ఎట్టకేలకు పృథ్వి శెట్టి బిగ్‌బాస్ హౌజు నుంచి తరిమివేయబడ్డాడు… శుభం… ఒక ఉన్మాదిని బయటికి పంపించి మిగతా హౌజ్‌మేట్లు ప్లస్ ప్రేక్షకులు తేలికగా ఊపిరి పీల్చుకునేలా చేశారు బిగ్‌బాస్ టీం… కానీ ఈ పని మొదట్లోనే చేయాల్సింది… కాదు, హౌజులోకి ఎంపికే శుద్ధ తప్పు…
ఎప్పుడు చూసినా సిగరెట్లు తాగుతూ… లేడీ కంటెస్టెంట్లతో పులిహోర కలుపుతూ… గేమ్స్, టాస్కులు వచ్చినప్పుడు ఓ ఉన్మాదిలా కేకలు వేస్తూ… పైపైకి దూసుకొస్తూ… ఓ అరాచకం… మొదట్లో అందరూ మణికంఠను మెంటల్ కేసు అని నిందించారు గానీ… పృథ్వి మణికంఠకు తాత…
మాటతీరు కూడా అంతే… మొన్న అవినాష్‌ను ఉద్దేశించి… ‘‘మరి నీ భార్యనే పంపించలేకపోయావా’’ అని ఓ పిచ్చి కూత కూశాడు… సందర్భం ఏదైనా సరే, తనకు లాంగ్వేజీ సరిగ్గా రాకపోయినా సరే… ఆ పిచ్చి కూతల్ని ప్రేక్షకులు పాజిటివ్‌గా తీసుకోలేకపోయారు… ప్రేరణను టార్గెట్ చేసిన తీరు, మాటలు కూడా ఫూలిష్… రఫ్ మ్యాడ్ లుక్… ఆ జుట్టు, ఆ గడ్డం తన మూఢత్వానికి అదనపు ఆకర్షణ…
Ads
నిజానికి బిగ్‌బాస్‌కు ఇలాంటోళ్లే కావాలేమో… ఇన్నిరోజులూ కాపాడుతూ వచ్చాడు… ఇప్పుడు కూడా తన మ్యాడ్‌నెస్‌కు కొన్ని వోట్లు బాగానే పడ్డయ్… సేఫ్‌గా ఉండాల్సింది… కానీ తనకన్నా హరితేజ, టేస్టీ తేజ పూర్ వోటింగులో ఉన్నారు… లాస్ట్ టూ కేరక్టర్స్ వాళ్లే… వాళ్లలో ఒకరిని గెంటేయాల్సింది… కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చినప్పుడే వాళ్లకు మూణ్నాలుగు వారాల మినిమం హౌజ్ స్టే హామీ ఇచ్చినట్టున్నారు బిగ్‌బాస్ టీం… లేకపోతే ఈమాత్రం వారం పది రోజుల కోసం వాళ్లెందుకు వస్తారు..?
సో, వాళ్లను కాపాడాలి, దాదాపు అన్ని ప్రైవేటు వోటింగు సైట్లలోనూ ఆ ఇద్దరికే లీస్ట్ వోటింగ్… ఐనాసరే, వాళ్లను కాపాడి, వాళ్లకన్నా కాస్త పైన ఉన్న పృథ్విని తరిమేశారు… అంతేకదా… వోట్లు అనేవి పైకి కనిపించేవి… కానీ స్క్రిప్టెడ్ గేమ్ ప్రకారం ఎవరెవరిని పంపాలో, ఎవరెవరిని కొనసాగించాలో ముందస్తు ఒప్పందాల మేరకే జరుగుతూ ఉంటాయి…
ఉడిపికి చెందిన పృథ్వి టీవీ సీరియల్ నటుడు… నిజానికి ఎవరో వేరే కంటెస్టెంటు హౌజులోకి రావాలట… సమయానికి తను జబ్బుపడటంతో ఈ పృథ్విని తన ప్లేసులో తీసుకొచ్చారట… అదీ కథ… సో, ఈమాత్రం 50 రోజులు తనను కంటిన్యూ చేయడమే ఎక్కువ… ప్రేక్షకుల్లోనూ తన పట్ల నెగెటివిటీ పెరుగుతోంది, ఆటకు మైనస్‌గా మారుతున్నాడు అని తేలేసరికి ఇక వదిలించేసుకుంది బిగ్‌బాస్ టీం…
అఫ్‌కోర్స్… నయని పావని, గౌతమ్ కృష్ణ, మణికంఠ… ఇంకా చాలా మెంటల్ కేసులున్నాయి హౌజులో… మొన్న నైనిక, నిన్న సీత, నేడు పృథ్వి… విష్ణుప్రియకు మళ్లీ కన్నీళ్లే…!!
Share this Article