ఈసారి ఎన్నికల్లో అయోధ్య గుడి ప్రారంభం అనేదీ ఓ అంశమే… ఇంటింటికీ చేరవేయబడిన అక్షితల పుణ్యమాని కాషాయశిబిరం హిందూ సంఘటనకు మరింత బలమైన ప్రయత్నం చేయగా… విపక్షాలే బీజేపీ మీద కోపంతో, ద్వేషంతో, రాజకీయ కోణంలో విమర్శలు చేస్తూ, తమంతటతామే రాముడి మీద బీజేపీకి పేటెంట్స్ దఖలు పరుస్తున్నాయి… రాముడిని బీజేపీ కాదు హైజాక్ చేసింది, విపక్షాలే అప్పగిస్తున్నాయి…
ఐతే బీజేపీ మీద కోపంతో రాముడి నుంచి, హిందువుల నుంచి దూరమవుతున్నామనే సోయి విపక్షాల్లో లోపించడం ఇక్కడ ప్రస్తావనార్హం… ఎక్కడ రాముడు మళ్లీ బీజేపీని, మోడీని గద్దెపై కొనసాగిస్తాడో అనే అసహనం నుంచే హఠాత్తుగా రకరకాల సమస్యల్ని తెరమీదకు తీసుకొస్తాయి.,. ఖలిస్థానీ శక్తులు తమ ఎత్తుగడల కత్తులకు పదునుపెడతాయి… అనేక విమర్శలు… గత జనవరిలో ఈ విషాల మీద ముచ్చట ఓ స్టోరీ పబ్లిష్ చేసింది… ఇదీ లింక్…
అయోధ్య రాముడిపై గుమ్మరించడానికి ఇంకేమైనా విషం మిగిలిందా..!!
Ads
చివరకు భావి ప్రధానిగా పిలవబడే రాహుల్ గాంధీ సైతం ఏవేవో అనాలోచిత కుతర్కానికీ, అబద్ధాలకూ తెరతీస్తున్నాడు… తనకు ఎలాగూ ఏమీ తెలియదు, కానీ ఎవరు రాసిస్తున్నారో గానీ, వాళ్లు ఏం రాసిస్తున్నారో కూడా చూడకుండానే ప్రసంగాల్లో ఏదేదో మాట్లాడుతూనే ఉన్నాడు ఈ గాంధీ పేరుతో చెలామణీ అయ్యే సదరు నెహ్రూ కుటుంబ వర్తమాన వారసుడు… ఒక్కసారి ఈ వార్త చదవండి…
‘‘రామాలయ ప్రాణప్రతిష్టకు బీసీలను, ఎస్సీలను ఎందుకు ఆహ్వానించలేదు? అంటున్నాడు… 73 శాతం ప్రజలకు ప్రాతినిధ్యం లేదంటున్నాడు…’’ బీజేపీ ద్రోహి సరే, మరి యావత్ క్రిస్టియన్ సమాజానికి, యావత్ విపక్ష సమూహానికి ప్రాతినిధ్యం వహిస్తూ సోనియా హాజరై ఉండొచ్చుగా… కేవలం బీజేపీ మీద వ్యతిరేకతతోనే కదా యావత్ విపక్షం గుడి ప్రారంభానికి దూరంగా ఉంది..? అంటే చేజేతులా అయోధ్యను బీజేపీకి అప్పగించినట్టే కదా…
తనకు తెలియదు, మొత్తుకోదు… మిస్టర్ రాహుల్, అయోధ్య ట్రస్టులో కూడా ఎస్సీ ఉన్నాడు… అంతేకాదు, అయోధ్య ప్రాణప్రతిష్ట సమయంలో గర్భగుడిలో ఆ మోడీ పక్కనే సదరు దళిత సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ నిల్చుని ఉన్నాడు… ఆయనెవరో తెలుసా..? 1989 లో గుడి పునాదికి మొదటి ఇటుక వేసింది తనే… 2002 నుంచి 2014 దాకా బిహార్ కౌన్సిల్ మెంబర్, తరువాత లోకసభకు పోటీచేశాడు… ఒక దశలో ఆ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిని చేస్తారని కూడా అనుకున్నారు… అదీ ఆయన నేపథ్యం…
(ఈ ఫోటోలో కామేశ్వర్ చౌపాల్ ఉన్నాడు…)
బీసీలు లేరంటాడు… సాక్షాత్తూ ప్రాణప్రతిష్ట చేసింది బీసీ మోడీయే.,. అదేమంటే అసలు మోడీ బీసీయే కాదంటాడు… (మోడీ మీద కోపంతో మోడీ కులస్తులందరూ దొంగలే అని గతంలో వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో ఇరుక్కున్నాడు కదా… ఇప్పుడు బీసీలు కాదంటూ యావత్ తేలి కులం మీద అసహనాన్ని ప్రదర్శిస్తున్నాడు…
తన ప్రసంగంలో పెద్ద జోక్ ఏమిటంటే..? అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ వచ్చారట, ఐశ్వర్యారాయ్ రాలేదట… అంటే ఆమె ఓసీ కాదు కాబట్టి రాలేదనే అర్థం వచ్చేలా ఈ విమర్శ..? బచ్చన్‌ల హాజరును ఉదహరిస్తూ మొత్తం అయోధ్య ఆహ్వానితులు సామాజికవర్గ లెక్కల్ని బయటికి తీశాడు రాహుల్ గాంధీ… వావ్… (జయాబచ్చన్ ఎందుకు రాలేదు అనడగలేదు ఎందుకో మరి… ఆమె బెంగాలీ బ్రాహ్మణ్ కాబట్టేనా..?) అన్నట్టు తనకు స్క్రిప్ట్ రాసిచ్చినవాళ్లకు తెలియదేమో… ఐశ్వర్య కర్నాటక కోస్తాకు చెందిన బుంట్ కులస్తురాలు… వాళ్లది యుద్ధ కులం… నాగదేవతలను ఆరాధించే క్షత్రియ కులం…
ఈ కథన ఉద్దేశమంతా ఒకటే… బీజేపీని వ్యతిరేకించండి, మోడీ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టండి, తన విధాన నిర్ణయాల్ని తూర్పారపట్టండి, అది రాజకీయం… బీజేపీ కూడా రాజకీయంగా బదులిస్తుంది… కానీ బీజేపీ మీద కోపాన్ని, ద్వేషాన్ని రాముడి మీద ఎందుకు గుమ్మరించడం..? కాబోయే ప్రధాని చేత ఇలాంటి కూతలకు రాతలు రాసిస్తున్న ఆ రైటర్లు ఎవరో గానీ… మ-హా-ను-భా-వు-లు…!! (అక్షితల్ని రేషన్ బియ్యం అని కొక్కిరించిన నాయకుడికన్నా రాహుల్ ఏం ఎక్కువ..? మళ్లీ తనే ఎన్నికలు రాగానే జంధ్యం మోస్తూ, నేను శివభక్తుడిని, కశ్మీరీ బ్రాహ్మణుడిని, ఫలానా గోత్రీకుడిని అని చెబుతూ తిరుగుతాడు…)
Share this Article