Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!

June 6, 2025 by M S R

.

ఓ మిత్రుడి డౌటనుమానం ఏమిటంటే… ‘‘ఆయా పార్టీల న్యూస్ చానెళ్ల రేటింగ్స్ మెరుగుదల, పతనం కూడా ఆయా పార్టీల పట్ల ప్రస్తుత ప్రజాదరణ స్థాయిని రిఫ్లెక్ట్ చేస్తాయా..?’’

తాజా బార్క్ రేటింగ్స్‌లో రెండు ఉదాహరణల్ని చూపించాడు… ఒకప్పుడు ప్రజాదరణలో కాస్త మంచి స్థితే కనిపించిన కేసీయార్ న్యూస్ చానెల్ టీన్యూస్ ప్రస్తుతం 13వ స్థానంలో ఉంది… మరీ నడుస్తుందో లేదో వాళ్లకే తెలియని ఈటీవీ తెలంగాణ, ఐన్యూస్‌కన్నా దిగువన..!!

Ads

అదే చంద్రబాబు క్యాంపుగానే పరిగణించబడే ఏబీఎన్ మాత్రం నాలుగో ప్లేసుకు వచ్చి చేరింది… సో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలంగానే కనిపిస్తోంది, అధికారంలో ఉంది కదా, ఆ ప్రభావం, రిఫ్లెక్షన్ ఆ చానెల్ మీద కనిపిస్తోంది…

ఈరోజుకూ ఇంకా తేరుకోలేకపోతోంది బీఆర్ఎస్ కాబట్టి, అదే టీన్యూస్ రేటింగ్స్ మీద రిఫ్లెక్టవుతోంది…. ఇదీ తన విశ్లేషణ సింపుల్‌గా… ఒకసారి ప్రస్తుతం తెలుగు న్యూస్ చానెళ్ల రేటింగ్స్ టేబుల్ ఇదీ… (గత మూడు వారాలతో పోలిక)…

telugu news

కానీ ఆ విశ్లేషణ సరికాదేమో… ఎందుకంటే..? నిజానికి మీడియా ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నప్పుడే ఊపు మీద ఉంటుంది… జనం కూడా ఎక్కువగా చూస్తుంటారు… కానీ ఇది భిన్నంగా ఉంది… బీఆర్ఎస్ ప్రధానంగా వాళ్లు పరోక్షంగా నిర్వహించే యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియా క్యాంపెయిన్ మీదే ఆధారపడుతోంది కాంగ్రెస్ మీద దాడికి…

టీన్యూస్ బార్క్ లెక్కల్లాగే… నమస్తే తెలంగాణ సర్క్యులేషన్ లెక్కలు కూడా ఓసారి చూద్దామంటే… ఫాఫం, ఏబీసీ నుంచి బయటికొచ్చేశారు కదా… సరేగానీ… అప్పట్లో ఓదశలో టీవీ9 చానెల్‌ను ఎన్టీవీ దాటేసింది కదా… కొన్నాళ్లు బలమైన పోటీ నడిచింది కదా… కానీ ఇప్పుడు..?

ఏం తేడా కొట్టిందో గానీ… టీవీ9 రేటింగ్స్‌లో ఎన్టీవీ రేటింగ్స్ సగం.,. ఎన్టీవీ రేటింగ్స్‌లో టీవీ5 చానెల్ రేటింగ్స్ దాదాపు సగం… ఒక దశలో టీవీ5 కూడా టాప్ త్రి పొజిషన్ ఎంజాయ్ చేసింది… కానీ ఫాఫం ఇప్పుడది టీవీ9కు అల్లంత దూరంలో ఆగిపోయింది… నాలుగో ప్లేసులో ఉన్న ఏబీఎన్ ఇంకాస్త బిగిస్తే టీవీ5 ను కొట్టేస్తుంది…

అదేమిటో గానీ… హైదరాబాద్ బార్క్ కేటగిరీకి వస్తే మాత్రం ఎన్టీవీ మరీ ఆరో స్థానంలో ఉంటోంది… బిగ్‌టీవీ కూడా క్రమేపీ పుంజుకుంటోంది… ఇంట్రస్టింగ్… సాక్షిటీవీ పడిపోదు, ఎదగదు… అలా ఆరేడు స్థానాల్లో అలా కొట్టుకుంటూ ఉంటుంది…!! పార్టీల పట్ల ప్రజాదరణ సదరు పార్టీ న్యూస్ చానెల్ మీద రిఫ్లెక్టవుతుంది అనేది నిజమైతే మరి సాక్షి టీవీ మరీ 11 సీట్ల స్థాయిలో లేదు కదా… సో, ఆ విశ్లేషణ కరెక్టు కాదు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పేరుకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ … గణేష్ బీడీ పొగ… శ్రీశ్రీశ్రీ రాజావారి లంకచుట్ట పొగ…
  • ఇండియాలోకెల్లా హయ్యెస్ట్ పెయిడ్ ఫిమేల్ టీవీ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?!
  • వేములవాడ ఆవులు, కోడెల ఉసురు ఎవరికి తగలబోతోంది..?!
  • ఈవారం తెలుగు టీవీ వినోద చానెళ్ల స్థితిగతులు, రేటింగులు ఇవీ…
  • తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!
  • బాలయ్య దంచూదంచూ అని దరువేశాడు గానీ… దంచికొట్టింది భానుమతే…
  • ఫాఫం అనసూయ..! కాస్త మారిందేమో అనుకున్నారా..? నో, నెవ్వర్..!!
  • ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…
  • దిక్కుమాలిన క్షుద్రానువాదాలు… దరిద్రపు పర్యవేక్షణ అంటే ఇదే…
  • సిల్క్ స్మిత హర్టయ్యింది… ఆ గ్రేట్ కొరియోగ్రాఫర్ కెరీర్ క్లోజయ్యింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions