ముందుగా అనుకున్నదే… పొన్నియిన్ సెల్వన్ ఫస్ట్ పార్ట్ తమిళంలో తప్ప ఎక్కడా ఆడదని..! కారణం మణిరత్నం ఉన్నదున్నట్టుగా తమిళ ప్రైడ్ అన్నట్టుగా సినిమాను తీశాడు… ఎప్పటిలాగే ఇతర భాషల డబ్బింగ్ నాణ్యత పట్టించుకోలేదు, ఎస్, తమిళులకు అది గొప్ప చరిత్ర… అందులో కాల్పనికత కూడా ఉంది… ఫేమస్ తమిళ్ రైటర్ కల్కి కృష్ణమూర్తి పలు భాగాలుగా రాసిన పొన్నియిన్ సెల్వన్ నవలలోనే మూడునాలుగు సినిమాలకు సరిపడేంత సరుకుంది… కానీ అది ఇతర దక్షిణాది రాష్ట్రాల ప్రజలకే ఎక్కదు, ఇక హిందీ వాళ్లకు ఎలా ఎక్కుతుంది..?
పైగా ఆ పేర్లు, ఆ బంధాలు, ఎవరికి ఎవరేం అవుతారో అర్థం గాక జుత్తు పీక్కుంటాం… బట్, తమిళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలోకి ఎక్కింది… విక్రమ్, ఐశ్వర్యా రాయ్, త్రిష, కార్తి, జయం రవి, ప్రకాష్ రాజ్, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ్ల తదితరుల ఇమేజ్ కూడా సినిమాకు కొంత ఉపయోగపడింది… ఐశ్వర్యారాయ్ తప్ప మిగతా వారంతా ఎక్కువగా తమిళముద్ర పడిన నటీనటులే… రెండో పార్ట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు… ఫస్ట్ పార్ట్ తాలూకు హైప్ ఇప్పటికీ కొనసాగుతోంది… ఇదంతా ఇప్పటివరకూ ఉన్న సీన్…
రెండో పార్ట్ ముందే ప్రకటించి ఉన్నారుగా… చాలావరకు షూటింగ్ కూడా మొదటి పార్ట్ షూటింగ్ సమయంలోనే కంప్లీట్ చేశారు… తగిన డబ్బింగ్, ఎడిటింగ్ చూసుకుని, ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేయడమే ఇక… కానీ రెండో పార్ట్ నిరవధికంగా వాయిదా వేశారు… ఫలానా రోజు విడుదల చేస్తామని చెప్పలేని స్థితి… కారణాలు ఎవరూ అధికారికంగా చెప్పరు గానీ… పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు, ఆ రషెస్ చూస్తున్నప్పుడు అసలు మణిరత్నంకే పలుచోట్ల సీన్లు నచ్చలేదట…
Ads
మరి ఇప్పుడు ఏం చేయాలి..? మణిరత్నం కొన్ని సీన్లను మళ్లీ షూట్ చేద్దామని అంటున్నాడు… మామూలుగా ఏ రాజభవనం తాలూకు సెట్లలో అయితే పర్లేదు… కానీ ఆ కొన్ని సీన్లు తీయాలంటే భారీ వ్యయం, ప్రయాస తప్పదు, సంబంధిత నటీనటుల డేట్లు కావాలి, అవి అంత వీజీ కాదు… దాంతో ప్రస్తుతానికి సినిమాను వాయిదా వేశారు…
నిజానికి ఏప్రిల్ 18న పీఎస్-2 రిలీజు ఉంటుందని గతంలో చెప్పారు… ఇప్పుడు ఆ తేదీన వీలు కాదు… మణిరత్నం తన జీవితాశయంగా చెప్పుకునే ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతదర్శకత్వం… తను పెట్టుబడి కూడా పెడుతున్నాడు… లైకా ప్రొడక్షన్స్ సపోర్ట్ కూడా ఉంది… అందుకే సరిగ్గా రాసి సీన్లను మళ్లీ షూట్ చేద్దమానేది మణిరత్నం పట్టు…!!
Share this Article