Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆలియాభట్… బాలీవుడ్‌ రాణి గంగూబాయ్… అందరికీ ఆమే కావాలి…

February 5, 2022 by M S R

పుష్ప బన్నీకి ఆలియా కావాలి… జూనియర్‌కు ఆలియా కావాలి… అందరికీ ఆమే కావాలి… ఆల్‌రెడీ ఆర్ఆర్ఆర్‌లో తనే మెరుపు… ఇప్పుడు గంగూబాయ్… ఇంకా చేతిలో బ్రహ్మాస్త్ర, డార్లింగ్స్, రాకీ ఔర్ రాణికి ప్రేమ కథ… ఇవి కాదు, ఆమె సంతకాలు పెట్టాలే గానీ, గేటు బయట బోలెడు మంది నిర్మాతల క్యూ… బక్కపలచగా, ఎండుకుపోయినట్టుగా, ఇప్పటికీ ఓ టీనేజ్ పిల్లలా కనిపించే ఆలియా భట్ ఈరోజు బాలీవుడ్ యువరాణి… సారీ, బాలీవుడ్ అనే కామాటిపుర రాజ్యానికి ఆమె ఓ గంగూబాయ్…

ఆమె మీద బోలెడు జోకులు… లౌక్యం తెలియదు, ప్రాపంచిక అంశాల మీద నాలెడ్జ్ లేదు అంటూ ఆలియాను మిస్ జడ్జి చేస్తారు… కానీ ఒక్కసారి సెట్‌లో అడుగుపెడితే ఆమె మహానటి… తిరుగులేదు… ఒక్కోసారి ఆశ్చర్యమేస్తుంది… నిజానికి బాలీవుడ్….. ఓ మెరుపుల కార్ఖానా… బోలెడు మంది వస్తుంటారు, పోతుంటారు… వెలిగిపోతుంటారు, మాడిపోతుంటారు… అదొక ప్రపంచం… స్థూలంగా చూస్తే అది అథోప్రపంచం… మాఫియా ప్రభావం, బంధుప్రీతి, అనేక వివక్షలు, శ్రమ దోపిడీ, ఆర్థిక దోపిడీ ఎట్సెట్రా అన్నీ… లైంగిక దోపిడీ సరేసరి… ఇక్కడ నెగ్గుకురావడం అంత వీజీ కాదు… మహేష్ భట్ అనబడే ఒకానొక అవలక్షణమూర్తి బిడ్డ ఈ ఆలియా భట్…

ఇరవయ్యేళ్ల క్రితం బాలనటి… తరువాత 18, 19 ఏళ ప్రాయం నుంచే సినిమాలు… వేరే లోకం ఏమీలేదు… షూటింగ్ స్పాట్లు, స్టార్ట్, యాక్షన్, కట్ అరుపులు… మేకప్పులు… ఫోటోషూట్లు… అదే ఆమె జీవితం… నో, నో, ఆమె మీద జాలిపడాల్సింది ఏమీ లేదు… ఆ బాలీవుడ్ బురదలో పుట్టిన కమలం… ఎంట్రీ వరకూ డాడీ పేరు… తరువాత తనే నిలబడింది… ఈరోజు మహేష్ భట్ జస్ట్, అలియా భట్ తండ్రి… దటీజ్ ఆలియా…

Ads

ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా..? ఆమె నటించిన గంగూబాయ్ ట్రెయిలర్ రిలీజైంది… ఈ మెతుకు చాలు, సినిమా అంచనా వేయడానికి… ఇరగ్గొట్టేసింది… అసలే సంజయ్ లీలా భన్సాలీ… ఆ డైలాగులు, ఆ పాత్ర చిత్రీకరణ తరీఖ చూస్తుంటే ఆలియా భట్‌కు ఇప్పుడు సరైన చాలెంజింగ్ పాత్ర దొరికినట్టు అనిపించింది… రెండొందల శాతం వాడుకుంది… ఈ కథనం గంగూబాయ్ ట్రెయిలర్ సమీక్ష కాదు… ఆలియా ప్రస్థానం చూస్తుంటే కలిగే ఆశ్చర్యాన్ని షేర్ చేసుకోవడం…

ప్రస్తుతం బాలీవుడ్ తారల్లో నంబర్ వన్ ఎవరు..? పైపైన చూస్తే దీపిక పడుకోన్, ప్రియాంక చోప్రా, శ్రద్ధాకపూర్ ఎట్సెట్రా ఎవరూ కాదు… నిస్సందేహంగా ఆలియా భట్..! రెమ్యునరేషన్ లెక్కలు కాసేపు వదిలేయండి… డిమాండ్, పాపులారిటీ, దర్శకులు ఎవర్ని ప్రిఫర్ చేస్తున్నారు కోణాల్లో చూస్తే… ఆలియా నంబర్ వన్ ఇప్పుడు..! బాలీవుడ్ ఏ ప్రిస్టేజియస్ ప్రాజెక్టు తీసుకున్నా సరే… ఫస్ట్ చాయిస్ ఆలియా… ఆమె కాదంటేనే, డేట్స్ లేవంటేనే మరొకరికి వెళ్తుంది ప్రాజెక్టు… అతిశయోక్తి కాదు… అంత పేరు సంపాదించుకుంది… ఇంతా చేస్తే ఆమె సినిమా కెరీర్ వయస్సు జస్ట్ పదేళ్లు… 13 సినిమాలు… ఆమె సాధించింది చాలా ఎక్కువే…!!

alia

ఆమధ్య ఎవరో దారినబోయే దానయ్య ఏడ్చాడు… ఆమెకు రోజుకు లక్ష రూపాయలు ఖర్చవుతోంది అని… హీరోలు అయితే అంతకు పది రెట్లు పెడతారు పడీ పడీ కాళ్లు మొక్కుతూ… కానీ ఆలియా అనేసరికి చీప్ అనుకున్నాడేమో ఫాఫం… ఆమె పేరుతో సినిమాకు వచ్చే కమర్షియల్ వాల్యూ ముందు ఈ ఖర్చులన్నీ బలాదూర్… ఆమె ప్రస్తుతం బాలీవుడ్ మహారాణి అని మరిచిపోయినట్టున్నాడు…

alia

ఎస్, ఆమె బయటి షూటింగుల కోసం ఎటు వెళ్లినా సరే, పర్సనల్ మేకప్ ఆర్టిస్టు, హెయిర్ స్టయిలిస్టు, ముగ్గురో నలుగురో బౌన్సర్లు, పీఏ, సెక్రెటరీ… దాదాపు పది మందిని నిర్మాత పోషించాల్సిందే… ఐనా సరే, నిర్మాత భరిస్తున్నాడు… భరించాలి… అదీ ఆమెకున్న డిమాండ్… ఆమె పర్‌ఫెక్ట్‌గా తన స్టార్‌డమ్ ఎంజాయ్ చేస్తోంది… ఇవన్నీ తెలియదా ఆమెను బుక్ చేసుకుంటున్నప్పుడు..? ఇప్పుడు ఆమె ఆర్ఆర్ఆర్ సినిమాలో చేస్తోంది… ఆమె షూటింగుకు వస్తోంది అంటేనే ఓ వార్త… ఇరగబడి రాసేసుకున్నారు అందరూ… కమర్షియల్ యాడ్స్‌లో ఆమెదే అత్యధిక బ్రాండ్ వాల్యూ…

alia

పిహార్వా… అప్పుడెప్పుడో 1967లో జరిగిన చైనా-ఇండియా యుద్ధం నేపథ్యంలో… బాబా హర్భజన్ సింగ్ అనే వీరజవాను గురించిన కథ… దానికి ప్రజెంట్ ఇండో-చైనా ఉద్రిక్తతనూ కలిపి, ఓ లవ్ స్టోరీ యాడ్ చేసి తీయబోతున్నారనీ… అందులో ఆలియా లీడ్ రోల్ అనీ వార్తలొచ్చినయ్ ఆమధ్య… ఏమైందో తెలియదు…

alia

ఇంతా చేస్తే ఆమె ఇండియన్ కాదు, బ్రిటిష్ పౌరసత్వమున్న నటి… వయస్సు కూడా 30 లోపు… ఇక్కడ చెప్పుకోవాల్సింది మరొకటి ఉంది… గంగూబాయ్ సినిమాను హిందీతోపాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు… ఒక్క తెలుగే దేనికి..? ఎవరైనా స్టార్ హీరో సినిమా అయితే పలు ప్రాంతీయ భాషల్లో డబ్ చేసి, పాన్ ఇండియా సినిమా పేరిట వదులుతున్నారు కదా… మరి ఇదీ అలాగే చేయొచ్చు కదా భన్సాలీ…? డౌటేముంది..? ఖాన్‌ల శకం ముగిసింది… ఇప్పుడు హిందీలో సూపర్ స్టార్ అంటూ ఎవరూ లేరు… పాన్ ఇండియా హీరోయిన్లను ప్రమోట్ చేయొచ్చు కదా…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions