Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చెప్పనే లేదు కదూ… ఆ స్కూళ్లో ఆ అమ్మాయికి అడ్మిషన్ దొరికింది..!

October 9, 2024 by M S R

ప్రిస్టేజియస్ స్కూల్… సీటు దొరకడం గగనం… పైరవీలు నడవవ్… ఓపూట అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు విరగబడ్డారు… ఇంటర్వ్యూలు సాగుతున్నయ్… పేరెంట్స్‌లో ఒకటే టెన్షన్…
ఒక అమ్మాయికి అసలే అర్థం కావడం లేదు, తనను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అసలు అనుకుంటోంది.., ఆ హడావుడి, ఆ రద్దీని ఆసక్తిగా గమనిస్తోంది…
టీచర్, ప్రిన్సిపాల్ ఆ అమ్మాయి ఇంటర్వ్యూ ప్రారంభించారు… అదిలా సాగింది…

నీ పేరేమిటమ్మా..?
సీత…
నీకు తెలిసింది ఏమైనా చెప్పు..?
చాలా విషయాలు తెలుసు నాకు, మీకేం కావాలో అడగండి…
(ఈ పిల్ల దూకుడు చూసి పేరెంట్స్ తలపట్టుకున్నారు, అడ్మిషన్ అవకాశాలు ఇక గంగలో కలిసినట్టే అని భయం పట్టుకుంది… తల్లి ఏవో సైగలు చేస్తోంది కానీ ఆ అమ్మాయి అవేవీ పట్టించుకోలేదు… ప్రిన్సిపాల్ కూడా ఆ అమ్మాయిని మాట్లాడనివ్వండి అంటూ తల్లిని వారించాడు…)

నువ్వు చెప్పు తల్లీ, నీకు తెలిసిన ఏదైనా పద్యమో, కథో చెప్పు…
ఏదో ఒకటి అడగండి, పద్యం కావాలా..? కథ కావాలా..?
ఊఁ, సరే… కథ చెప్పు…
నేను చదివిన కథ చెప్పనా..? నేను రాసిన కథ చెప్పనా..?
(ఆ గదిలో నిశ్శబ్దం…)
ఓహ్, నువ్వు కథలు కూడా రాస్తావా..?
నేనెందుకు కథలు రాయకూడదు..? రాయలేనా..?
(ప్రిన్సిపాల్‌లో మరింత ఆసక్తి పెరిగింది…)
సరే, నువ్వు రాసిన కథే చెప్పు…

Ads

ఓరోజు రావణుడు సీతను కిడ్నాప్ చేశాడు, శ్రీలంకకు ఎత్తుకుపోయాడు… అప్పుడు రాముడు హనుమంతుడిని పిలిచి, సీతను కాపాడాల్సిందిగా చెప్పాడు… హనుమాన్ సరే అన్నాడు…
ఊఁ తరువాత..?
అప్పుడు హనుమాన్ తన దోస్త్ స్పైడర్ మ్యాన్‌ను పిలుస్తాడు…
మధ్యలో స్పైడర్ మ్యాన్ ఎందుకు వచ్చాడు తల్లీ..? ఎలాగా..?
ఎందుకంటే… ఇండియా, శ్రీలంక నడుమ చాలా ఎత్తయిన పర్వతాలు, సముద్రం ఉంటుంది కదా, స్పైడర్ మ్యాన్ అయితే తాళ్లు క్రియేట్ చేసి తీసుకుపోతాడు ఈజీగా… అందుకని హనుమాన్ పిలుస్తాడన్నమాట…
కాదమ్మా, హనుమాన్ స్వయంగా ఎగిరి వెళ్లిపోగలడు కదా…
నో, అప్పటికే హనుమాన్ ఒక చేత్తో సంజీవనీ పర్వతాన్ని మోస్తున్నాడు, ఆ బరువు మోస్తూ వేగంగా శ్రీలంకకు ఎగిరివెళ్లడం కష్టం కదా…
(మళ్లీ ఆ గదిలో సైలెన్స్…)

నన్ను కంటిన్యూ చేయమంటారా..? వద్దా..?
లేదు, లేదు… నువ్వు చెప్పమ్మా…
హనుమాన్, స్పైడర్ మ్యాన్ కలిసి వెళ్లి, సీతను రక్షిస్తారు, సీత వాళ్లిద్దరికీ థాంక్స్ చెబుతుంది…
‘ఎందుకు..?’
‘ఎవరైనా సాయం చేస్తే థాంక్స్ చెప్పాలి కదా మరి..? తరువాత సీత Hulk ను పిలవాల్సిందిగా హనుమాన్‌కు చెబుతుంది…
మధ్యలో ఈ హల్కుడు దేనికి..?
హనుమాన్, స్పైడర్ మ్యాన్, సీత ముగ్గురూ కలిసి శ్రీలంక నుంచి ఇండియాకు రావాలి కదా… అందుకన్నమాట…
హనుమంతుడు ఒక్కడే సీతను మోసుకురాగలడు కదమ్మా…
ఎలా పాజిబుల్..? ఒక చేతిలో సంజీవని పర్వతం, మరో చేతిలో స్పైడర్ మ్యాన్… సీతను మోసుకురావడానికి ఇంకెవరో కావాలి కదా…
ఓహో, తరువాత ఏమైంది..,?
హల్కుకు కూడా కష్టమే అనుకుని అక్షయ్‌ను అడుగుతారు…

మధ్యలో ఈ అక్షయ్ ఎవరు..?
నా ఫ్రెండ్, నా కథలోకి నేను ఏ కేరక్టరైనా తీసుకొస్తా…
సరే, సరే, ఆ తరువాత..?
ఏముందీ… అందరూ కలిసి హైదరాబాద్ ఎంజీబీస్ బస్టాండుకు వచ్చేస్తారు…
అక్కడికి ఎందుకు..?
ఎందుకంటే, వాళ్లు తొవ్వ మరిచిపోతారు, అందుకే ఓ ఐడియా వచ్చి, డోరాను పిలుస్తారు…
ఓహో, ఈ కథలో డోరా కూడా ఉన్నాడన్నమాట… కానివ్వు కానివ్వు…
అయిపోయింది కథ, అందరూ కలిసి గౌలిగూడ బస్ డిపో వెనక కాలనీలో దిగుతారు…
అక్కడికే ఎందుకు వెళ్లారు..?
ఎందుకంటే..? సీత ఉండేది అక్కడే… నా పేరే సీత…
.
.
.

తాము చదివే ఇంగ్లిష్ కామిక్ పుస్తకాలు, టీవీల్లో చూసే పురాణాల ఎపిసోడ్లు చాలామంది ఈతరం పిల్లల్ని ఇలా ‘మిక్సీ’ చేస్తుంటాయన్నమాట… కానీ వాళ్లలో క్రియేటివిటీ సూపర్… దాన్ని అణిచేయడానికి చూడొద్దు… ఈ పోస్టులో చివరి వాక్యం చెప్పనే లేదు కదూ..,
.
.
.
ఆ అమ్మాయికి అడ్మిషన్ దొరికింది..!!
.
(ఇక్కడే ఎక్కడో కనిపించిన ఓ ఇంగ్లిషు పోస్టుకు నా స్వేచ్ఛానువాదం ఇది…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎహెఫో… ట్రంపుకి ఇండియా తాజా సందేశం… రష్యాలో భారీ యూరియా ప్లాంట్…
  • శ్రీ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి… అయ్యో, కేసు పెట్టేసి జైళ్లో వేస్తారా..?!
  • కృష్ణ సాహసి..! ఆరోజుల్లో ఎన్టీయార్‌ను ఢీకొట్టడం అల్లాటప్పా కాదు మరి..!!
  • ఎస్… రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ, మద్దతు ఇవ్వకపోతే… మొదటికే మోసం.,.!!
  • దమ్మున్న జర్నలిస్టు అంటే..? సీఐఏకే చుక్కలు చూపించిన ఈ కేరక్టర్..!!
  • ఒక మంచి ప్రేమకథ… కథలో లీనమైతే కళ్లు తడిపేసే ‘ప్రేమకథ’…
  • తాష్కెంట్-2… ఓ విఫల కుట్ర… నిజంగా మోడీని పుతిన్ రక్షించాడా..?!
  • శంఖు పుష్పం..! అందం, ఆరోగ్యం, ఆధ్యాత్మికం… వ్యాపారం..!!
  • పదండి పోదాం, పదండి తోసుకు… పోదాం పోదాం వెనక్కి వెనక్కి…!!
  • ప్రపంచ టాప్-3 సైంటిస్టుల జాబితాలో… వరుసగా మూడేళ్లూ స్థానం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions