Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శివోహం… శివ తత్వం, ఇష్ట లింగంపై రాహుల్‌ గాంధీకి అమితాసక్తి..!!

August 3, 2022 by M S R

2022 ఆగస్టు మూడో తేదీ… అంటే ఈరోజే… శ్రీమాన్ రాహుల్ గాంధీ గారు వార్తల తెర మీదకు వచ్చేశారు… హమ్మయ్య, అప్పుడప్పుడూ హఠాత్తుగా విదేశాలకు వెళ్లి, చాన్నాళ్లు ఉండి వస్తుంటాడు కదా… ఎక్కడికో, ఎందుకో ఎవరికీ తెలియదు, ఎవరూ చెప్పరు… అసలే రాహుల్ జీవితం ఎంతగా పుటలు తెరిచినా, తరచి తరచి చదివినా అంతుచిక్కని పుస్తకం… ప్రస్తుతం భారతదేశంలోనే ఉన్నారు సారు గారు…

కాంగ్రెస్‌ పార్టీకి అనధికారికంగా, వారసత్వంగా జాతీయ అధ్యక్షుడు తనే కదా… నాకొద్దు నాకొద్దు అంటాడు బయటికి… ఆచరణలో మాత్రం అలా వ్యవహరించడు… కర్నాటకలోని, చిత్రదుర్గ జిల్లాలో ఉన్న మురుఘ మఠాన్ని ఆయన సందర్శించాడు… అక్కడున్న పెద్దలను ఓ కోరిక కోరాడు… ‘‘అయ్యా, వీరశైవ పరంపర గురించి, వ్యవస్థాపకుడు బసవేశ్వరుడి గురించి కొంత చదివాను, ఇంకా వివరంగా తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, శివయోగంపై అవగాహన పెంచుకోవడానికి నాకు ఓ ప్రైవేటు ట్యూటర్‌ను పంపించగలరా..?’’

ఆయన వెంబడి కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్ ఉన్నారు… సిద్ధరామయ్య సంగతి తెలియదు… పెద్దగా ఆశ్చర్యం ఏమీ లేదు… సారు గారికి అప్పుడప్పుడూ అకస్మాత్తుగా హిందూయిజం గుర్తొస్తుంది… ప్రత్యేకించి ఎన్నికలొచ్చినప్పుడు ఆయన తను కశ్మీర్ పండిట్ అని యాదికొస్తుంది… గోత్రం ఏమిటో స్ఫురిస్తుంది… జంధ్యం ప్రత్యక్షమవుతుంది… గుడి దర్శనాలు, ప్రదక్షిణలు గట్రా ప్రారంభమవుతాయి… ఎంతకాదన్నా నెహ్రూ రక్తం కదా…

sivoham

ఇందిర ఫిరోజ్ గాంధీ అనే పారశీని పెళ్లి చేసుకున్నాక, గోత్రఖండన జరిగి ఉంటుంది కదా, ఇంకా రాహుల్ బ్రాహ్మడేమిటి..? అని కొందరు కుళ్లు కమలాలు గొణుగుతాయి కానీ… ఆ కుటుంబం తమ రాజకీయ అవసరాల కోసం హిందుత్వాన్ని అస్సలు విడిచిపెట్టదు… ఆమధ్య ప్రియాంక కూడా ఉత్తరప్రదేశంలో గంగాస్నానాలు, కాషాయహారాలు, రుద్రాక్షమాలలు, నానా ప్రయాసలూ చూశాం కదా… మగవారసుడు కాబట్టి రాహుల్ ఇంకాస్త ఎక్కువ రక్తికట్టించే ప్రయత్నం చేస్తుంటాడు…

rahul

కర్నాటకలో అసలే లింగాయత్‌లు, వీరశైవుల పరంపర ప్రభావం చాలా ఎక్కువ… సో, మరో 10 నెలల్లో ఎన్నికలు కదా… రాహుల్ ఆల్‌రెడీ మొదలు పెట్టేశాడు… ‘‘ఇష్టలింగం, శివయోగం గురించి నాకు మరింతగా తెలుసుకోవాలని ఉంది…’’ అంటున్నాడు… ట్యూటర్‌ను పంపించండి, నేర్చుకుంటా అంటున్నాడు…

అవునూ, చిత్రదుర్గలో రాహుల్ మురుఘ మఠానికి చెందిన శివమూర్తి మురుఘ శరణారు నుంచి లింగ దీక్ష స్వీకరించాడు కదా… మరి లింగాయత్‌లు తప్పనిసరిగా స్ఫటిక లింగాన్ని ధరిస్తుంటారు కదా… రాహుల్ ‘‘ప్రాక్టీసింగ్ లింగాయత్’’ అనుకోవచ్చా..? అనగా లింగాయత్ పరంపరను నిజాయితీగా, చిత్తశుద్ధిగా గౌరవిస్తున్నాడా..?! ఏమోలెండి… రాహుల్ ప్రభావం పనిచేయకుండా ఉండటానికి రేప్పొద్దున మోడీ ఏం వేషమించాలో ఏమిటో…! శివోహం, శివోహం…!!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • మందుపాట ఘంటసాల పాడితేనే కిక్కు… వైరాగ్యపు మత్తు…
  • సినిమాకు ఓ లేఖ ప్రాణం… ఆ లేఖ దగ్గరే తప్పుదొర్లితే…? అదే సీతారామం…!!
  • నిత్యమేనన్ చేసిన తప్పు…! ఆరేళ్ల క్రితమే వాడి వీపు పగలాల్సింది…!!
  • సింహాలు అమ్మబడును…! దివాలా తీసిన పాకిస్థాన్ సర్కారు పొదుపుపాట్లు..!!
  • నేషనల్ హెరాల్డ్ కేసు ప్రభావం వచ్చే కర్నాటక ఎన్నికల మీద…!
  • బాబ్బాబు… ప్లీజ్… మీరు వస్తుండండి..? పోనీ, నన్నే హైదరాబాద్ రమ్మంటారా..?!
  • టీవీ ప్రేక్షకుల్ని ఈటీవీ, మల్లెమాల పిచ్చోళ్లను చేసి, వెక్కిరించడమే ఇది…!!
  • మిస్సింగ్ గరల్ నంబర్ 166… తొమ్మిదేళ్ల ఓ అన్వేషణ కథ… ఓ పోలీస్ గ్రేట్‌నెస్…
  • ఓహ్… ఆత్రేయ రాసిన ఆ బర్త్‌డే పాటలో అంత ఫిలాసఫీ ఉందా..?
  • హీరోయిన్ కాదు, లేడీ డాన్… మాఫియా క్వీన్… గంగూబాయ్ మీద ఓ రీలుక్…!

Archives

Copyright © 2022 · Muchata.com · Technology Support by CultNerds IT Solutions