Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆకాశవాణిలో పుష్ప సినిమా సంక్షిప్త శబ్ద చిత్రం వచ్చిందట పెట్టండర్రా

December 27, 2024 by M S R

.

అల్లుడికి సైకిల్, టేప్ రికార్డర్ పెట్టాల్సిందే !!

**
# అదేంటి మావాడు పోస్టాఫీసులో రన్నర్ గా పంజేస్తున్నాడు.. పర్మినెంట్ కాదుగానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం.. కట్నం కింద .సైకిల్.. నేషనల్ టూ ఇన్ వన్ టేప్ రికార్డర్ ఇవ్వాల్సిందే
# ఒరేయ్ రాముడూ బామ్మ సీరియస్ .స్టార్ట్ ఇమీడియట్లి అని హైదరాబాదులో మీ అన్నకు టెలిగ్రామ్ పంపరా

Ads

# ఒసేయ్ గీతా..నీకు కొత్త పుస్తకాలు ఎందుకే.. మీ అక్క పాత బుక్స్ ఉన్నాయిగా అవి కొత్త అట్టలు వేసుకుని వాడుకో
# మొన్న దసరాకే లాగు చొక్కా కొన్నాను .మళ్ళీ సంక్రాంతికి కొనాలంటే ఎలా..మళ్ళీ వచ్చే సారి చూద్దాం లే

# చుట్టాలొచ్చారు.. పప్పు..గుడ్డు వండి అప్పడాలు వేయించాలి
# ఒరేయ్ చింటూ సైకిల్ బాగా కడిగి..తుడిస్తే నీకు సాయంత్రం ఓ అరగంట తొక్కనిస్తా
# ఢిల్లి వెళ్ళాలంటే మాటలా .రైల్లో మూడురోజులు పడుతుంది మరి

# ఆకాశవాణిలో పుష్ప సినిమా సంక్షిప్త శబ్ద చిత్రం వచ్చిందట పెట్టండర్రా
# ఈసారి పెళ్లి బంతిలో మొదట వేసే లడ్డూను జేబులో దాచేసి ఇంకో లడ్డూ అడగాలి
# పెళ్లవ్వగానే ఆయన వెళ్ళిపోయారు. లెటర్స్ వస్తున్నాయి కానీ ఆయన్ను చూస్తే బావుణ్ణు.. ఉత్తరాల్లో మనిషి కనిపిస్తే ఎంత బావుణ్ణు

# అసలు ఈ పట్ట పగలు ఫుల్ చార్జి పే చేసి ఫోన్ ఎందుకు చేయాలి..రాత్రి పది తరువాత ఐతే హాఫ్ చార్జి ఉండేదిగా
# ఒరేయ్ నాగులూ నాన్న ప్యాంట్ కాస్త సైజ్ చేసి వాడుకోరా నీకు సరిపోతుంది
# అమెరికాలో జేబులో పెట్టుకునే ఫోన్లు ఉన్నాయట తెలుసా

# ఎన్నైనా చెప్పు.. రాజ్ దూత్ అంబాసిడర్.. ఈ రెండూ భూమి ఉన్నంత వరకూ ఉంటాయ్
# బ్యాంకులో ఖాతా ఉండడం అంటే మాటలా.. అమ్మో ఆయనకు ఎంత పరపతి..
# మేం బ్లాక్ అండ్ వైట్ టివి మాత్రమే ఇస్తాం..కలర్ టీవీ ఇవ్వలేం.. సంబంధం క్యాన్సిల్ ఐనా ఫర్లేదు.. మేం తూగలేము

# మన ఊళ్లో సైకిళ్ళు అద్దెకు ఇచ్చినట్లే బొంబాయిలో కార్లు కూడా అద్దెకు ఇస్తారట
# రామారావు అప్పుడే బజాజ్ చేతక్ కోసం మూడు వేలు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేశాడట.. అంటే ఆయన బయటి ఆదాయం ఎంత ఉందో మరి
# ఎదురింటి లక్ష్మి గోద్రెజ్ పఫ్ ఫ్రిజ్ కొనింది.. మొగుడు బానే సంపాదిస్తున్నాడు

# రాజూ పండక్కీ అక్కాబావ వస్తున్నారు రిక్షాలో వెళ్లి స్టేషన్ నుంచి వాళ్ళను తీసుకురారా..
# నేను ఎంత రాత్రయినా కానీ మీ అన్నయ్య వచ్చాకే వంట చేస్తాను.. మాకు గ్యాస్ పొయ్యి ఉందిగా వదినా ..
******
******
*మన్మోహన్ . పీవీ అనే ఇద్దరు లేకుంటే బహుశా దేశం ఇంకా ఇలాగేనుండేదేమో*……. కొప్పర గాంధీ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మొగిలయ్యా, బాధ పడొద్దయ్యా… పాడులోకం ఇంతేనయ్యా…!
  • ప్రతి తెలంగాణ బిడ్డ ఓసారి నెమరేసుకోవాల్సిన ‘కన్నీటి కాలం’ ఇది…
  • ఆమె కథలో బోలెడు నాటకీయత… కానీ ‘క్రియేటివ్ ఫ్రీడమ్‌’పైనే భయం…
  • ప్చ్… చిరంజీవి, రాఘవేంద్రరావు, విజయశాంతి లెవల్‌లో ఆడలేదు…
  • కేటీయార్ ‘యాప్’సోపాలు..! రైతుల సౌకర్యం, సౌలభ్యమూ సహించవా..?!
  • కదులుతున్న బెంగాలీ డొంక…. కూలుతున్న మమత ఫేక్ వోట్ల పునాదులు…
  • పాన్ ఇండియా కాదు.. ! తెలుగులో మాత్రమే అఖండ తాండవం.. !!
  • యూదులు ఎక్కడున్నా ప్రాణభయమే…! అసలు ఏమిటీ హనుఖ్క..!?
  • …. అలా ఈనాడుపై ఉదయం, ఆంధ్రజ్యోతి ‘పగ తీర్చుకున్నాయి’…
  • సీఎం జనంలో ఉంటే… అపహసించే ప్రతిపక్షం చరిత్రలో ఇదే తొలిసారి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions