Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆమె ప్రేమ వివాహం… బంధుగణం మొత్తానికి శిరోముండనం, శిక్ష…

June 13, 2025 by M S R

.

ఆ ఫోటో చూస్తుంటే… ఆ వార్త చదువుతుంటే… ఆశ్చర్యం కాదు, ఓ ఆందోళన… ఇంకా ఏ కాలంలో ఉన్నాం మనం..? ఇంకెన్నాళ్లు ఉండిపోతాం ఈ చీకట్లలో అని…

విషయం ఏమిటంటే… ఒడిశా… రాయగడ జిల్లా, కాశీపూర్ సమితి… గోరఖ్‌పూర్ పంచాయతీ… అసలే కట్టుబాట్లు ఎక్కువ… కులపెద్దలు గీసిందే గీత, చెప్పిందే శాసనం…

Ads

ఆ ఊళ్లో ఓ అమ్మాయి, ఆమె ఆదివాసీ… ఓ అబ్బాయిని ప్రేమించింది… తను షెడ్యూల్డ్ కేస్ట్… పెళ్లి చేసుకోవాలనుకున్నారు… ఆ యువతి తరఫు బంధువులు అంగీకరించలేదు, ఊరి కట్టుబాట్లకు మేం అవస్థలు పడాల్సి వస్తుందని ఆమెను హెచ్చరించారు…

ప్రేమ ముందు తల్లిదండ్రులు వారింపులు, బంధుగణం అంక్షలు, సమాజం బెదిరింపులు గట్రా పనిచేయవు కదా… ఆమె ఎదిరించింది… ఇద్దరూ ఎక్కడో పెళ్లిచేసుకుని ఊరికి వచ్చారు… ఇంకేముంది..?

ఆ యువతి ‘చేసిన పాపానికి’ ఆమె తరఫు బంధువులందరూ ప్రాయశ్చితం చేసుకోవాలని ఊరిపెద్దలు తీర్మానించేశారు… లేదంటే శాశ్వతంగా వెలివేస్తామని బెదిరించారు… ఇక తప్పేదేముంది..? వెలిని ఎదుర్కోవడంకన్నా ఆమె చేసిన తప్పుకి తామే పరిహారం చెల్లించుకుంటామని ముందుకొచ్చారు…

love

పరిహారం అంటే..? తప్పయిందని అంగీకరిస్తున్నట్టుగా ఆమె తరఫు బంధువులందరూ గుండ్లు గొరిగించుకున్నారు… పైన ఫోటో అదే… కొన్ని జంతువులను బలివ్వాలి… అదో కర్మ… అంతేకాదు, ఆ జంటకు శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి…

అంటే వాళ్లు మరణించినట్టే పరిగణించాలన్నమాట… ఇక వాళ్లతో మాటామంతీ గట్రా ఏమీ ఉండవు… ఇదేం కట్టుబాటు..? ఇదేం పద్ధతి..? సరే, కట్టుబాటును ఆమె ధిక్కరించింది, అది ఆమె వ్యక్తిగతం… ఎవరినో పెళ్లి చేసుకుంది, తన ఇష్టం… దానికి మొత్తం ఆమె బంధుగణాన్ని శిక్షించడం ఏమిటి..?

పోనీ, ఆమె చెబితే విన్నదా..? వినలేదు… ఊరి కట్టుబాటు గురించి చెప్పారు, ఐనాసరే, డోన్ట్ కేర్ అనేసింది… మీ బాధ మీరు పడండి అని నిష్కర్షగా చెప్పేసింది… పోనీ, పెళ్లి చేసుకుని అట్నుంచి అటే వెళ్లిపోయారా..? లేదు, ఊళ్లోకే వచ్చేశారు…

సరే, వచ్చారు… వాళ్ల బతుకు వాళ్లు బతుకుతారు, నడుమ ఆమె తరఫు వాళ్లకు శిక్ష దేనికి..? వాళ్లు చేసిన తప్పేమిటి..? ఈ అవమానకరమైన శాస్తిని వాళ్లెందుకు భరించాలి..? ఏమో, అంతా అనాగరికం… మనం చాలా చీకట్ల నుంచి బయటపడటం లేదు… ఇంకెన్నాళ్లో తెలియదు..!! ఈ ఘటన గురించి మాకు తెలియదు అన్నారట ఆ ఏరియా పోలీసులు… అదీ కథ…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • విధి… ఆ సీటొక్కటే విరిగి దూరంగా పడి బతకడం అబ్బురమే…
  • అంతటి ఎన్టీయార్‌కే తప్పలేదు… పాపం కొమ్మినేని ఎంత..?
  • నీలి శివుడా… పాహిమాం… ఈ దిక్కుమాలిన క్రియేటివ్ ఫ్రీడం నుంచి…!!
  • ఆమె ప్రేమ వివాహం… బంధుగణం మొత్తానికి శిరోముండనం, శిక్ష…
  • అదీ ఇజ్రాయిల్ ప్లానింగ్, ఆపరేషన్ అంటే… అణు మొక్కను పీకేసింది…
  • తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక ఆంధ్ర వ్యక్తి నవ్వులపాలు చేసేశాడా?
  • “ఊహలు గుసగుసలాడే… నా హృదయము ఊగిసలాడే…”
  • ఆత్మలు ఆవహించే కేరక్టర్ కాదు… మంత్రగత్తె అసలే కాదు… మహేంద్రజాలిని…!!
  • అసలే మోహన్ బాబుకి ఆవేశం , మొండితనం , కోపం జాస్తి ..!
  • ఈమె 6 నెలల ముందే చెప్పింది విమానప్రమాదం గురించి… ఇంకా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions