Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఐటమ్ స్టెప్పులే కాదు… జయమాలినికి ఓ మంచి పాత్ర ఇచ్చారు…

April 24, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …….. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు…, రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు, ఆనాడు… ఎవరూ అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది..,ఆ రామాయణం మన జీవన పారాయణం .

Most melodious song . Hats off to Veturi and Ilayaraja . 1983 లో వచ్చిన ఈ రాజకుమార్ సినిమా లోనిదే ఈ పాట . ఈ పాటే కాదు .‌ మిగిలిన పాటలు కూడా చాలా శ్రావ్యంగా ఉంటాయి . మరో శ్రావ్యమైన పాట తెలుగు భాష , సంస్కృతి , ఔన్నత్యాల మీద సాగే పాట . తేనె కన్న తీయనిది తెలుగు భాష . ఆరుద్ర వ్రాసారు .

Ads

మొదటి పాట శోభన్ బాబు , జయసుధల మీద , రెండవది శోభన బాబు , అంబికల మీద . జయమాలిని పాట కూడా శ్రావ్యంగా ఉంటుంది . గోదారి పొంగులా హై రాదారి బంగళా హై . రహదారి బంగళాలో కేర్ టేకరుగా ఈ సినిమాలో జయమాలినికి మంచి పాత్రే లభించింది . మరో పాట శోభన్ బాబు , జయసుధల మీద సాగుతుంది . అర్ధరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా .

శోభన్ బాబు , జయసుధ , అంబికలు ప్రధాన పాత్రలలో నటించిన ఈ రాజకుమార్ సినిమా కన్నడంలో సక్సెస్ అయిన చళిసువ మోదగలకు రీమేక్ . కన్నడంలో రాజకుమార్ , అంబిక , సరితలు ప్రధాన పాత్రలలో నటించారు . కన్నడంలో సక్సెస్ అయినట్లుగా మన తెలుగులో సక్సెస్ కాలేదు .

సినిమా బాగానే ఉంటుంది . శోభన్ బాబు , జయసుధలు చాలా అందంగా ఉంటారు . చాలా చలాకీగా నటించారు . శోభన్ బాబు షర్టులు భలే అందంగా ఉంటాయి . 1+2 సినిమా కాబట్టి ఫస్ట్ హాఫ్ రొమాన్స్ , పాటలతో ఉన్నా సెకండ్ హాఫ్ సస్పెన్సుతో మలుపులు తిరిగి ఆసక్తికరంగానే ఉంటుంది . ఇళయరాజా సంగీతం చాలా శ్రావ్యంగా ఉంటుంది . ఎందుకనో ప్రేక్షకులకు ఎక్కలేదు .

హీరో జడ్జి గారబ్బాయి . గారాబంగా పెరిగి లాయర్ అవుతాడు . మరదలు జయసుధ హీరో మీద మనసు పారేసుకుంటుంది . మేనత్త కొడుకు తనకే స్వంతం అనే possessive mentality తో ఉంటుంది . హీరో గారికి మరో అమ్మాయి అంబిక నచ్చుతుంది . ప్రేమలో పడతారు .

సడెన్గా అంబిక హీరోని తిరస్కరిస్తుంది . ఆ షాకులో ప్రమాదానికి గురయిన బావకు రక్తాన్నిచ్చి రాత్రింబవళ్లు సేవ చేసి మరదలు కాపాడుకుంటుంది . ఆ కృతజ్ఞతతో హీరో గారు మరదల్ని పెళ్లి చేసుకుంటాడు . So far so good .

హీరో గారు లాయరుగా , హీరోయిన్ గారు పబ్లిక్ ప్రాసిక్యూటరుగా సాఫీగా సాగిపోతుంటుంది లైఫ్ . ఇంతలో అంబిక మొగుడు , డాన్స్ మాస్టారు నూతన్ ప్రసాదుని హత్య చేసినందుకు జైలు పాలవుతుంది . భార్యాభర్తలు కోర్టులో ఒకరికి ఒకరు తలపడతారు . తల్లే హత్య చేసిందని కూతురు అంబిక చేయని హత్యను తన మీద వేసుకుంటుంది .

అయితే అసలు హంతకురాలు జయమాలిని . ఆఖరి క్షణంలో తీర్పు చెప్పే ముందు కోర్టులో ప్రత్యక్షమై తానే హత్య చేసానని సాక్ష్యం ఇస్తుంది . అంబిక విడుదల అవుతుంది . ఇదీ కధ .

ఇతర ప్రధాన పాత్రలలో రావు గోపాలరావు , అల్లు రామలింగయ్య , షావుకారు జానకి , నిర్మలమ్మ , రాంజీ , ప్రభృతులు నటించారు . జి రామినీడు దర్శకత్వం వహించిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . శోభన్ బాబు అభిమానులు చూడవచ్చు .

మైసూరు బృందావన్ గార్డెన్సులో , మద్రాస్ వల్లువార్ కొట్టంలో పాటలు షూట్ చేయబడ్డాయి .‌ ఇతర ఔట్ డోర్ లొకేషన్లు కూడా బాగుంటాయి . యూట్యూబులో పాటల వీడియోలు ఉన్నాయి . సంగీత ప్రియులు అస్సలు మిస్ కాకండి . తప్పక చూస్తూ వినండి .

ముఖ్యంగా జానకి కలగనలేదు రాముడి సతి కాగలనని ఏనాడు , తేనె కన్న తీయనిది తెలుగు భాష పాటలు . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘బ్రదర్ కొంత కరెంటు సర్దుతావా..? వచ్చే నెలలో తిరిగి ఇచ్చేస్తా…’’
  • రెడ్ బుక్ సరే… పింక్ బుక్ సరే… అసలు ఈ బ్లూ బుక్ ఏమిటో తెలుసా..?
  • ట్రోలర్‌కు చెప్పుతో కొట్టినట్టు కౌంటర్… మీకు బూమ్రా-సంజనా కథ తెలుసా…
  • కేటీఆర్ ఇలా ట్వీటాడో లేదో… కవిత నుంచి కౌంటర్ పడింది…
  • త్రిష మళ్లీ హర్టయింది..! సీత మాజీ భర్తకు స్ట్రాంగ్ కౌంటర్ ..!
  • అసలే జలపాతం చలి… కేవలం బికినీ… అప్పటి క్రేజీ లిరిల్ యాడ్ కథ…
  • హోరెత్తిన ఇండియా..! మురిపెంగా T20 వరల్డ్ కప్ ముద్దాడిన ఈ క్షణం..!!
  • అమెరికా తాజా ప్రేలాపనలకు విదేశాంగ మంత్రి జైశంకర్ జవాబు…
  • సూర్యకుమార్ కెప్టెన్సీ వైఫల్యాలు కాటేయకపోతే… గెలుపు మనదే…
  • అరవయ్యేళ్ల ఆ మహిళ ఎవరామె..? కాస్త సీరియస్‌గా చదవండి…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions