Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సంక్రాంతి సినిమాల్లో… చీప్, డిఫరెంట్, సేఫ్, ఫన్ ప్రమోషన్ వెంకీదే..!

January 11, 2025 by M S R

.

మరీ గిన్నీస్ రికార్డు రేంజులో పే–ద్ద కటౌట్లు ఏమీ లేవు… భారీగా ప్రిరిలీజ్ ఫంక్షన్ లేదు… అట్టహాసపు ఎలివేషన్లు లేవు… ఈ సంక్రాంతి సినిమాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా టీం మాత్రమే చౌకగా, భిన్నంగా ప్రమోషన్ సాగించుకుంటోంది…

నిజామాబాద్ ప్రమోషన్ మీటింగు కూడా పెట్టి ఉండకపోతే బాగుండేది… అక్కడ తెలంగాణ జనాన్ని కించపరిచేలా దిల్ రాజు వ్యాఖ్యలు ఓ బ్లండర్… రామలక్ష్మణుడు ఫిక్షనల్ కేరక్టర్స్ అంటూ హోస్ట్ శ్రీముఖి పిచ్చి కూతలు మరో బ్లండర్.., (పబ్లిక్ సినిమా ఫంక్షన్లకు సుమ ఎంత బ్యాలెన్స్‌డ్, ఎనర్జిటిక్ హోస్టో ఇలాంటప్పుడే అర్థమవుతుంది…)

Ads

అది వదిలేస్తే… మొత్తం టీమ్ పాపులర్ టీవీ షోలను వాడుకుంటోంది… అసలే సంక్రాంతి పండుగ కదా… వినోద చానెళ్లు స్పెషల్ షోలను జనంలోకి వదులుతుంటాయి… పండుగవేళ జనం కూడా టీవీల్లో ఈ షోలను ఎంజాయ్ చేస్తుంటారు… అదుగో వాటిని తమ సినిమా ప్రమోషన్లకు చక్కగా వాడుకుంటోంది ఈ సినిమా టీం…

దాదాపు ప్రతి షోలో హీరో వెంకటేష్‌తోపాటు దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్లు ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి, సంగీత దర్శకుడు భీమ్స్ కూడా పాల్గొంటూ… ఆ షోలలో ఫన్ మరింత పెంచుతున్నారు… అల్లరల్లరి చేస్తున్నారు… అనిల్ రావిపూడి స్వతహాగా మంచి సెన్సాఫ్ కామెడీ ఉన్నవాడే కదా…

వెంకటేష్ ఈ రేంజులో ఎక్కువ షోలకు స్వయంగా హాజరవుతూ, ఫన్ జనరేట్ చేస్తూ, సినిమా ప్రమోషన్ చేస్తున్న తీరు ఇదే ప్రథమం కావచ్చు బహుశా… సినిమా కూడా తక్కువ ఖర్చుతో (వేరే రెండు సినిమాలతో పోలిస్తే) వేగంగా 72 రోజుల్లోనే పూర్తిచేయడం దర్శకుడి సరైన ప్లానింగే…

ఐశ్వర్య, మీనాక్షి కూడా షోలలో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తూ, ఆయా షోలను ఎంజాయ్ చేస్తున్నారు… (కైరా అద్వానీ, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్‌లకు భిన్నంగా…) సంక్రాంతి వేడుక అని స్టార్ మాటీవీ ప్రోమో చూస్తుంటే… శ్రీముఖి హైపిచ్ అరుపులు తప్ప మిగతావన్నీ ఆసక్తికరంగా ఉంది… స్టార్ మా టీవీ సీరియళ్లు, బిగ్‌బాస్ కంటెస్టెంట్లు, ఇతర ఆస్థాన కళాకారులందరూ… చివరకు యాంకర్ ప్రదీప్ సహా కనిపిస్తున్నారు… చాన్నాళ్లయింది ప్రదీప్‌ను టీవీ తెర మీద చూసి…

అదేదో సినిమా చేస్తున్నాడు కదా, షూట్ అయిపోయినట్టుంది… మళ్లీ బుల్లి తెర మీద బిజీ అవుతాడేమో… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… ఎక్కువ రీచ్‌తో, ఎక్కువగా వేగంగా జనంలోకి వెళ్లేలా సోషల్ మీడియాను, టీవీ షోలను, పాపులర్ సోషల్ మీడియా, యూట్యూబ్ షోలను చౌకగా, సరైన రీతిలో వాడుకుంటే…, నిజానికి భారీ బహిరంగసభలు, ఫ్యాన్స్ ఉన్మాద పోకడలు, భారీ వ్యయాలు అక్కరలేదు అని చెప్పడం…!

ఎందుకు మాస్ గ్యాదరింగులు… జనానికి ప్రాణాంతకం… గేమ్ చేంజర్ సినిమా ఫంక్షన్ నుంచి తిరిగి వెళ్తూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు… అంత ఖర్చుతో అట్టహాసపు ప్రమోషన్ నిర్వహిస్తే తీరా సినిమా తుస్… సంధ్య థియేటర్ తొక్కిసలాట విషాదం చూశాం కదా, వీలైనంతవరకూ ఫ్యాన్స్ గ్యాదరయ్యే సినిమా ఫంక్షన్లను నిరుత్సాహపరచాలి…

(తిరుపతి వైకుంఠ ఏకాదశి టోకెన్ల తొక్కిసలాట విషాదం నేపథ్యంలో డాకూ మహారాజ్ అనంతపురం ప్రిరిలీజ్ షో రద్దు చేసి, హైదరాబాద్‌లోనే ఓ హోటల్‌లో ప్రిరిలీజ్ కమ్ ట్రెయిలర్ లాంచ్ లాంఛనప్రాయంగా ముగించారు… గుడ్…)

గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో పోలిస్తే డాకూ మహారాజ్ కాస్త భిన్నం… ట్రెయిలర్ల మీదే ఆధారపడ్డట్టున్నారు ప్రమోషన్ కోసం… అఫ్‌కోర్స్ మూడు సినిమాలకూ ఆహా అన్‌స్టాపబుల్ షోలలో ప్రమోషన్ వర్క్ చేసినా… డాకూ మహారాజ్ ఎపిసోడ్ కాస్తా ఓ వివాదంతో ఎక్కువ క్లిక్కయింది… ఈ సినిమా ప్రమోషన్ నెగెటివ్ కోణంలో సాగుతోంది… జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ బాలకృష్ణ అన్నట్టుగా… ఫ్యాన్స్ నడుమ, సోషల్ మీడియాలో…

ఈ వివాదంలో కుటుంబపరంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సినిమాలపరంగా, వారసత్వపరంగా… రకరకాల షేడ్స్ ఉన్నయ్… టీవీ షోలతో చౌక ప్రచారం అనుకున్నాం కదా… నిజమే, ఈ ప్రమోషనల్ స్పెషల్ షోలు ఉభయతారకం… టీవీలకు రేటింగ్స్ వస్తాయి, వాళ్లకూ ఉపయోగం… అఫ్‌కోర్స్, సినిమాలకూ ఉపయోగం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆమెపై హానీట్రాప్… పడిపోయింది… మన రహస్యాలన్నీ చెప్పేసింది…
  • పురూలియా…! అదొక పెద్ద మిస్టరీ… జవాబుల్లేవు… ఆశించడమూ వేస్ట్..!!
  • అందరూ రాజ్‌పుష్పలు కాలేరు పుష్పా… అనవసర ప్రయాస, అగౌరవం…
  • సాక్షిలో చైనా సరుకు..! ఈ కరణ్ థాపర్ ఘొప్ప వ్యాసం చెప్పేది ఇదే..!
  • ఒక ధర్మబద్ధ ఫ్యూడల్ నియంత..! ఒక బొబ్బిలి బ్రహ్మన్న పాత్ర…!
  • ఓ ధూర్త శతృవు… ఓ మూర్ఖ ప్రధాని… ఈ తరం చదవాల్సిన కథ…
  • ఎద్దులతో ఓ జంట అనుబంధం…! తమిళ సినిమాకు కాదేదీ కథకనర్హం..!
  • ఈ సైకో రేపిస్ట్ ఎన్ని హత్యాచారాలు చేస్తేనేం… ఇంకా బతికే ఉన్నాడు…
  • గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…
  • ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions