ముందుగా ఓ పోస్ట్ చదవండి… లలిత అని ఓ వీఐపీ గీతరచయిత సతీమణి… అమ్మా, ఆమ్రపాలి, దీన్ని ఏమైనా పట్టించుకుంటే నువ్వు తెలంగాణకు, ప్రత్యేకించి హైదరాబాదు జనానికి ఎనలేని మేలు చేకూర్చినదానివే అవుతావు… నాకెందుకు తీట అనకు… నువ్వు ఐదారు నగర పోస్టులకు అధికారిణివి మరి…!
నగరంలో పార్కింగ్ అనేది ఓ పెద్ద దందా… చివరకు పబ్లిక్ ప్లేసుల్లో అఫిషియల్ పార్కింగ్ ఏజెన్సీలది మరింత పెద్ద దందా.,.. కాదు, దోపిడీ… యాదగిరిగుట్ట మీద 500, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 600 అనేవి నథింగ్… హైదరాబాదులో ఓ మాఫియా ఇది…
ఇంతకీ ఆ పోస్ట్ చూద్దామా…?
.
Ads
_________________________
Secunderabad Railway station కి స్వంత car లో వెళ్ళేవాళ్ళు ఇక నుంచి అక్కడి car parking fees గురించి తెలుసుకొని వెళ్తే మంచిది…
ముఖ్యంగా 10 వ నంబర్ platform కి వెళ్లాలనుకునే వాళ్ళు బోయగూడ వైపు వెళ్తుంటారు… అక్కడ parking దందా అయితే మామూలుగా లేదు…
మొదటి 10 నిమిషాలకి 100 rs, 10 నుండీ 30 నిమిషాలకి 200 rs, 30 mints దాటిందా.. extra ఒక్క నిమిషమైనా సరే … 500 లు.. సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉండండి.. మరీ ఇంత దారుణమా…
Cab కి వెళ్ళినా 200/300 వందలు దాటవు.. అదేంటి అంత too much కదా అని అడిగితే.. మాదేం లేదు మేడం.. రైల్వే వాళ్ల fees అవి అంటున్నారు… ఇందులో నిజం ఎంతో తెలీదు.. మనం ఎవ్వరం అయినా సరే స్టేషన్ కి, pick up కోసమో, లేక dropping, or send off ఇవ్వడం కోసమో కనీసం అరగంట ముందు వెళ్తాం కదా.. 30 నిమిషాల పార్కింగ్ కి 500 లా…
Airport లో కూడా ఇంత too much fees ఉండవు.. ముక్కుపిండి వసూలు చేద్దాం అనుకుంటే.. రైల్వే parking ఆదాయం పెరగడం ఏమో గానీ హాయిగా cabs book చేసుకొని వెళ్తారు జనం… అందుకే అంటారు అతి సర్వత్రా వర్జయేత్ అని…
.
_____________________
ఇక్కడ ఆమ్రపాలిని ఎందుకు రియాక్ట్ కావాలని అడగడం అంటే…. ఆ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్‌ను గోకితే రెట్టింపు చేస్తాడు ఫీజు… మోడీ ఎన్నుకున్న ఓ దిక్కుమాలిన కేంద్ర మంత్రి ఆయన… నయాపైసా పీపుల్ కన్సర్న్ కాదు… ఐనా, మోడీకి అలాంటివాళ్లే కావాలి కదా…
ఇక్కడే కాదు, హైదరాబాదులో అనేక పబ్లిక్, టూరిస్టు ప్లేసుల్లో ఇదే దందా… పేరుకు అరగంటకు ఇంత, అని మినిమం… ఇక ఆ తరువాత వాయింపు మామూలుగా ఉండదు… 10 నిమిషాలు, అరగంట పార్కింగ్ సమయం ఏమిటో తలతిక్క బ్యూరోక్రాట్లకే తెలియాలి… ఎవడూ పట్టించుకోడు… (కొంతలోకొంత ఆర్టీసీ పెద్ద బస్టాండ్ల పార్కింగ్ రేట్లు కాస్త నయం…)
జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, పాలకవర్గానికి డబ్బులు, సంపాదన తప్ప మరో లోకం లేదు… సగటు మనిషిని పట్టించుకునేటోడే దొరకడు… అది బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా… ఇలాంటి విషయాలు ఎవడికీ పట్టవు… భరించండి అంటారా..? అంతేలెండి… భరించక చస్తామా..?! అందుకే రేవంతుడు నమ్మిన ఆ ఆమ్రపాలిని … అమ్మా, మీరేమైనా సొల్యూషన్ చెప్పగలరా అని మొర పెట్టుకోవడం …
కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు చెబుదాం అంటారా..? భలేవారే… మనిషికి మరీ అంత అత్యాశా…!! మీకొక ప్రైవేటు ఫ్లయిట్ ఉందనుకొండి, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దాన్ని పార్క్ చేసినా సరే, మరీ ఇంత రేటు ఉండదేమో అని జోకాడు ఓ మిత్రుడు… జోకే, కానీ నిజముంది…!!
Share this Article