలా దుమ్ము దులిపింది మరొకటి లేదు . ఓ ప్రి-రిలీజ్ ఫంక్షన్లో ఈ సినిమా దర్శకుడు రాజేందర్ చెప్పాడు . విజయవాడ పక్కన అన్నాడు ఏ ఊరో తెలియదు ; రెండు సంవత్సరాలు ఆడిందట . కాలేజీ కుర్రాళ్ళు , అమ్మాయిలు అంతా ఈ సినిమా ఆడుతున్న థియేటర్లలోనే ఉండిపోయారు 1983 లో …
ఈ సినిమాకు చాలా విశేషాలు ఉన్నాయి . టాలీవుడ్ దాసరికి పోటీగా కోలీవుడ్ దాసరి ఉద్భవించాడు . టి రాజేందర్ . ఈ సినిమాకు కధ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం , ఏక్టింగ్ , సంగీతం కూడా ఆయనే . దాసరి కన్నా ఒక ఆకు ఎక్కువ చదివాడు .
Ads
దాసరి సంగీత దర్శకత్వం చేయలేదు . రాజేందర్ అదీ చేసాడు . In fact , ఈ సినిమా ఘన విజయానికి ప్రధాన కారణం పాటలే . ఆ పాటల క్రెడిట్ వాటిని వ్రాసిన రాజశ్రీకి , సంగీతాన్ని అందించిన రాజేందర్ కే దక్కుతుంది .
ఈ సినిమా ఇప్పుడు చూస్తుంటే సీతాకోకచిలుక , హేపీ డేస్ , ముద్దమందారం , శివ వంటి టీనేజ్ సినిమాలన్నీ గుర్తుకొస్తాయి . మన కాలేజి రోజులు గుర్తుకొస్తాయి . పుస్తకాల పురుగులకు ఇలాంటి అనుభవాలు ఉండే ఛాన్సే లేదు . కాలేజి లైఫ్ ఎంజాయ్ చేసిన వాళ్ళు సినిమాలో లీనమై పోతారు . తమ తీపి అనుభవాలను అన్నీ ఓసారి డ్రీం వేసుకుంటారు .
ఒక ఉదంతం చెప్పాలని ఉంది . నేను 1992 లో టిజెపియస్ కాలేజి ప్రిన్సిపాలుని అయ్యాక జరిగిన సంఘటన . రొటీనుగా కారిడార్లను పోలీసింగ్ చేస్తున్నా . ఒక క్లాస్ దగ్గర కిటికీ లోనుంచి చూస్తే ఒక స్టూడెంట్ పాఠం వినకుండా ఏదో వ్రాసుకుంటూ ఉన్నాడు .
ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాస్ . క్లాసులోకి వెళ్ళిపోయి ఆ నోట్ పుస్తకాన్ని లాగేసుకుని చూసా . షాకింగ్ . రామకోటి లాగా ఓ అమ్మాయి నామకోటి అది . నోట్ పుస్తకం అంతా ఆ అమ్మాయి నామాలే . లవర్స్ పేర్లు చేతుల మీద , ఛాతీల మీద పొడిపించుకోవడం ఆశ్చర్యమేమీ కాదు .
ప్రేమకు వయసుతో పని ఏముంది ? యాభై ఏళ్ళు వచ్చాక కూడా నామకోటి వ్రాసే అమాయక చక్రవర్తులు అక్కడక్కడా ఉంటారు . ప్రేమించే వాళ్ళుంటే చెయ్యిచ్చే వాళ్ళూ ఉంటారు .
ప్రేమసాగరం సినిమా విషయానికి వస్తే… ఇది కాలేజి టీనేజి ప్రేమ కధ . హీరో హీరోయిన్ల ప్రేమ ప్రస్థానం ద్వేషంతో మొదలయి గాఢ ప్రేమగా మారుతుంది . హీరోయిన్ అన్న విలన్ . ఆ ఊళ్ళో ఈ విలనుకు కౌంటరుగా ఓ జన రక్షకుడు ఉంటాడు . ఈ హీరో హీరోయిన్ల పెళ్ళి ప్రేమ రక్షకుడు అయి జరిపిస్తాడు ఆ కౌంటర్ విలన్ . ఆ క్రమంలో హీరోయిన్ అన్నని చంపేస్తాడు . ఆ ఫైటింగులో తానూ చనిపోతాడు . టూకీగా ఇదీ కధ .
హీరోహీరోయిన్లుగా గంగ , నళిని నటించారు . గంగ అంటే అమ్మాయి కాదు . ఇతను ఈ ఒక్క సినిమాలోనే నటించి సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు . కమల్ హాసన్ , మన ప్రదీప్ లాగా ఉంటాడు . మరే సినిమాలోనూ అవకాశం రాలేదు . ఈ మధ్యే 2023 లో చనిపోయాడు .
ఇంక నళిని . ఈ సినిమాకన్నా ముందు సినిమాల్లో కనిపించినా తమిళ , తెలుగు రాష్ట్రాలలో ఏక్ దమ్మున డ్రీం గాళ్ అయిపోయింది ఈ సినిమాతో . గోడల నిండా ఆమె పోస్టర్లే . 1985లో ఆమె 18 సినిమాలు చేసింది… అంతగా డిమాండ్ ఆమెకు అప్పట్లో. కన్నడ, మలయాళ, తమిళ, తెలుగు సినిమాల్నే కాదు… తమిళం, తెలుగు టీవీ సీరియల్స్ కూడా బోలెడు చేసింది…
విలనుగా రాధా రవి , కౌంటర్ విలనుగా రాజేందర్ , హీరోయిన్ విలన్ల అక్కగా సరిత నటించారు . రాజేందర్ రజనీకాంతుని , రాధా రవి M.R.రాధాని ఇమిటేట్ చేసారని అనిపిస్తుంది .
నామం పెట్టు నామం పెట్టు కాలేజీకి, చిన్నదాని చెయ్యీ పట్టు మేరేజీకి పాట కాలేజి కుర్రాళ్ళ టూర్ పాట . ఆరోజుల్లో కాలేజి పిల్లలు పిక్నిక్కుల్లో గెంతులేసే పాట ఇది . శివ సినిమాలో బోటనీ పాఠముంది మేటినీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా పాట గుర్తుకొస్తుంది ఇప్పుడయితే .
పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ . అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ, హృదయమనే కోవెలలో నిను కొలిచానే దేవతలా పాటల్లో నళిని నృత్యాలు చాలా అందంగా ఉంటయి . Undoubtedly unmissable . కుర్రాళ్ళను ఊపేసిన బేతింగ్ సాంగ్ నీ తలపే మైకం నీ వలపే లోకం . నిజంగా మత్తు మత్తుగా ఉంటుంది పాట . యస్ జానకి గొంతంతా మత్తూ మైకమే .
చక్కనైన ఓ చిరు గాలి ఒక్క మాట వినిపోవాలి , పొంగదా యవ్వనం చిందదా తొలి సుఖం పాటలు అద్భుతంగా ఉంటాయి . అరె బంతాడే బంగారు బొమ్మల్లారా పాట అబ్బాయిలు అమ్మాయిల్ని టీజ్ చేసే పాట బాగుంటుంది . ఈ సినిమాలో పాటలు వింటూ ఉంటే రాజశ్రీకి ఈ పాటల్లో మాటలు ఎలా తట్టాయా అని అనిపిస్తుంది . Highly romantic .
తమిళంలో సూపర్ డూపర్ హిట్టయిన ఉయిరుళ్ళవరై ఉష సినిమాకు డబ్బింగ్ ప్రేమ సాగరం . రాజేందర్ భార్య పేరు ఉష . ఆ పేరే ఈ సినిమాలో హీరోయిన్ పేరు . టైటిల్లో కూడా పెట్టుకున్నాడు . ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక చూడండి . (వర్తమానంలో ప్రముఖ తమిళ హీరో శింబు వీళ్ల కొడుకే…)
యూట్యూబులో ఉంది . వయసులో ఉన్నవాళ్ళకు హుషారుగా ఉంటుంది . నిత్య యవ్వన ముసలాళ్ళు గతించిన తీపి గుర్తులు ఏమయినా ఉంటే నెమరు వేసుకోవచ్చు . A visual , musical , romantic splendour .
#తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు
Share this Article