Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నా ప్రియురాలు నీకు భార్య అయ్యాక… మళ్లీ నాకు ప్రియురాలిగా ఎలా..?

February 1, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……. నా ప్రియురాలు మీకు భార్య కాగలదు ; మీకు భార్య అయ్యాక నాకు మరలా ప్రియురాలు కాలేదు . ఇది మన సంస్కృతి అనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా బాపు అందించారు .

మనకున్న గొప్ప దర్శకులలో బాపు , విశ్వనాథ్ ముఖ్యులు . ఈ రాధా కల్యాణంలో బాపు సందేశం విశ్వనాథ్ సప్తపది సినిమా ద్వారా అందించిన సందేశానికి పూర్తిగా భిన్నం . రాధా కల్యాణం సాంప్రదాయ భావానికి పట్టం కడితే సప్తపది విప్లవ భావానికి అభిషేకం చేసింది .

Ads

Of course . రాధా కల్యాణం బాపు స్వంత కధ కాదు . తమిళంలో సక్సెస్ అయిన భాగ్యరాజా సినిమా అంద 7 నాట్కల్ కు రీమేక్ . సప్తపది విశ్వనాథ్ మానస పుత్రిక . ఆయన భావజాల ప్రతీక .

ఈ భావజాల చర్చ ఎలా ఉన్నా 1981 డిసెంబర్లో వచ్చిన ఈ రాధా కల్యాణం బాపు- రమణ- కె వి మహదేవన్-బాబా ఆజ్మీల మేజిక్ . ఈ సినిమాలో గొప్ప అందగత్తె కాని రాధికను ఓ భిన్న అందంలో అద్భుతంగా చూపిన ఆజ్మీ ప్రముఖ హిందీ నటి షబానా ఆజ్మీ తమ్ముడు .

ఈ సినిమాలో ఆమె అల్లరి అంతాఇంతాగా ఉండదు . వయసులో ఉండే కుర్రాళ్ళకు హుషారు కల్పిస్తే , ముసలోళ్ళకు వయసులో చేసిన చిలిపి పనులు గుర్తుకొస్తాయి .

పాల్ఘాట్ మాధవన్ పాత్రలో చంద్రమోహన్ గొప్పగా నటించారు . తర్వాత శరత్ బాబు . అలాంటి సాఫ్ట్ పాత్రలకు పెట్టింది పేరు . ఇతర ప్రధాన పాత్రల్లో పుష్పలత , కాంతారావు , రాధాకుమారి , రాళ్ళపల్లి , టి రాజేశ్వరి , యం బి కె వి ప్రసాదరావు , రావి కొండలరావు , మాస్టర్ రాజా షరీఫ్ ప్రభృతులు నటించారు . ఈ పిల్లోడు చంద్రమోహన్ అసిస్టెంటుగా బాగా నటించాడు .

కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలు శ్రావ్యంగా ఉంటాయి . కొన్నింటిని ఇప్పటికీ ప్రేక్షకులు మరచిపోలేదు . ఒక్క పాట మినహాయించి అన్ని పాటలను సి నారాయణరెడ్డే వ్రాసారు . కలనైనా క్షణమైనా మాయనిదే మన ప్రేమ పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది . చాలా అందంగా చిత్రీకరించారు కూడా . జ్యోతిర్మయి వ్రాసిన చేతికి గాజుల్లా కళ్ళకు కాటుకలా పాట కూడా చాలా బాగుంటుంది .

పాలఘాట్ మాధవన్ పాటంటే ధనాధన్ ఛాన్స్ దొరికితే కానా మహదేవన్ చిటికేయవే చినదానా పాట చంద్రమోహన్ , రాధికల మీద చాలా అందంగా చిత్రీకరించారు . మంచి సాహిత్యం . రాళ్ళపల్లి , టి రాజేశ్వరిల మీద పాటలో రాజేశ్వరి అదరగొడుతుంది . ఏం మొగుడో ఏం మొగుడో వద్దంటే వినడేమి ముద్దుల మొగుడు జానపద శైలిలో బాగుంటుంది .

తమిళ సినిమాకు రీమేక్ అయిన ఈ సినిమా అయిదు కేంద్రాలలో వంద రోజులు ఆడింది . శత దినోత్సవ సంబరాలను విజయవాడ అలంకార్లో నిర్వహించారు . కృష్ణ , కమల్ హసన్లు అతిధులు . 1983 లో హిందీలోకి వో సాత్ దిన్ టైటిలుతో రీమేక్ అయింది . అనిల్ కపూర్ , పద్మిని కొల్హాపురి నటించారు .

1989లో కన్నడంలోకి లవ్ మాది నోడ టైటిలుతో రీమేక్ అయింది . కాశీనాధ్ , శ్రీలత నటించారు . ఒరిజినల్ తమిళంలో భాగ్యరాజా , అంబిక నటించారు . అందరి హీరోయిన్లలో రాధికే నంబర్ వన్ .

బాపు మార్క్ క్లాసిక్ . సినిమా , పాటలు యూట్యూబులో ఉన్నాయి . ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక చూడతగ్గ సినిమాయే . రాధిక అభిమానులయితే మళ్ళా చూడొచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆలీకి ఆది నుంచీ అలవాటే… పిచ్చి కూతలు, ఇప్పుడు తిక్క యాడ్స్…
  • వద్దూవద్దన్నా మద్దతు..! జోసెఫ్ విజయ్ కథే మారిపోయిందిగా..!!
  • చక్రపాణి – నాగిరెడ్డి… బాపు – రమణ… సేమ్ మామ – అప్పు..!
  • బుట్ట నిండా ఇడ్లీలు… రైల్వే స్టేషన్‌లో ఓ పెద్దాయన… ధర కేవలం రూపాయి…
  • మమత తేరుకుంటే… మళ్లీ ఈ దేశభద్రతకే ప్రమాదం… ఎందుకంటే..?
  • ప్రతిపక్ష నేత నిర్మాతగా సినిమా… సీఎం ఇష్టసఖి కథానాయిక… వావ్…
  • తెలంగాణ బీజేపీపై మోడీ అసహనం… అందుకే రేవంత్‌రెడ్డికి ‘సర్టిఫికెట్’…
  • సోలో అయినా… మల్టీస్టారర్ అయినా… వెంకటేశ్ పక్కా డిఫరెంట్…
  • ఈ ద్రవిడ వేణుస్వామికి ఏకంగా ప్రభుత్వ పదవి..! ఎవరీ రిక్కీ రాధన్..?
  • గుజరాత్ వరుస విజయాలు… అహ్మదాబాద్‌కు ఫైనల్ వేదిక… ఏమిటి మాయ..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions