Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Raashi Khanna… మగ తోపులందరినీ దాటేసి నంబర్ వన్ పొజిషన్…

February 23, 2023 by M S R

కొన్ని సర్వేలు అంతే… అంతులేని విస్మయానికి గురిచేస్తాయి… కొన్నిసార్లు సర్వేల్లో మనమే నంబర్ వన్ అని తేలుతుంది… మనమే నమ్మలేక, పదిసార్లు గిచ్చి చూసుకుంటాం… ఫాఫం, రాశిఖన్నా పరిస్థితి అదే… ఒకవైపు ఇప్పటికే 1000 కోట్ల వసూళ్లు సాధించినట్టు, థియేటర్లలో పఠాన్ సినిమా చూడటానికి జనం బారులు తీరుతున్నట్టు, ప్రత్యేకించి దాదాపుగా బట్టల్లేని దీపికను చూడటానికి థియేటర్ల దగ్గర జాతరలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది కదా…

ఆ పఠాన్ సినిమాలో 80 శాతం కథ, స్క్రిప్టు షారూక్ ఖాన్‌దేనట, ఎవరో చెబుతున్నారు ఏదో వార్తలో… ఆ హీరో సెకండ్ ప్లేసు… ఫర్జి అనే ప్రైమ్ వీడియో ఓటీటీలో వచ్చిన వెబ్ సీరీస్‌లో నటించిన హీరోయిన్ ఫస్ట్ ప్లేసట… అదీ ఆమె విస్మయానికి కారణం… ఇప్పుడు షారూక్ ఖాన్ స్పందన ఏమిటో తెలియదు గానీ… ఆ టాప్ 20 లిస్టులో తెలుగు నుంచి రాంచరణ్ తేజ పేరు పదిహేనో ప్లేసులో కనిపిస్తోంది… మిగతా తోపులెవరూ లేరు జాబితాలో…

ఇది ఓ పిచ్చి సర్వే మాత్రం కాదు… ఐఎండీబీ సర్వే… దీనికి ఫిలిమ్ సర్కిళ్లలో కొంత పాపులారిటీ ఉంది… అందుకే ఈ చర్చ… ఐఎండీబీ వీక్లీ ఇండియన్ పాపులర్ సెలబ్రిటీస్ అనే ఫీచర్ ప్రవేశపెట్టింది… అదుగో అందులో రాశిఖన్నా టాపర్… షారూక్ ఖాన్ రన్నర్ అప్… మూడో ప్లేసులో విజయ్ సేతుపతి, నాలుగో ప్లేసులో రెజీనా కసాండ్రా, అయిదో ప్లేసులో ఆదిత్య చోప్రా ఉన్నారు… ఎహె, వీళ్లంతా టాపర్లు ఏమిటి అంటారా..? అలాంటప్పుడు షారూక్ రెండో ప్లేసును కూడా అంగీకరించొద్దు…

Ads

raashi

మీకు టాప్ 20 లిస్టు కావాలా..? 1) రాశీఖన్నా 2) షారూక్ ఖాన్ 3) విజయ్ సేతుపతి 4) రెజీనా కసాండ్రా 5) ఆదిత్యచోప్రా 6) దీపిక పడుకోన్ 7) ఖాదర్ ఖాన్ 8) భువన్ అరోరా 9) అనుపమ్ ఖేర్ 10) కైరా అద్వానీ 11) ఆయేషా కంగా 12) ఐశ్వర్యా రాయ్ 13) షాహిద్ కపూర్ 14) ఖుబ్రా సైట్ 15) రాంచరణ్ తేజ 16) అంజలి శివరామన్ 17) సల్మాన్ ఖాన్ 18) యశ్ చోప్రా 19) డీకే కృష్ణ 20) నోరా ఫతేహి

గ్లోబల్ ఆడియెన్స్ నుంచి చేసిన ఈ సర్వేలో రాంచరణ్ తప్ప వేరే తెలుగు మగ తోపులు, మహిళా తోపులు ఎవరూ లేరేమిటి అనడక్కండి… ముందే చెప్పుకున్నాం కదా, కొన్ని సర్వేలు అంతేనని… మరో ఇంట్రస్టింగ్ విశేషం ఏమిటంటే..? ఫర్జి వెబ్ సీరీస్ అంత ఆదరణ పొందిందా..? అందులో నటించిన ఆరుగురు నటీనటులు ఈ టాప్ 20 లిస్టులో ఉన్నారు… అదనంగా కోక్రియేటర్ కూడా ఉంది… ఆ నటీనటులు ఎవరంటే..? రాశిఖన్నా, విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్, రెజీనా కసాండ్రా, భువన్ అరోరా, ఖుబ్రా సైట్… వందల కోట్ల వసూళ్లు సాధించిన ఇతర తోపులు ఎవరూ ఈ లిస్టులో లేరేమిటో మరి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions