.
మెస్సీ కోసం, రేవంత్ రెడ్డితో తన ఆట చూడటం కోసం నిన్న స్టేడియం వెళ్లినవారు గానీ, లైవ్ చూసినవాళ్లు ఓ విషయం గమనించారో లేదో…
1) కోల్‌కత్తా చేదు అనుభవం ఎదుర్కున్న మెస్సీ హైదరాబాదులో మాత్రం తనకు ఆతిథ్యం, ఏర్పాట్లు, ప్రేక్షకుల సందోహం, స్వాగతం, స్టేడియంలో జోష్ పట్ల బాగా సంతృప్తితో ఎంజాయ్ చేసినట్టు కనిపించింది… (తనకు బస ఫలక్‌నుమా ప్యాలెసులో ఏర్పాటు చేశారు).,.
Ads
2) ఆహ్లాదంగా, ఉల్లాసంగా, సాఫీగా సాగిపోయింది తన పర్యటన… దీని క్రెడిట్ డీజీపీ శివధర్‌రెడ్డికి దక్కాలి… కోల్‌కత్తా పరిణామాలు తెలియగానే, ఇక తను స్వయంగా రంగంలోకి దిగి ఎక్కడికక్కడ కట్టుదిట్టాలు చేశాడు.., దాంతో ఈవెంట్ డిసిప్లిన్‌తో సాగిపోయింది…
3) సెల్ఫీకి ఏకంగా 10 లక్షల రేటు పెట్టినా సరే… 200 మంది దాకా రిజిష్టర్ చేసుకున్నారట… అఫ్‌కోర్స్, అది ప్రభుత్వానికి సంబంధం లేదు… ప్రైవేటు యవ్వారం, చివరకు 100 మందికి చాన్స్ ఇచ్చినట్టున్నారు…
4) మెస్సీకి ప్రేక్షకులను ఎలా అడ్రెస్ చేయాలో తెలియలేదు… అనేక దేశాల్లో వ్యాపారాలు, ప్రపంచ ఖ్యాతి ఉన్నా సరే ఇంగ్లిషు మీద పట్టు లేదు… మాట్లాడలేడు… మరి తనేం చేశాడు..?
- స్పానిష్‌లో మాట్లాడాడు… తనది అర్జెంటినా, చిన్నప్పుడే స్పెయిన్ వెళ్లాడు… రెండు దేశాల్లోనూ స్పానిషే అధికార భాష… కాకపోతే అర్జెంటీనా వాళ్ల యాస వేరు… రియోప్లాటెన్స్ అంటారు… (కొంత ఇటాలియన్ ప్రభావం ఉన్న యాస అది… తెలంగాణ యాస మీద ఉర్దూ ప్రభావం ఉన్నట్టు…)
దాంతో ఓ ట్రాన్స్‌లేటర్ తన క్షుప్త ప్రసంగాన్ని ఇంగ్లిషులో వినిపించింది… కానీ అదీ తప్పుతప్పుగానే..! హైదరాబాదులో చాలామంది పిల్లలు జర్మనీతోపాటు స్పానిష్ నేర్చుకున్నారు, కుంటున్నారు… వాళ్లు పట్టుకున్నారు మెస్సీ ప్రసంగాన్ని సరిగ్గా…
‘‘ఈరోజంతా మీరు కురిపిస్తున్న ప్రేమకు ముగ్దుడినయ్యాను… ఇక్కడికి వచ్చిన అభిమానులు, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు… హైదరాబాద్‌కు వచ్చి మీతో గడిపినందుకు ఆనందంగా ఉంది…’’

భాషా సమస్యే కారణమో, తన తత్వమే అది కావచ్చు… అందరితోనూ ఎక్కువగా మాట్లాడలేదు తను… కానీ గమనించారా..? రాహుల్ గాంధీతో మాత్రం చాలాసేపు ముచ్చట్లు పెట్టాడు… ఎందుకంటే..? రాహుల్‌కు స్పానిష్ వచ్చు… అదీ సంగతి… అలా ఇద్దరూ కనెక్టయిపోయారు…
- రాహుల్ చదువుకున్న ఫ్లోరిడాలో స్పానిష్ మాట్లాడేవాళ్లు అధికంగా ఉంటారు… స్పెయిన్, కొలంబియా వంటి దేశాల్లో పర్యటించినప్పుడు తను స్పానిష్‌లోనే మాట్లాడినట్టు కూడా వార్తలు గతంలో వచ్చాయి… ఎక్కడ నేర్చుకున్నాడో క్లారిటీ లేకపోయినా.,.. తను స్పానిష్ అనర్గళంగా మాట్లాడగలడు…
మెస్సీతోపాటు వచ్చిన ప్లేయర్లు ఎవరో తెలుసా మీకు..?
-
లూయిస్ సువారెజ్…: ఈయన మెస్సీ ఇంటర్ మయామి (Inter Miami) క్లబ్ సహచరుడు… అలాగే, ఉరుగ్వే జాతీయ జట్టు తరఫున ఆడతాడు…
-
రోడ్రిగో డి పాల్…: ఈయన కూడా మెస్సీ ఇంటర్ మయామి (Inter Miami) క్లబ్ సహచరుడు… అలాగే, మెస్సీతో కలిసి అర్జెంటీనా జాతీయ జట్టులో 2022 FIFA ప్రపంచ కప్‌ను గెలుచుకున్నాడు… మిడ్ ఫీల్డర్…
ఆసక్తికరంగా కనిపించింది మరొకటి ఏమిటంటే..? మెస్సీ వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది… కోల్‌కత్తాలో వాళ్లు కళ్లప్పగించి చూస్తుండి పోయారు గానీ హైదరాబాదులో… ట్రంపు వెనుక సెక్యూరిటీ అంత పటిష్టంగా కనిపించారు… మోడీ వెంట ఉండే ఎస్పీజీ కమెండోల్లాగా..! వాళ్లు మెస్సీ సొంత మనుషులు… అనేక దేశాల్లో వ్యాపారాలు, పర్యటనలు ఉండే వీవీవీఐపీ కదా… ఆమాత్రం సొంత భద్రత ఏర్పాట్లు తప్పవు…!!
Share this Article